Coconut Oil : గొంతు నొప్పితో బాధపడుతున్నారా..! కొబ్బరినూనెతో గార్గ్లింగ్ చేయండి మంచి ఉపశమనం దొరుకుతుంది..

Coconut Oil : గొంతు నొప్పితో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. అప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటితో గార్గ్ చేయడానికి ఇష్టపడతారు. ఇది కాకుండా మీరు

Coconut Oil : గొంతు నొప్పితో బాధపడుతున్నారా..! కొబ్బరినూనెతో గార్గ్లింగ్ చేయండి మంచి ఉపశమనం దొరుకుతుంది..
Gargle
Follow us
uppula Raju

|

Updated on: Jul 23, 2021 | 4:19 PM

Coconut Oil : గొంతు నొప్పితో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. అప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటితో గార్గ్ చేయడానికి ఇష్టపడతారు. ఇది కాకుండా మీరు అనేక విధాలుగా గార్గ్ చేయవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనె గార్గ్లింగ్ ట్రై చేయవచ్చు. కొబ్బరి నూనె ఒక సహజ పదార్ధం. ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఉపయోగపడుతుంది.

కొబ్బరి నూనెలో చాలా ముఖ్యమైన విటమిన్లు, కొవ్వులు ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి చేస్తుంది. ఈ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, విటమిన్ కె ఆమ్లాలు ఉంటాయి. ఇది చాలా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. గార్గ్లింగ్ కోసం మీరు ముడి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెను నిత్యం ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే మీరు గార్గ్లింగ్ ప్రక్రియలో కొంత నూనెను మింగవచ్చు. గార్గ్లింగ్ కోసం 2-3 చెంచాల కొబ్బరి నూనె తీసుకొని మీ నోటిలో ఉంచండి. గార్గ్లింగ్ ప్రారంభించండి. నెమ్మదిగా చేయండి. అలాగే మీరు నూనెను మింగవద్దు. కొన్ని నిమిషాలు గార్గ్ చేసిన తర్వాత ఉమ్మివేయండి.

1. మీరు కొబ్బరి నూనె లేదా మరేదైనా ద్రావణంతో గార్గ్లింగ్ చేసినప్పుడు గొంతులో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. గొంతు క్లియర్ అవుతుంది. 2. గార్గ్లింగ్ చేయడం వల్ల మీ గొంతుకు ఉపశమనం దొరకుతుంది. మీ గొంతు దురదగా ఉంటే గార్గ్లింగ్ చేయడం ద్వారా చక్కటి ఫలితం ఉంటుంది. 3. గొంతు సమస్యలకు చికిత్స చేయడంలో గార్గ్లింగ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది గొంతు వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 4. గార్గ్లింగ్ శ్వాసకోశ, శ్లేష్మం క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. 5. కొబ్బరి నూనెతో గార్గ్లింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మీరు ఎక్కువగా గార్గ్ చేయకుండా జాగ్రత్త వహించండి. లేదంటే గార్గ్లింగ్ వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే ఖచ్చితంగా ఒకసారి వైద్యుడిని సంప్రదించండి.

Jojoba Oil : మొటిమల సమస్యకు దివ్యఔషధం జోజోబా ఆయిల్..! ఎలా వాడాలో తెలుసుకోండి..

Neuropathic Pain: తరచుగా తిమ్మిర్లు వస్తున్నాయా..నిర్లక్ష్యం వద్దు.. ఈ విటమిన్ లోపం ఏమో.. ఒక్కసారి చెక్ చేసుకోండి

Stomach Pain : కడుపునొప్పికి కారణం మీరు చేసే ఈ 7 తప్పులే..! ఏంటో కచ్చితంగా తెలుసుకోండి..