AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyamani: ప్రియమణి వివాహం చెల్లదు.. మేము ఇంకా విడాకులు తీసుకోలేదు.. రంగంలోకి ముస్తాఫా మొదటి భార్య..

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి.. ముస్తఫా వివాహం చెల్లదు అంటూ అతడి మొదటి భార్య వాదిస్తుంది. మేము ఇంకా విడాకులు తీసుకోలేదని..

Priyamani: ప్రియమణి వివాహం చెల్లదు.. మేము ఇంకా విడాకులు తీసుకోలేదు.. రంగంలోకి ముస్తాఫా మొదటి భార్య..
Priyamani
Rajitha Chanti
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 22, 2021 | 2:28 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి, ముస్తఫా వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య వాదిస్తోంది. తామిద్దరూ విడాకులు తీసుకోనందున భార్యాభర్తలుగానే ఉన్నామని.. వాళ్లిద్దరిది అక్రమ వివాహం అంటూ రంగంలోకి దిగింది. ఇటీవల ఓ ఛానెల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్తఫా, ప్రియమణి వివాహం గురించి సంచలన విషయాలను బయటపెట్టింది ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా. ముస్తఫా రాజ్, ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత.. మనస్పార్థలతో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటూ వచ్చారు. ఇక తమ పిల్లల కోసం ముస్తఫా రాజ్ ప్రతి నెలా కొంత మొత్తం పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2017లో హీరోయిన్ ప్రియమణిని వివాహం చేసుకున్నాడు ముస్తాఫా రాజ్. అప్పటి నుంచి ప్రియమణితో కలిసి ఉంటున్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయిన ప్రియమణి.. తిరిగి ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‏లో కనిపించిన ప్రియమణి.. తాజాగా వెంకటేష్ సరసన నారప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రియమణి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇదిలా ఉంటే.. అన్యోన్యంగా దాంపత్య జీవనం గడిపేస్తున్న ప్రియమణి.. ముస్తఫా వివాహం చెల్లదు… ఆయన ఇంకా నా భర్తే అంటూ రంగంలోకి దిగింది ముస్తఫా మొదటి భార్య. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని.. కనుక ఇప్పటికీ ముస్తఫా తన భర్తే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మేము విడాకుల కోసం కోర్టులో అప్లై చేయలేదని.. విడిగా మాత్రమే ఉంటున్నామని.. కానీ.. ప్రియమణిని వివాహం చేసుకునే సమయంలో తాను బ్రహ్మాచారి అని ముస్తఫా చెప్పుకున్నట్లుగా ఆయేషా తెలిపింది. ఇప్పుడు ముస్తఫా తనను.. తన పిల్లలను పట్టించుకోవడం లేదని.. మేము ఇంకా విడాకులు తీసుకోనందున ప్రియమణి వివాహం చెల్లదని ఆయేషా తెలిపింది.

ఇక ఆయేషా ఆరోపణలపై ప్రియమణి భర్త ముస్తఫా స్పందించాడు.. తాను పిల్లల కోసం ప్రతి నెలా కొంత డబ్బు ఆయేషాకు పంపిస్తున్నానని.. ఒకవేళ అలా పంపకపోతే.. ఇన్ని రోజుల ఎందుకు సైలెంట్‏గా ఉందని ప్రశ్నిస్తున్నాడు. కేవలం డబ్బుల కోసం ఆయేషా ఇలా చేస్తుందని ముస్తఫా ఆరోపించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తన భర్త గురించి మాట్లాడుతూ.. ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ప్రియమణి పెళ్లి విషయం మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్‏గా మారింది.

Also Read: Samantha Akkineni: ‘నారప్ప’ సినిమాకు ఒక్క మాటలో రివ్యూ రాసిన సమంత..

Ariyana: అభిమానులకు షాకిచ్చిన అరియానా.. వెంటిలేటర్ పై అలా.. వీడియో షేర్ చేసిన ‏బిగ్‏బాస్ బ్యూటీ..

ఈ చిన్నారి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలే.. ఎవరో గుర్తుపట్టండి..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..