AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra: ఆ డబ్బుతో రాజ్ కుంద్రా ఏం చేసేవాడో తెలుసా? పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

Raj Kundra Case Updates :రోజుకో స్కాండిల్ వెలుగులోకి వస్తూ బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసు విచారణ జరుగుతుండగా.. తాజాగా ప్రముఖ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త ,..

Raj Kundra: ఆ డబ్బుతో రాజ్ కుంద్రా ఏం చేసేవాడో తెలుసా? పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Raj Kundra
Surya Kala
|

Updated on: Jul 23, 2021 | 4:58 PM

Share

Raj Kundra Case Updates : రోజుకో స్కాండిల్ వెలుగులోకి వస్తూ బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసు విచారణ జరుగుతుండగా.. తాజాగా ప్రముఖ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త , వ్యాపార వేత్త రాజ్ కుంద్రా పోర్న్ సైట్స్ కేసు మరింత సంచలనం సృష్టించింది. ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా అప్లై చేసుకున్నా ఫలితం లేదు.. ఆయన పోలీస్ కస్టడీని 2021 జూలై 27 వరకు ముంబై కోర్టు పొడిగించారు. ఈ నెల 19న అశ్లీల చిత్రాలను చిత్రీకరించి.. వాటిని యాప్స్ లో రిలీజ్ చేస్తున్నారని రాజ్ కకుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన్ని ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి ..కస్టడీకి పంపారు.

ఆ డబ్బును కుంద్రా ఏంచేసేవారంటే?..

రాజ్ కుంద్రా కేసును పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అశ్లీల సినిమాలను చిత్రీకరించిన డబ్బును ఆయన ఆన్‌లైన్ బెట్టింగ్ లో భారీగా పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడికే హాట్‌షాట్‌ నుంచి పలు పోర్న్ సినిమాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలకు సంబంధించి రాజ్ కుంద్రాకు ఓ డీలర్ కు మధ్య జరిగిన ఒప్పందంపై పోలీసులు దర్యాపు మొదలు పెట్టారు.

కుంద్రా ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే 51 అశ్లీల సినిమాలతో పాటు 48 టిబి డేటాను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులు వియాన్ ఇండస్ట్రీస్ అకౌంటెంట్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దీంతో రాజ్ కుంద్రా ప్రతి నెలా 4000 నుండి 10,000 పౌండ్ల వరకు ఖర్చు చేసారని తెలుస్తోంది. ఇప్పటివరకూ అయన చెల్లించిన ఆదాయపన్ను పై కూడాదృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కుంద్రా అరెస్టు ఐన మర్నాడు అతని అకౌంటెంట్ కొంత డేటాను తొలగించాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆ డేటాను రికవరీ చేసేపనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ అశ్లీల సినిమాల మాఫియా కేసులో ఎక్కువుగా రాజ్ కుంద్రా పెరుమాత్రమే వినిపిస్తోంది. హాట్ షాట్స్ వంటి యాప్స్ అతని అండతోనే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఫిల్మ్స్ లో నటిచడానికి కొంతమంది నటులను ట్రాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇతర సెలబ్రెటీలు కూడా రాజ్ కుంద్రాపై విమర్శలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా కారణంగా ఇబ్బంది పడిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న నేపధ్యములో ఈ కేసు ఎన్ని మలుపు తీసుకుంటుందో అని ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Also Read: Weight Loss: అధిక కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రింక్‌ను తాగిచూడండి.. అద్భుతఫలితం మీ సొంతం