Weight Loss: అధిక కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రింక్‌ను తాగిచూడండి.. అద్భుతఫలితం మీ సొంతం
Weight Loss: ప్రస్తుత జీవన విధానంలో అధిక ఒత్తిడి..వేళకు తినని తిండి.. దీంతో ఎక్కువమంది అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది ఈ ఊబకాయం..
Weight Loss: ప్రస్తుత జీవన విధానంలో అధిక ఒత్తిడి..వేళకు తినని తిండి.. దీంతో ఎక్కువమంది అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది ఈ ఊబకాయం సమస్యనుంచి విముక్తి పొందడానికి మెడిసిన్ వాడితే.. మరికొందరు సర్జరీని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవ్వన్నీ ఆరోగ్యానికి దీర్ఘకాలిక వ్యాధులకు కారకలే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా ఊబకాయంతో బాధపడేవారు ఇంట్లోని వస్తువులతో సింపుల్ చిట్కాలను పాటిస్తే.. పొట్ట, తొడల దగ్గర ఉన్న అధిక కొవ్వు.. మైనం కొవొత్తిలా కరిగిపోతుంది.
*అల్లాన్ని ఆయుర్వేదం, హోమియోపతి వంటి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా అల్లం నీరు అనేక ఆరోగ్యప్రయోజనాలు ఇస్తుంది. ఇక అధిక బరువు.. శరీరంలోని కొవ్వు కరగాలంటే అల్లం,ఖర్జూరం డ్రింక్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కూడా అత్యంత సులభం
ముందుగా నాలుగు లేదా ఐదు ఖర్జూరాలు తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా తరగాలి. వీటితో పాటు ఒక ఇంచు అల్లంముక్క శుభ్రంగా కడిగి దానిపొట్టు తీసేసి చిన్నగా తరగాలి. తరువాత వీటిని ఒక గిన్నె లో వేసి.. తర్వాత ఒక గ్లాసు నీరు పోసి.. బాగా మరిగించాలి. తర్వాత గోరు వెచ్చగా ఉన్నసమయంలో ఈ నీటిని వాడకట్టుకుని తాగాలి. ఇలా ఈ అల్లం ఖర్జురం నీటిని రోజూ ఉదయాన్నే తాగడంవలన మంచి ఫలితం ఉంటుంది.
ఖర్జురాలు తక్షణ శక్తిని ఇస్తారు.. అంతేకాదు ఇవి బరువు తగ్గడానికి, కొవ్వు కరగడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఒక ఐదు ఖర్జూరాలను తింటే ఆరోగ్యానికి ఏంతో మంచిది. ఖర్జూరం శరీరంలో ఐరన్, రక్తహీనత లోపాలను తగ్గిస్తుంది. నీరసం, అలసట తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.
Also Read: Red Ladies Finger: అరుదైన పంట ఎర్రబెండ.. దీనిని వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!