పోర్నోగ్రఫీపై ఆ నాడే ట్వీట్ చేసిన రాజ్ కుంద్రా…ఏమన్నాడంటే ..? ఇప్పటికీ వివాదాస్పదమవుతున్న ఆ రెండు అంశాలు !
పోర్నోగ్రఫీపై బిజినెస్ మన్ రాజ్ కుంద్రా ఎప్పుడో 2012 లో చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొమ్మిదేళ్ల క్రితమే ఆయన పోర్నోగ్రఫీకి అనుకూలంగా ట్వీట్ చేశాడు. దేశంలో వ్యభిచారం (ప్రాస్టిట్యూషన్) చట్టబద్దం కానప్పుడు దీనిపై మాత్రం చట్టం...
పోర్నోగ్రఫీపై బిజినెస్ మన్ రాజ్ కుంద్రా ఎప్పుడో 2012 లో చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొమ్మిదేళ్ల క్రితమే ఆయన పోర్నోగ్రఫీకి అనుకూలంగా ట్వీట్ చేశాడు. దేశంలో వ్యభిచారం (ప్రాస్టిట్యూషన్) చట్టబద్దం కానప్పుడు దీనిపై మాత్రం చట్టం ఎందుకు అని ఆయన ప్రశ్నించాడు. పోర్న్ వెర్సెస్ ప్రాస్టిట్యూషన్ ..ఈ రెండూ వేర్వేరు అన్న వాదన ఎందుకు అన్నాడు. 2012 మార్చి 29 న ఆయన ఈ ట్వీట్ చేశాడు. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమేమిటని కొందరు ఈసడించుకున్నారరు.. ‘దారుణం’ అని అభివర్ణించారు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని కొంతమంది ఆయనను ప్రశ్నించారు. పోర్నోగ్రఫీకి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, దీన్ని సర్క్యులేట్ చేయడం చట్ట విరుద్ధమని న్యాయవ్యవస్థ చెబుతోంది. దీన్ని ప్రైవేటుగా చూడడం లీగల్ అయినప్పటికీ ఇలా చేయడం మాత్రం నేరమని అంటోంది. కానీ వ్యభిచారంపై మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉన్న చట్టాలు ఆషామాషీగానే ఉంటున్నాయి. దీన్ని చట్టబద్ధం చేయాలనీ కోరుతున్నవారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. పలు దేశాలు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశాయని వీరు వాదిస్తున్నారు.
దీన్ని లీగలైజ్ చేసిన పక్షంలో వేశ్యలు, వారి పిల్లలు ‘దోపిడీకి’ (ఎక్స్ ప్లాయిటేషన్) కి గురి కాకుండా ఉంటారన్నది వీరి అభిప్రాయం. కాగా- రాజ్ కుంద్రా కేసులో ఇతని సన్నిహితుడైన ర్యాన్ తార్పే తో బాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని మభ్యపెట్టి పోర్న్ ఫిల్మ్ చేయాలని బలవంత పెట్టారని ఓ మహిళ గత ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కుంద్రా సూత్రధారి అని, అతనికి వ్యతిరేకంగా పలు ఆధారాలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ కేసులో కుంద్రా యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు. తానేమీ తప్పు చేయలేదంటున్నాడు. కుంద్రా..ఇతని స్నేహితుడు బ్రిటన్ లో ఓ కంపెనీ పెట్టి..ఇండియాలో అశ్లీల చిత్రాలు తీస్తూ వాటిని ఆ దేశానికి పంపుతున్నారట.. అందువల్ల సైబర్ నేరాల కేసు నుంచి వీరు తప్పించుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ముంబైలో అద్దెకు తీసుకున్న ఇళ్లలోనూ, హోటళ్ల లోను వీరు పోర్న్ చిత్రాలు తీస్తున్నట్టు వెల్లడైంది.
మరిన్ని ఇక్కడ చూడండి : Rains In Hyderabad Video: చినుకుతో భాగ్యనగరం వణుకు..!మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..(వీడియో).
Bigg Boss 5 Video: 100% గ్లామర్… బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్ లిస్ట్ లీక్..ఈ సరి మరింత ఆసక్తికరంగా…
Gold Price video: మరోసారి పసిడి పరుగులు..మళ్ళి పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇలా.. (వీడియో)