AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj kundra Arrest: అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రాజ్ కుంద్రా గిమ్మిక్కులు.. రూ.25 లక్షలతో పోలీసులకు ఎర..

పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా తనను పోలీసులు అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి వారికి రూ. 25 లక్షల రూపాయల ముడుపులు (లంచం) చెల్లించాడట. ఈ కేసులో నిందితుడైన అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యాష్ ఠాకూర్ అనే వ్యక్తి గత మార్చి లోనే ఈ మేరకు..

Raj kundra Arrest: అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రాజ్ కుంద్రా గిమ్మిక్కులు.. రూ.25 లక్షలతో పోలీసులకు ఎర..
Raj Kundra Paid Rs.25 Lakhs To Mumbai Police To Evade Arrest
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 22, 2021 | 12:33 PM

Share

పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా తనను పోలీసులు అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి వారికి రూ. 25 లక్షల రూపాయల ముడుపులు (లంచం) చెల్లించాడట. ఈ కేసులో నిందితుడైన అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యాష్ ఠాకూర్ అనే వ్యక్తి గత మార్చి లోనే ఈ మేరకు ముంబైలోని అవినీతి శాఖ అధికారులకు పంపిన ఈ-మెయిల్ లో తెలిపాడు. ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులకు .కుంద్రా ఇలా డబ్బు ఎర చూపాడని అరవింద్ తెలిపినట్టు వెల్లడైంది. గత ఫిబ్రవరి 4 నే పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసును నమోదు చేసినప్పటికీ.. కుంద్రాను ఈ నెల 19 న అరెస్టు చేశారు. అంటే ఇంత కాలం అరెస్టు కాకుండా ఉన్నాడు. గత ఏప్రిల్ లో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరవింద్ పంపిన ఈ-మెయిల్ తాలూకు ఫిర్యాదును ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయానికి పంపగా.. దీనిపై కామెంట్ చేసందుకు వారు నిరాకరించారని ముంబై మిర్రర్ మీడియా తెలిపింది. ఈ నెల 23 వరకు పోలీసు కస్టడీలో ఉన్న కుంద్రా.. తానేమీ తప్పు చేయలేదని ఇంకా వాదిస్తున్నాడు.

పోర్న్ చిత్రాల రాకెట్ లో ఈయన సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. అయితే ముంబై క్రైమ్ బ్రాంచి అధికారులకు కుంద్రా లంచం ఇచ్చాడన్న ఆరోపణపై మాత్రం ఒక్కరు కూడా పెదవి విప్పడంలేదు. కాగా-హాట్ షాట్స్ పేరిట ఓటీటీ యాప్ ద్వారా పోర్న్ చిత్రాలను క్రియేట్ చేయడం, వాటిని పబ్లిష్ చేయడంలో కుంద్రా మహా తెలివి మీరిపోయాడని, లక్షలకు లక్షలు గడించాడని పోలీసులు వెల్లడించారు. ఈ హాట్ షాట్స్ తమ పాలసీ ఉల్లంఘనే అంటూ గూగుల్ ప్లే తీసివేశాక ఇతగానికి ప్లాన్-బీ కూడా ఉందని వారు చెప్పారు. కుంద్రా చెప్పుకుంటున్న వాట్సాప్ చాట్స్ లో కనీసం నాలుగు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొడుతున్నాయని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch Video: కరీంనగర్ జిల్లాతో నాకు సెంటిమెంట్ ఉంది..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.

 “రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో.. ఎట్ట్రాక్ట్ చేస్తున్న హీరో కార్తికేయ డిఫరెంట్ గెటప్‍..:Hero Karthikeya New Look Video.

 ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.