Poonam Pandey: రాజ్ కుంద్రా చీకటి వ్యవహారంపై పూనం పాండే సంచలన వ్యాఖ్యలు
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన అరెస్టు తరువాత బాలీవుడ్ నటి పూనమ్ పాండే స్పందించింది. ఈమేరకు మాట్లాడుతూ, 'రాజ్ కుంద్రా అరెస్టుతో న్యాయవవస్థపై తనకు నమ్మకం పెరిగిందని పేర్కొంది.
Raj Kundra Arrest: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన అరెస్టు తరువాత బాలీవుడ్ నటి పూనమ్ పాండే స్పందించింది. ఈమేరకు మాట్లాడుతూ, ‘రాజ్ కుంద్రా అరెస్టుతో న్యాయవవస్థపై తనకు నమ్మకం పెరిగిందని పేర్కొంది. ఒక ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ, రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా కేస్ ఫైల్ చేసినందుకు నన్ను బెదిరించారు. వారి ఇష్టానికి అనుగుణంగా నటించాలని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇలా చేయకుంటే నా వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తామని ఇబ్బంది పెట్టారు. వారి ఒప్పందాలకు నేను సంతకం చేయకుండా, వారితో యాప్ బిజినెస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దీంతో వారు నా ఫొటోలు, వీడియోలు, పర్సనల్ ఫోన్ నంబర్ ఆన్‌లైన్‌లో పెట్టారని’ పూనం పాండే వెల్లడించింది. ఇక 2019 లోనే యాప్‌లో తన వాటాను విక్రయించానని పేర్కొంది.
ప్రస్తుతం తన మనసంతా రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి, వారి ఇద్దరి పిల్లలపై ఉందని, సానుభూతిని వ్యక్తం చేసింది. 2019 లో రాజ్ కుంద్రా, నేను కలిసి ఒక యాప్‌ను ప్రారంభించాం. ఆ యాప్ లావాదేవీల విషయంలో శిల్పాశెట్టి భర్త తనను మోసం చేశాడని ఆరోపించింది. ఈమేరదకు బొంబాయి హై కోర్టులో పిటీషన్ వేశానని, అప్పటి నుంచి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాని, ఇప్పటికి న్యాయ వ్యవస్థపై నమ్మకం మరింత పెరిగిందని’ ఆమె తెలిపింది.
ఆ సమయంలో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని వాపోయింది. తన ఫోటోలు, పర్సనల్ నంబర్‌ను పలు యాప్‌లలో లీక్ చేశారని పేర్కొంది. ఆ సందర్భంలో నేను తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని ఆగ్రహం వ్యక్తం చేసింది. నాపర్సనల్ నంబర్‌తోపాటు ఫొటోలు పలు యాప్‌లో లీక్ అవడంతో ఎంతోమంది కాల్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ, అశ్లీల వీడియోలు పంపేవారని వాపోయింది. ఆ వేధింపులు భరించలేక దేశం విడిచి వెళ్ళిపోయానని పాండే పేర్కొంది. రాజ్ కుంద్రాకు కఠిన శిక్ష పడాలని కోరింది. ఆయనకు శిక్షపడాలని కోరుకుంటున్నాని, అందుకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరిలో నమోదైన ఓ కేసులో ప్రధాన నిందితుడిగా రాజ్ కుంద్రాను సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలె తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, ఆయనకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నాడు. జులై 23 వరకు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈకేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: