Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!

బుల్లితెర తెలుగు మెగా సీరియల్ కార్తీకదీపం ఊహించని మలుపులతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే కార్తీక్ తో పెళ్లి కోసం మోనిత నాటకాలు వికృతంగా మారిపోయాయి. ఆమెను ఎదుర్కోవడానికి దీప ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు కార్తీకదీపం 1101 ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో మీకోసం..

Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!
Karthika Deepam Serial
KVD Varma

|

Jul 26, 2021 | 8:41 AM

Karhika Deepam today Episode 1101: స్నేహితురాలు అని నమ్మిన మోనిత కాపురాన్ని కూల్చాలని విశ్వప్రయత్నం చేసింది. పదేళ్లు తన భార్య మీద అనుమానాన్ని పెంచి.. ఇద్దరూ దూరం అయ్యేలా చేసి దూరంగా ఉండేలా చేసిందని తెలుసుకున్న  కార్తీక్ తన భార్య దీపను.. పిల్లలను దగ్గరకి చేర్చుకున్నాడు. అయితే, మోనిత తాను గర్భవతి అంటూ కొత్త నాటకం మొదలు పెట్టింది. కార్తీక్ కుటంబాన్ని వీధిలోకి లాగి కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు గట్టిగా చేస్తోంది. కార్తీకదీపం మంచి చెడుల మధ్య.. కుటుంబ బంధాల మధ్య.. ఆశ..అత్యాశల మధ్య తేడాలను చూపిస్తూ సాగిపోతోంది. ప్రేక్షకులందరి మనసుల్నీ దోచుకుంటూ విజయవంతంగా కార్తీకదీపం నడుస్తోంది.  చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కార్తీక్.. ఎలాగైనా కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మోనిత.. తన కాపురం నిలబెట్టుకోవాలని దీప చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరు విజయం సాధిస్తారనేది రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది.

కార్తీక్ తండ్రి ఆనందరావుకు మోనితను కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నాడనీ.. ఆమె గర్భవతి అనే విషయం తెలిసిన ఆనందరావుకు షాక్ తో  గుండెనొప్పి వస్తుంది. దీంతో కార్తీక్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయాడానికి ప్రయత్నిస్తాడు. ఆయితే  ఆనందరావు అతనిని బయటకు పొమ్మంటాడు. చేసేదేమీ లేక వేరే డాక్టర్ కు ఆయనకు అప్పగించి బయటకు వచ్చేస్తాడు కార్తీక్. తరువాత కార్తీక్ తండ్రి తనను అలా మాట్లాడినందుకు కుమిలిపోతాడు. దీప నేను మీ వెనుకే ఉన్నాను అంటూ ఊరడిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో మోనిత వచ్చి మళ్ళీ ఆసుపత్రి దగ్గర రచ్చ చేసే ప్రయత్నం చేస్తుంది. దీప ఆమెకు అంజి పేరుతో స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చి పంపిస్తుంది. మొన్న శనివారం 1100 ఎపిసోడ్ లో జరిగిన సంఘటనలు ఇవి. మరి ఇప్పుడు ఆనందరావు ఆరోగ్యం ఎలా ఉంది? మోనిత తరువాత ఏం చేస్తుంది? దీప మోనితతో చెప్పినట్టు అంజిని సీన్ లోకి తీసుకువస్తుందా? మోనిత కార్తీక్ పై కంప్లైంట్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఏం చేయబోతోంది? బోలెడు ప్రశ్నలు.. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? తెలుసుకుందాం..

ఇది మా హాస్పటల్.. గెటవుట్!

