Neuropathic Pain: తరచుగా తిమ్మిర్లు వస్తున్నాయా..నిర్లక్ష్యం వద్దు.. ఈ విటమిన్ లోపం ఏమో.. ఒక్కసారి చెక్ చేసుకోండి

Neuropathic Pain: శరీరానికి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. అది సర్వసాధారణంగా ఏర్పడేవి అంటూ.. పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తాం.. ఇది కామన్..

Neuropathic Pain: తరచుగా తిమ్మిర్లు వస్తున్నాయా..నిర్లక్ష్యం వద్దు.. ఈ విటమిన్ లోపం ఏమో.. ఒక్కసారి చెక్ చేసుకోండి
Neuropathy Pain
Follow us
Surya Kala

|

Updated on: Jul 20, 2021 | 5:11 PM

Neuropathic Pain: శరీరానికి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. అది సర్వసాధారణంగా ఏర్పడేవి అంటూ.. పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తాం.. ఇది కామన్ అంటూ నిర్లక్ష్యం చేసే సమస్య లో ఒకటి తిమ్మిర్లు.. శరీరాన్ని ముఖ్యంగా కాళ్ళు, చేతులు ఎక్కువ సమయం కదపకుండా ఒకే పోజులో కూర్చుంటే చాలు.. తిమ్మిర్లు వస్తాయి. కొంచెం సేపు.. తిమ్మిరి ఎక్కిన చేతులపై, కాళ్లపై చీమలు పాకిన ఫీలింగ్ ఉంటుంది.. అవి కొంచెం సేపు పనిచేయవు. కొంచెం సేపు ఉంది తగ్గిపోతుందిలే అని ఎక్కువమంది ఈ తిమ్మిర్లను పట్టించుకోరు.. అయితే ఈ తిమ్మిర్లు ఎక్కువసార్లు వస్తున్నాయంటే శరీరం మనకు పనితీరుపై ముందస్తుగా కొన్ని హెచ్చరికలు పంపిస్తుందట . మొదట్లోనే తరచుగా వచ్చే తిమ్మిర్లపై దృష్టి పెట్టకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయట. ఈ రోజు అసలు తిమ్మిర్లు ఎందుకొస్తాయి. తరచుగా తిమ్మిర్లు వస్తే.. ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఏమిటో చూద్దాం..

అసలు తిమ్మిర్లు ఎందుకొస్తాయంటే ఎక్కువ మందికి తెలియదు. సరైన విటమిన్స్ శరీరానికి అందకపోతే తిమ్మిర్లు సమస్య ఏర్పడుతుంది. అయితే ఈ విటమిన్లలో చాలా రకాలున్నా ఎక్కువమంది విటమిన్ ఏ, సి. డి, ఈ వంటి వాటిమీదనే దృష్టి పెడతారు.. అవి శరీరానికి సరైన మోతాదులో అందిచాలని చూస్తారు.. కానీ మన శరీరం సక్రమంగా పనిచేయడానికి మరో విటమిన్ కూడా అవసరం.. అదే విటమిన్ బీ 12. ఈ విటమిన్ ను ప్రతి రోజు శరీరానికి అందించాలి.. లేదంటే ప్రధానంగా తిమ్మిర్లు వస్తాయి. ఈ విటమిన్ లోపంతో ఒక్క తిమ్మిర్లు మాత్రమే కాదు.. అనేక హెల్త్ ఇస్యూస్ వస్తుంటాయి. శరీరంలో మెటబాలిజం పెరగాలన్న, మెదడు ఆరోగ్యంగా ఉండాలన్న బీ 12 కీలకం. ఈ విటమిన్ సంవృద్ధిగా ఉంటె నరాలు బలంగా తయారవుతాయి. రెడ్ బ్లడ్ సెల్స్ భారీగా పెరుగుతాయి. కావాల్సినంత బీ 12 లేకపోతే డిప్రెషన్, స్కిన్ సమస్యలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

ఐతే మన దేశంలో ఎక్కువమంది ఈ బి12 డిపిషెన్సీపై తో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 74 శాతం మంది ప్రజలు ఈ విటమిన్ బి 12 లోపంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ విటమిన్ ఎక్కువగా చికెన్, మటన్, గుడ్లు, చెపల్లో పుష్కలంగా ఉంటుంది. పాలు, చీజ్ వంటి పాల పదార్ధాల్లో కూడా ఉంటుంది. కనుక ఈ ఆహారపదార్ధాలను తప్పనిసరిగా రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బి12 తక్కువగా ఉంటే రక్త హీనత కూడా వస్తుంది. కనుక తప్పనిసరిగా బి 12 విటమిన్ తీసుకోవడం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Also Read: ఆ దేశంలో దోమల సుడిగాలి.. వీడియో హల్ చల్.. ఇది మరో విపత్తుకు సంకేతం అంటున్న నెటిజన్లు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!