AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా? అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలో తెలుసుకోండి! వైద్యుల సూచనలు ఇవే

మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయాలంటే తగినంత నీరు తీసుకోవడం అత్యవసరం. వైద్యుల అభిప్రాయం ప్రకారం, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు పరిమితంగా నీరు తీసుకోవాలి. మీ మూత్రం రంగు మీ ఆరోగ్యానికి సూచిక అంటున్నారు నిపుణులు. అయితే, నీటి అవసరం అనేది వ్యక్తి వయస్సు, లింగం, శారీరక శ్రమ, వారు నివసించే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కిడ్నీల (మూత్రపిండాలు) ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగాలి..? నీటి ప్రాముఖ్యత ఏమిటో వైద్యులు వివరించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా? అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలో తెలుసుకోండి! వైద్యుల సూచనలు ఇవే
Kidney Health
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2026 | 9:36 AM

Share

ఆరోగ్యకరమైన శరీరానికి నీరు చాలా అవసరం. మనం ప్రతిరోజూ నీటితోనే మన రోజును ప్రారంభించాలి. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే మూత్రపిండాలు, కాలేయం కూడా సరిగ్గా పనిచేస్తాయి. జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నీరు తాగడం వల్ల శక్తి పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. ప్రతిరోజూ పరగడుపున నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలో డాక్టర్ ప్రభాత్ రంజన్ సిన్హా గారి నుండి తెలుసుకుందాం.

శరీరంలోని రక్తాని శుద్ధి చేసి, విషతుల్యాలను (Toxins) మూత్రం రూపంలో బయటకు పంపే అద్భుతమైన యంత్రాలు కిడ్నీలు. ఈ ప్రక్రియ సాఫీగా సాగాలంటే శరీరానికి తగినంత నీరు అందాలి. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతుంటారు. కానీ, కిడ్నీల రక్షణ కోసం నీటి వినియోగంపై స్పష్టమైన అవగాహన ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు ఎంత నీరు అవసరం?:

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఒక వయోజనుడు రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీరు (సుమారు 3 లీటర్లు) తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు తగినంతగా తాగడం వల్ల కిడ్నీలలో ఖనిజాలు పేరుకుపోకుండా ఉంటుంది. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది.

తక్కువ నీరు త్రాగితే వచ్చే సమస్యలు: శరీరంలో నీటి శాతం తగ్గితే (Dehydration), కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లవణాలు గడ్డకట్టి రాళ్లుగా మారుతాయి. మూత్రనాళంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీర్ఘకాలం పాటు తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ పనితీరు మందగిస్తుంది.

మీరు సరిగ్గా నీరు తాగుతున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?:

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యానికి సూచిక అంటున్నారు నిపుణులు. ఎలాగంటే మూత్రం రంగు పారదర్శకం/లేత పసుపు రంగులో ఉంటే, మీరు హైడ్రేటెడ్‌గా ఉన్నారు. అదే ముదురు పసుపు/గోధుమ రంగులో ఉంటే, మీ శరీరానికి వెంటనే నీరు అవసరమని అర్థం.

నీరు తాగడం అంటే కేవలం సాదా నీరు మాత్రమే కాదు. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ రూపంలో కూడా ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. అయితే, ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు నీటి పరిమాణం విషయంలో తమ డాక్టరును సంప్రదించడం తప్పనిసరి. గుర్తుంచుకోండి, నీరే కిడ్నీలకు ఉత్తమమైన మందు!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!