AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్నారి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలే.. ఎవరో గుర్తుపట్టండి..

తమ అభిమాన హీరోహీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వారి పుట్టిన రోజు నుంచి.. చిన్ననాటి ఫోటోలను సేకరించడం..

ఈ చిన్నారి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలే.. ఎవరో గుర్తుపట్టండి..
11
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2021 | 11:08 AM

Share

తమ అభిమాన హీరోహీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వారి పుట్టిన రోజు నుంచి.. చిన్ననాటి ఫోటోలను సేకరించడం.. వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో తమకు ఇష్టమైన హీరోహీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి పెద్దగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన తారలు.. అభిమానులతో లైవ్ చాటింగ్స్ చేస్తూ.. తమకు సంబంధించిన విషయాలు.. త్రోబ్యాక్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పూజా హెగ్డే.. అనుష్క వంటి తారల చైల్డ్ హుడ్ ఫోటోలను నెట్టింట్లో హల్‏చల్ చేశాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ చిన్నానాటి ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‏లో వైరల్ అవుతుంది. పైన ఫోటో చూశారుగా ఆ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. చూసి గుర్తుపట్టేయండి చూద్దాం.

22

గుర్తు పట్టడం కాస్త కష్టమే. అందుకే ఇప్పుడు ఈ ఫోటోను కూడా చూసేయ్యండి. గుర్తుపట్టారా ? తన చెల్లితో కలిసి ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మకు తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. తన నటనకు.. నెమలిలా నృత్యం చేసే ఈ హీరోయిన్‏కు ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే.

Sai Pallavi

ఈ చిన్నారి మరెవరో కాదండోయ్.. వరుణ్ తేజ్‏కు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసిన సాయి పల్లవి. నటనతోపాటు.. డ్యాన్స్‏లోనూ తనదైన స్టైల్‏తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది సాయి పల్లవి. తమిళం, మళయాలం, తెలుగు అనే సంబంధం లేకుండా అన్ని చోట్లా సాయి పల్లవి హవా సాగుతోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యాం సింఘ రాయ్ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే రానా దగ్గుపాటి సరసన విరాటపర్వం.. నాగ చైతన్యకు జోడిగా లవ్ స్టోరీ సినిమాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ట్వీట్..

Also Read: వారి మధ్య ఏ గొడవ లేదు.. కానీ ఆ స్టార్ హీరోలు ఇద్దరు 16 సంవత్సరాలు మాట్లాడుకోలేదు.. ఎందుకంటే..

Kangana Ranaut: మరోసారి వివాదాల్లోకి కంగన.. ముంబాయి హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్..