వారి మధ్య ఏ గొడవ లేదు.. కానీ ఆ స్టార్ హీరోలు ఇద్దరు 16 సంవత్సరాలు మాట్లాడుకోలేదు.. ఎందుకంటే..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. హీరో సన్నిడియోల్ ఇద్దరూ బాలీవుడ్‏లో స్టార్స్. వీరిద్దరు 1993లో విడుదలైన డర్ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

వారి మధ్య ఏ గొడవ లేదు.. కానీ ఆ స్టార్ హీరోలు ఇద్దరు 16 సంవత్సరాలు మాట్లాడుకోలేదు.. ఎందుకంటే..
Sharukh Sunny

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. హీరో సన్నిడియోల్ ఇద్దరూ బాలీవుడ్‏లో స్టార్స్. వీరిద్దరు 1993లో విడుదలైన డర్ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇందులో హీరోగా సన్నిడియోల్ నటించగా.. విలన్ పాత్రలో షారుఖ్ ఖాన్ నటించాడు. అయితే హీరో కంటే విలన్‏గా నటించిన షారుఖ్ ఖాన్ ఎక్కువ గుర్తింపు పొందాడు. ఇక ఇదే సినిమా సన్ని డియోల్ ఇమేజ్ మొత్తాన్ని నాశనం చేసింది. ఎందుకంటే.. దర్శకుడు యశ్ చోప్రా ఈ సినిమాలో హీరో కంటే.. విలన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. విలన్ పాత్రకే ఎక్కువగా మద్దతు ఉండేలా తెరకెక్కించారు. ఈ మూవీ తర్వాతే.. షారుఖ్ ఖాన్‏కు ఎక్కువగా స్టార్ డమ్ దక్కింది.

వీరిద్దరి మధ్య ఏలాంటి గొడవ జరగలేదట.. కానీ దాదాపు 16 సంవత్సరాలు వారిద్దరు మాట్లాడుకోలేదట. షారుఖ్‎తో మాట్లాడేందుకు సన్ని డియోల్ ఆసక్తి చూపించలేదట. కొన్నాళ్లపాటు ఎదురు పడకుండా ఉండేవాడట. ఇక కొన్నిసార్లు ఎదురుపడిన మాట్లాడకుండా ఉండేవాడట. అలా 16 ఏళ్లు గడిచిపోయాయని సన్నీ డియోల్ తెలిపారు. ఇందుకు కారణం.. డర్ సినిమానే. అందులో క్లైమాక్స్‏లో విలన్ షారుఖ్ ఖాన్.. హీరో అయిన సన్నిడియోల్ ను కొట్టే సన్నివేశం ఉంటుంది. అయితే ఆర్మీ ఆఫీసర్ అయిన హీరోను ఎలా ఒక విలన్ కొడతాడని దర్శకుడితో సన్ని డియోల్ అప్పట్లో గొడవ పెట్టుకున్నాడట. క్లైమాక్స్‏ను మార్చాలని పట్టుబట్టిన.. డైరెక్టర్ మాత్రం షారుఖ్ ఖాన్‏ను అనుకూలంగానే క్లైమాక్స్ డిజైన్ చేశాడట. దీంతో అప్పటి నుంచి దర్శకుడు యశ్, షారుఖ్ ఖాన్‏లతో ఏలంటి గొడవ లేకున్నా…సన్ని డియోల్ మాట్లాడేందుకు ఇష్టపడలేదట. ఈ విషయాలను సన్ని డియోల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Also Read: Kangana Ranaut: మరోసారి వివాదాల్లోకి కంగన.. ముంబాయి హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్..

Hansika: సింగిల్‏గానే కొత్త సినిమాను స్టార్ట్ చేసిన హన్సిక.. సింగిల్ షాట్ మూవీ అంటున్న హీరోయిన్..

Karthika Deepam July 22 Episode: మా ఆయన సాఫ్ట్ వేర్.. నేను హార్డ్ వేర్.. మోనిత చేత నీళ్ళు తాగించిన దీప!