వైరల్ అవుతున్న వనితా విజయ్‌‌‌‌కుమార్ ఫోటో.. మూడు పెళ్లిళ్లు పెటాకులైన తర్వాత ఇప్పుడు నాలుగో పెళ్లా..?

Vanitha Vijayakumar: వనితా విజయ్ కుమార్.. ఈ పేరు ఈ మధ్యకాలంలో కోలీవుడ్‌‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినిమాలకంటే వివాదలాతోనే వనిత పాపులర్ అయ్యారు.

వైరల్ అవుతున్న వనితా విజయ్‌‌‌‌కుమార్ ఫోటో.. మూడు పెళ్లిళ్లు పెటాకులైన తర్వాత ఇప్పుడు నాలుగో పెళ్లా..?
Vanitha

Vanitha Vijayakumar: వనితా విజయ్‌‌కుమార్.. ఈ పేరు ఈ మధ్యకాలంలో కోలీవుడ్‌‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినిమాలకంటే వివాదలాతోనే వనితా ఎక్కువ పాపులర్ అయ్యారు. ఒకటి  కాదు.. రెండు కాదు.. ఎకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచారు. అంతేకాదు ఈ పెళ్లిళ్ల విషయంలో నానా రచ్చకూడా జరిగింది. తన పై వచ్చిన విమర్శలకు ఘాటూగా సమాధానాలు చెప్తూ హాట్ టాపిక్ గా మారారు. ముచ్చటగా మూడోసారి పీటర్ పాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వనితా విజయ్ చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మూడో భర్తకు దూరమైన విషయం తెలిసిందే. ఇక 2000సంవత్సరంలో నటుడు ఆకాష్‌‌‌ను వనిత వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలకు జన్మనించిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చారు. ఆతర్వాత 2007లో ఓ బిజినెస్‌‌‌మ్యాన్ ను వివాహమాడింది. ఆయనతో ఐదేళ్ళు కాపురం చేసిన తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌‌‌తో నాలుగేళ్ళు ప్రేమాయణం సాగించింది. ఆ తరవాత 2017లో అతడితో కూడా విడిపోయింది. చివరిగా పీటర్‌‌‌పాల్ తన మొదటి భార్య ఎలిజబెత్‌ను మోసం చేసి వనితాను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పైన కూడా రచ్చ జరిగింది. బర్త్ డే వేడుకలకు గోవాకు వెళ్లడం, అక్కడ పీటర్ పాల్ తీరు నచ్చకపోవడంతో ఇంట్లోంచి గెంటేశారట వనితా. ఈ మేరకు మూడో పెళ్లి కూడా పెటాకులైందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా వనితా విజయ్‌‌కుమార్ కు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌‌‌‌చల్ చేస్తోంది. తమిళనాడు పవర్‌‌స్టార్‌‌‌గా పిలువబడే శ్రీనివాసన్‌‌‌తో పెళ్లైనట్టుగా ఒక ఫోటోను షేర్ చేసింది వనితా విజయ్ కుమార్. తన సోషల్ మీడియా అకౌంట్‌‌‌లో ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ.. లవ్ సింబల్స్‌‌‌తోపాటు పవర్‌‌‌‌స్టార్ ఇక్కడ.. అని రాసుకొచ్చింది వనితా. దాంతో ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ అమ్మడు ఏకంగా నాలుగో పెళ్లి చేసుకుందా..? అని చేర్చించుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aha: మరిన్ని ఇంట్రస్టింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్న ఆహా.. అవేంటటే

Shilpa Shetty : శాలువాలు అమ్ముకునే రాజ్‌‌‌కుంద్రా.. బాలీవుడ్ బ్యూటీ శిల్పాను ఎలా వలలో వేసుకున్నాడో తెలుసా..

Priyamani: ప్రియమణి వివాహం చెల్లదు.. మేము ఇంకా విడాకులు తీసుకోలేదు.. రంగంలోకి ముస్తాఫా మొదటి భార్య..