Shilpa Shetty : శాలువాలు అమ్ముకునే రాజ్‌‌‌కుంద్రా.. బాలీవుడ్ బ్యూటీ శిల్పాను ఎలా వలలో వేసుకున్నాడో తెలుసా..

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్‌ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్‌ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Shilpa Shetty : శాలువాలు అమ్ముకునే రాజ్‌‌‌కుంద్రా.. బాలీవుడ్ బ్యూటీ శిల్పాను ఎలా వలలో వేసుకున్నాడో తెలుసా..

Raj Kundra arrested: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్‌ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్‌ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు ఇప్పటిదాకా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత పలువురు బాలీవుడ్‌‌‌‌కు చెందిన మోడల్స్ బయటకు వచ్చి అతడిపై ఆరోపణలు చేస్తోన్నారు. అలాగే ఈ అశ్లీల చిత్రాల దందాకు సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా బయటకు రావడంతో మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాట్‌షాట్స్‌, హాట్‌హిట్‌మూవీస్‌ లాంటి బీ, సీ గ్రేడ్‌ యాప్స్‌ కొన్నింటిలో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్‌ చేస్తున్నారని పోలీసులు తేల్చారు. రాజ్ కుంద్రాను కోర్ట్‌‌లో హాజరు పరచగా.. అతడిని ఈ నెల 23వరకు పోలీస్ కస్టడీకి పంపింది న్యాయస్థానం. అయితే ఇన్నిరోజులు బిజినెస్‌‌‌మ్యాన్ గా చలామణి అవుతూ వస్తున్న రాజ్ కుంద్రా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టిని ఎలా వలలో వేసుకున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి రాజ్ కుంద్రాకు  రెండవ భార్య. మొదటి భార్య నుంచి విడిపోయిన రాజ్ కుంద్రా.. ఇటీవల ఆమె పై పలు ఆరోపణలు కూడా చేశాడు. తన మొదటి భార్యకు ఆమె బావతో అక్రమ సంబంధం ఉండటంతోనే ఆమె నుంచి విడిపోయినట్టు తెలిపాడు.

రాజ్ కుంద్రా  చిన్నతనంలో అతడి కుటుంబం లండన్ కు వలస వెళ్ళింది. ఆతర్వాత 18 ఎల్లా వయసులో రాజ్ కుంద్రా నేపాల్ కు వచ్చి అక్కడ శాలువాల బిజినెస్ మొదలు పెట్టాడు. ఆతర్వాత ఆ శాలువాలు బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్‌ హౌజ్‌ అమ్మడం మొదలు పెట్టాడు. ఈక్రమంలోనే కోట్లు సంపాదించాడు. 2007 దుబాయ్‌కు వెళ్లి అక్కడ కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌ మొదలుపెట్టాడు. పలు స్పోర్ట్స్‌ బిజినెస్‌, లైవ్‌-బ్రాడ్‌కాస్ట్‌, గేమింగ్‌ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు.ఆతర్వాత 2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు. ఇక శిల్పాశెట్టి ని ఎలా దక్కించుకున్నాడంటే..  ఒక డీల్ కు సంబంధించి కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రాను మొదటిసారి కలిసిందట శిల్ప.  శిల్ప అందానికి, నవ్వుకు ఫిదా అయినా రాజ్.. ఆ తర్వాత నుంచి ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టాడట. అత్యంత ఖరీదైన బ్యాగ్ లను శిల్పాకు పంపేవాడట రాజ్. ఒకసారి తనకు ఏ కలర్ నచ్చుతుందో తెలియక ఒకే రకమైన ఖరీదైన బ్యాగ్లను మూడు వేరువేరు రంగులలో ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడట. దాంతో ఆమె షాక్ కు గురవ్వడమే కాదు ఇంప్రస్ కూడా అయ్యిందట. ఇలా శిల్పను రాజ్ కుంద్రా వలలో వేసుకున్నాడు. ఈ విషయాన్ని గతంలో స్వయంగా శిల్పశెట్టే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyamani: ప్రియమణి వివాహం చెల్లదు.. మేము ఇంకా విడాకులు తీసుకోలేదు.. రంగంలోకి ముస్తాఫా మొదటి భార్య..

Raj kundra Arrest: అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రాజ్ కుంద్రా గిమ్మిక్కులు.. రూ.25 లక్షలతో పోలీసులకు ఎర..

Samantha Akkineni: ‘నారప్ప’ సినిమాకు ఒక్క మాటలో రివ్యూ రాసిన సమంత..

Click on your DTH Provider to Add TV9 Telugu