AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Sandesh: ఉదయ్ కిరణ్, తరుణ్‏లతో నన్ను పోల్చొద్దు.. హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్..

'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం మూవీతో సక్సెస్ అందుకున్నాడు.

Varun Sandesh: ఉదయ్ కిరణ్, తరుణ్‏లతో నన్ను పోల్చొద్దు.. హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్..
Varun Sandesh
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2021 | 6:50 AM

Share

‘హ్యాపీడేస్’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం మూవీతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో వరుణ్ కెరీర్ ముగిసిపోయిందని చాలా మంది అనుకున్నారు. ఇక అదే సమయంలో బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి తన భార్య వితికతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షోలో వరుణ్ ఆట తీరు.. తన ప్రవర్తనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇందువదన అనే సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చాడు వరుణ్. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎమ్మెస్సార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తరుణ్, దివంగత హీరో ఉదయ్ కిరణ్‏తో తనను పోల్చవద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వరుణ్.

ఇటీవల ఓ ఛానెల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు యాంకర్.. మీ కెరీర్ కూడా.. తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు కెరీర్ కొత్తలో మంచి ఫేం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆఫర్లకు దూరమయ్యారు. అయితే వరుణ్ స్పందిస్తూ.. వారిద్దరితో తనను పోల్చవద్దని చెప్పాడు. ఉదయ్ కిరణ్ నాకు బాగా తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో అని చాలా బాధపడ్డాను. అలాగే తరుణ్ కూడా తెలుసు. నా చేతుల్లో నుంచి కోల్పోయినదాన్ని తెచ్చుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. బిగ్‏బాస్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాను. కోవిడ్, ఇతర కారణాల వలన ఆ సినిమాలు సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఆ తర్వాత యూఎస్ కు వెళ్లి ఐటీ కోర్సు చేశాను. ఏదో వ్యాపారంలోకి అడుగుపెట్టాల‌నే ఆలోచ‌న కూడా ఉంద‌ని వ‌రుణ్ అన్నాడు. 2015లో నటి వితికా షేర్‏ను వివాహం చేసుకున్నాడు వరుణ్ సందేశ్.

Also Read: Raj Kundra Arrest: పేదరికం నుంచి వచ్చాను.. నేను డబ్బును లెక్కలేకుండా ఖర్చు పెడతాను..  వైరల్ గా మారిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యాఖ్యలు 

Allu Arjun: దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌పై సందడి చేసిన బన్నీ ఫ్యామిలీ.. భార్య, చిన్నారులతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌..