Aha OTT: దశకంఠ రావణుడి లంకలోకి ‘హీరో’ ఎంట్రీ.. ట్రైలర్ అదుర్స్.. ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు రెడీ!

ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ దూసుకుపోతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకే పరిమితం కాకుండా...

Aha OTT: దశకంఠ రావణుడి లంకలోకి 'హీరో' ఎంట్రీ.. ట్రైలర్ అదుర్స్.. 'ఆహా'లో స్ట్రీమింగ్‌కు రెడీ!
Aha
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 22, 2021 | 10:23 AM

ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ దూసుకుపోతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఎక్స్‌క్లూజివ్‌ ప్రోగ్రామ్స్‌ను సైతం అందిస్తూ ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది. వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్స్‌తో అలరిస్తున్న ‘ఆహా’ తాజాగా మరో ఆసక్తికర చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్దమవుతోంది. కన్నడ హిట్ సినిమా ‘హీరో’ను తెలుగులో అదే పేరుతో ఆహాలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా జూలై 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ తెలుగు ట్రైలర్‌ను రీసెంట్‌గా విడుదల చేసింది.

ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, గనవి లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషించగా.. భరత్ రాజ్ దర్శకత్వం వహించారు. ప్రేమ కోసం ఓ యువకుడు.. క్రూరులు ఉండే లంకకు వెళ్లి.. అక్కడ ఏం చేశాడు.? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి.? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. లేట్ ఎందుకు ట్రైలర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!