మోనిత స్పీడుగా ఆసుపత్రిలోకి వస్తుంది. నేరుగా ఆనందరావు ఉన్న  వెళ్ళడానికి నడుస్తుంటుంది.  అక్కడ గది బయట దీప కూర్చుని పేపర్ చదువుతుంటుంది. మోనితను చూసి ఎక్కడికి అని అడుగుతుంది. అక్కడ దీపము ఊహించని మోనిత కొద్దిగా కంగారు పడుతుంది.  నువ్వెక్కడికో వెళతానన్నావు దీపను ప్రశ్నిస్తుంది. దీప నువ్వెందుకొచ్చావు అని అడుగుతుంది. ”మామగారిని చూసిపోదామని.. అదే మీ మామగారిని చూసిపోదామని వచ్చాను. కార్తీక్ ఫ్రెండ్ గా” అని చెబుతుంది మోనిత. ఆయనకి ఇప్పుడు మోనిత అనే ఫ్రెండ్ లేదు అని దీప కౌంటర్ ఇస్తుంది. దాంతో మోనిత అవును.. ఫ్రెండ్ లేదు కాబోయే భార్య ఉంది అని అంటుంది పెడసరంగా.. ఇలా ఇద్దరూ అనుకుంటుంటే.. ఆసుపత్రిలో పనిచేసే నర్స్ అక్కడికి వస్తుంది. మోనితను మేడం బావున్నారా అని పలకరిస్తుంది. దీంతో మోనిత అవునూ కార్తీక్ వాళ్ళ డాడీకి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది మోనిత. స్టెంట్ వేశారు మేడం అని చెబుతూనే.. కార్తీక్ ను ఆనందరావు బయటకు పొమ్మన్న విషయాన్నీ.. వేరే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్న విషయాన్ని చెప్పిన నర్స్ మేడం.. ఎందుకు మేడం కార్తీక్ సార్ మీద ఆయన అంత కోపంగా ఉన్నారు? అని ప్రశ్నిస్తుంది. మోనితకు ఇక అవకాశం దొరికేస్తుంది. కార్తీక్ నేను పెళ్లి చేసుకోబోతున్నాం. భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటున్నారని కార్తీక్ మీద ఆయన తండ్రికి కోపం అని చెబుతుంది. అయ్యో.. మరి మొదటి భార్య ఏమీ అనలేదా మేడం అని అడుగుతుంది నర్స్. నువ్వు కొత్తగా వచ్చావు కదా నీకు తెలీదు. ఆయన మొదటి పెళ్ళాం చదువుకోలేదు. వంటలక్క.. వంటలు చేసుకుని బతుకుతుంది. అందుకే కార్తీక్ కి సుఖం లేదు. అని చెబుతుంది. సరే మేడం అంటూ నర్స్ వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న దీప వైపు తిరిగి మోనిత ”చూశావా? సమాజం ఎలా ఉంటుందో. ఇప్పటికైనా ఒప్పేసుకో దీపా.. ఎవరూ నను తప్పు పట్టరు.” అంటుంది మోనిత. ”అవును..సమాజం ఇలానే ఉంటుంది. కరెక్టే.. రేపు అంజి ఇక్కడకు వచ్చి నీ వికృతాల గురించి చెప్పినపుడు కూడా సమాజం ఇలానే ఉంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి?” అని అడుగుతుంది దీప. అంజి పేరు వినగానే మోనిత మోహంలో రంగులు మారిపోతాయి. వెంటనే దీప” చూడూ నువ్వు సున్నాలు చుడుతున్నావు కదా ఓక్ తేదీకి.. ఆ ఇరవై ఐదు ఇంకా రెండు రోజులే ఉంది. సరిగ్గా ఆ రోజు నీ పెళ్ళికి ఏర్పాట్లు నువ్వు చేసుకో. అదేరోజు నీ పెటాకులకి నేను ఏర్పాట్లు చేస్తాను. ” అని దీప మరింత కంగారు పెడుతుంది మోనితను. దీంతో షాక్ లో ఉండిపోతుంది మోనిత. అప్పుడు దీప ”ఇది మా ఆసుపత్రి.. నువ్వు జస్ట్ గెటౌట్!” అంటుంది. అయినా, ఇంకా నిలబడి చూస్తున్న మోనితను వెళతావా స్టాఫ్ తోచెప్పి బయటకు గెంటించనా? అని అడుగుతుంది. దీంతోమోనిత విసవిసా వెళ్ళిపోతుంది.

అందరికీ మంచితనం ఆపాదించకు దీపా..

దీప డీఎస్పీఇంటికి వెళుతుంది. ఆ సమయానికి ఆమె భోజనానికి సిద్ధం అవుతూ ఉంటుంది. కూర్చో దీపా భోజనం చూశాకా మాట్లాడుకుందాం అని ఆమె అంటుంది. దీనికి దీప డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి.. నేను వడ్డిస్తాను మేడం. భోజనం చేస్తూ మాట్లాడండి అంటుంది. అయితే,  డీఎస్పీ అంటే నువ్వు భోజనం వడ్డించేస్తే నేను నీ వైపు మాట్లాడతాను అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. లేదు మేడం.. భోజనం వడ్డిస్తే తమ వైపు మాట్లాడతారని ఎవరూ అనుకోరు అంటుంది. సరే విషయం చెప్పు అంటుంది డీఎస్పీ. మోనిత ఆనందరావు విషయంలో చేసిన పని అంతా వివరించి చెబుతుంది దీప. నిజానికి ఈ కేసుకూ.. ఈ విషయానికి సంబంధం లేదు మేడం. మోనిత వికృత చేష్టలు మీకు తెలియాలనే ఇది చెబుతున్నాను అంటుంది. నాకు తెలుసు దీపా మోనిత గురించి. కానీ, మీ ఆయన కార్తీక్ తప్పు ఉంది. పెళ్లయిన తరువాత మోనిత తో అంత చనువుగా ఉండటం అనేది అతను చేసిన తప్పు. ఇప్పుడు నాకేమీ తెలియదు అనడం మరింత తప్పు అంటుంది. ఇంతలో దీప అంజి గురించి అడుగుతుంది. అయితే, అంజి వైజాగ్ లో లేదు నేను ఎంక్వైరీ చేశాను అంటుంది డీఎస్పీ. మరి అంజి దొరకకపోతే సమస్య తేలదు కదా మేడం అని అంటుంది దీప. అప్పుడు డీఎస్పీ అంజి ఎలాంటి వాడు అని అడుగుతుంది. చాలా మంచి వాడు మేడం అని సమాధానం చెబుతుంది దీప. దీపా నువ్వు అందరికీ మంచితనం ఆపాదించకు. అంజి మంచివాడైతే మర్డర్ ఎందుకు చేస్తాడు? అని ప్రశ్నిస్తుంది. నీ భర్తను కూడా మంచివాడని అంటున్నావు. మంచి వాడైతే నువ్వు అంత చిన్న ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? కనీసం నిన్ను ఏరోజూ మనిషిగా ఎందుకు చూడలేదు? అని ప్రశ్నిస్తుంది. అవతలి వారిలో చెడు గురించి కూడా ఆలోచించు దీపా అంటుంది డీఎస్పీ. అవును మేడం.. మీరు చెప్పాకా ఆలోచించాను.. ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది.. అది చెప్పనా మేడం అని సంశయంగా అడుగుతుంది. దానికి డీఎస్పీ చెప్పు దీపా.. ఈ కేసును నా ఒక్క బుర్రతోనే సాల్వ్ చేయాలని అనుకోవడం లేదు. మంచి ఆలోచన ఎవరిదైనా ఫర్వాలేదు చెప్పు అది మంచిది అయితే అలానే చేద్దాం అంటుంది డీఎస్పీ. అప్పుడు దీప ఆమెకు రహస్యంగా ఎదో చెబుతుంది. అంతా విన్న డీఎస్పీ ఒకే దీపా అలాగే చేస్తాను అని చెబుతుంది.

అంజి గాడు వైజాగ్ లో లేడు.

ఇక ఆసుపత్రి నుంచి కారులో ఇంటికి బయలుదేరిన మోనిత బుర్రనిండా రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. ఏమిటీ..దీప మాట్లాడితే అంజి ప్రసక్తి తీసుకువస్తోంది. వంటలక్కే కదా అని అనుకున్నాను. ఇన్ని తెలివితేటలూ ఎక్కడి నుంచి వచ్చాయి? వంటలక్కే కదా అని దాని ఇంటికి వెళ్లి చెప్పి మరీ పెళ్లిచేసుకుందాం అనుకున్నాను. ఛీ.. ఇది ఇంత తెలివైనది అంటే వేరే రకంగా సీక్రెట్ గా కార్తీక్ ను పెళ్లి చేసుకునే దానిని అని అనుకుంటుంది. అసలు అంజి గాడు సేఫ్ గా మనవాళ్ళ దగ్గర ఉన్నాడా? తెలుసుకుందాం అని ఎవరికో ఫోన్ చేస్తుంది. అవతల వారితో అంజి మీదగ్గర సేఫ్ గా ఉన్నాడు కదా. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ఎటూ వెళ్లనీయకండి అని చెబుతుంది. అవతల నుంచి ‘మీకు నేనే ఫోన్ చేద్దామని అనుకున్నా మేడం. అంజి మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. ఏమైపోయాడో తెలీలేదు. షాప్ తాళం వేసి ఉంది.” అని చెబుతాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది.

దీప ఏం చేస్తుంది.. 

దీప ఇంట్లో కార్తీక్.. భాగ్యం అందరూ ఉంటారు. ఈ సమయంలో మోనిత వచ్చి అందరినీ బెదిరిస్తుంది. భాగ్యం ఆమెను కొట్టబోతుంది. దీంతో మోనిత ”నాకు తెలుసు.. మీరు నన్ను కొడతారని అందుకే.. ఈ బాటిల్ తెచ్చా. ఇదేమితో తెలుసా? విషం కలిపిన నీళ్ళు. మీరు నన్ను కొట్టడానికి వస్తే ఇవి తాగేస్తాను” అంటూ బెదిరిస్తుంది. అందరూ షాక్ అయి నిలబడి పోతారు. దీంతో దీప ”తగనియ్యండి డాక్టర్ బాబు. ఏమవుతుంది. దాని ప్రాణమే కదా పోతుంది. పోనీయండి.” అంటూ రావే తాగు ఈ నీళ్ళు తాగు ఎలా చచ్చిపోతావో చూడాలి అంటూ బాటిల్ మోనిత దగ్గరకు జరుపుతుంది. అయితే, మోనిత బాటిల్ ముట్టుకోదు. పోనీ నేను తాగనా? అంటూ వాటర్ బాటిల్ మూతతీసి గడగడా తాగేస్తుంది.. మరి ఆ నీళ్ళు తాగిన దీపకు ఏమవుతుంది? మోనిత పరిస్థితి ఏమిటి? కార్తీక్ ఏం చేస్తాడు.. కార్తీకదీపం రేపు (ఎపిసోడ్ 1102) ప్రసారమయ్యే  వరకూ వేచి చూడాల్సిందే!

Also Read: Karthika Deepam Latest: 25 తేదీ తరువాత ఈయన మన ఉమ్మడి మొగుడు..ఆయన కామన్ మామగారు.. దీపతో మోనిత ఛాలెంజ్!

Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!

Karthika Deepam July 22 Episode: మా ఆయన సాఫ్ట్ వేర్.. నేను హార్డ్ వేర్.. మోనిత చేత నీళ్ళు తాగించిన దీప!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu