Karthika Deepam: అంజిని ప్రేమించావా మోనితా.. వంటలక్క భలే ఇరికించింది.. రంగంలోకి దిగిన డాక్టర్ బాబు!

మూర్ఖ ప్రేమకు..మూడుముళ్ల బంధానికి మధ్య జరుగుతున్న పోరు. అనుమానానికి..నమ్మకానికి మధ్య ఉండే తేడాను పరిచయం చేస్తున్న తీరు. ఇలా బుల్లితెర మెగా సీరియల్ కార్తీకదీపం గురించి రెండు ముక్కల్లో చెప్పేయెచ్చు.

Karthika Deepam: అంజిని ప్రేమించావా మోనితా.. వంటలక్క భలే ఇరికించింది.. రంగంలోకి దిగిన డాక్టర్ బాబు!
Karthika Deepam
Follow us
KVD Varma

|

Updated on: Jul 30, 2021 | 7:49 AM

Karthika Deepam: మూర్ఖ ప్రేమకు..మూడుముళ్ల బంధానికి మధ్య జరుగుతున్న పోరు. అనుమానానికి..నమ్మకానికి మధ్య ఉండే తేడాను పరిచయం చేస్తున్న తీరు. ఇలా బుల్లితెర మెగా సీరియల్ కార్తీకదీపం గురించి రెండు ముక్కల్లో చెప్పేయెచ్చు. ఈ అంతరాలను.. అంతరాలను అధిగమించే పోరును విభిన్న కోణాల్లో చూపిస్తూ విజయవంతంగా సాగిపోతోంది కార్తీకదీపం సీరియల్. టీవీ ప్రేక్షకులు ముక్తకంఠంతో మెచ్చుకుంటూ.. తరువాత ఏం జరుగుతుందనే విషయంపై చర్చించుకునేలా చేసిన సీరియల్ కార్తీకదీపం. ఈరోజు 1105వ ఎపిసోడ్ లో అడుగుపెడుతోంది. నిన్నటి ఎపిసోడ్ (1104)లో ఏం జరిగింది? ఈరోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే విషయాలకు అక్షరరూపం ఇక్కడ ఇస్తున్నాం. మారేందుకు ఆలస్యం సీరియల్ చదివేద్దాం పదండి.

నిన్నటి ఎపిసోడ్ (1104)లో ఏమైందంటే..

తాను 25వ తేదీన కార్తీక్ ను పెళ్ళిచేసుకోవాలని రిజిస్ట్రార్ ఆఫీసులో పెట్టిన అప్లికేషన్ కు అంజి అభ్యంతరం చెప్పాడని మోనితకు తెలుస్తుంది. వంటలక్క దీప విషయంలో తాను తక్కువగా ఆలోచించానని బాధపడుతుంది మోనిత. మరోవైపు కార్తీక్ తండ్రి ఆనందరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. ఆయనకు దిష్టి తీసి లోపలి తీసుకువెళుతుంది దీప. కార్తీక్ పై తన అసహనాన్ని..కోపాన్ని దీప దగ్గర ప్రదర్శిస్తాడు ఆనందరావు. అయితే, దీప మాత్రం కార్తీక్ ను వెనకేసుకు వస్తుంది. కార్తీక్ మీద తనకు నమ్మకం ఉందని చెబుతుంది. మోనిత ఎదో నాటకం ఆడుతోందనీ, కార్తీక్ కి ఈ సమయంలో కుటుంబం అండగా నిలబడాలని చెబుతుంది. ఇదిలా ఉండగా మోనితను డీఎస్పీ రోషిణి ఫోన్ చేసి కలవడానికి రమ్మని చెబుతుంది. దీంతో మోనితలో కంగారు మొదలవుతుంది. మోనిత డీఎస్పీని కలవడానికి వెళ్ళటం కోసం తనను ఎందుకు పిలిచిందా అని ఆలోచిస్తూనే తయారవుతుంటుంది. ఈలోపు ప్రియమణి వచ్చి కాఫీ తెమ్మంటారా అమ్మా అని అడుగుతుంది. దీనికి మోనిత ఎప్పుడూ నీ కాఫీ గోల ఏమిటి అంటూ విసుక్కుంటుంది. ఇంతలో ప్రియమణి నాకు కాఫీ తీసుకురా అంటూ దీప అక్కడకు ఎంట్రీ ఇస్తుంది. . దీపను చూసి షాక్ అవుతుంది మోనిత. ఈలోపు డీఎస్పీ రోషిణి మోనితకు ఫోన్ చేస్తుంది. అది చూసిన మోనిత ఫోన్ లిఫ్ట్ చేయడానికి తటపటాయిస్తూ ఉంటుంది. అప్పుడు దీప డీఎస్పీ ఫోన్ చేస్తే అలా ఆలోచిస్తావే? మాట్లాడు అంటుంది. దీంతో మోనిత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎంతసేపు? నీకోసం కూడా నేను ఎదురుచూడాలా? అంటూ రోషిణి చిరాకు పడుతుంది. వస్తున్నా మేడం అని సమాధానం ఇస్తుంది మోనిత. మోనిత దీపను  చూసి నేను రోషిణి మేడం దగ్గరకు వెళుతున్నాను. అక్కడ మీ సంగతి తెలుస్తాను అంటూ వెళ్లబోతుంది. ఆమెను దీప అపి.. ”వెళ్తున్నాను.. కాదు వెళదాం. అక్కడ అంజి ఉన్నాడో.. మరెవరైనా ఉన్నారో? నీ పాత కథలు ఏమి చెప్పారో.. కొత్త కథనాల గురించి మేడం కి ఏమి తెలిసిందో? అన్నీ తేల్చుకుందాం” అంటుంది..  మరి ఈరోజు ఎపిసోడ్ (1105)లో ఏం జరగబోతోంది. దీప, మోనిత కలిసి అక్కడికి వెళ్ళారా? అక్కడ అంజి ఉన్నాడా?

రోషిణి వద్దకు మోనిత.. దీప..

అకస్మాత్తుగా వచ్చిన దీపను  చూసి షాక్ అవుతుంది మోనిత. కానీ, తన కంగారు దీపకు తెలిస్తే లోకువ అవుతాను అని అనుకుంటుంది. దీప దగ్గర బయటపడకుండా ఉండాలి అని అనుకుంటుంది. వెంటనే సర్దుకున్న మోనిత ”అక్క వచ్చి కాఫీ అడిగితే కదలకుండా సిలెండర్ స్టాండ్ లా అలా నిలబడతావే..వెళ్లి కాఫీ తీసుకురా.” అని ప్రియమణికి చెబుతుంది. అయితే, దీప నన్ను అక్క అని పిలిస్తే నీకు మర్యాదగా ఉండదని నీకు ఇంకా అర్థం కాలేదా? అంటుంది. పద ఇద్దరం కలిసి రోషిణి మేడం దగ్గరకు వెళదాం అంటుంది. ఇద్దరూ కలిసి బయలుదేరుతారు.

అంజిని పట్టుకోవాలి..

కార్తీక్ ఇంటికి వెళతాడు. అక్కడ పిల్లలు ఇద్దరూ మొక్కలు నాటుతుంటారు. ఇదేమిటమ్మా..మీరు ఈ పని చేస్తున్నారు? అంటూ వాళ్ళ దగ్గరకు వెళతాడు. ”మొక్కలు, చిన్నపిల్లలు ఇద్దరూ ఒక్కరే అంటకదా డాడీ.” అంటారు పిల్లలు. మీకెవరు చెప్పారు. అని అడుగుతాడు కార్తీక్. మా పాఠాల్లో ఉంది అంటారు పిల్లలు. ”డాడీ..ఈ మొక్కలు పూలు పూసేసరికి గుడ్ న్యూస్ చెబుతాను అంది అమ్మ. అదేమిటి?” అని అడుగుతారు పిల్లలు. ”అవునా? నాకూ చెప్పలేదే. అయినా గుడ్ న్యూసే కదా.. టెన్షన్ ఎందుకు?” అంటాడు. నిజమే డాడీ అని పిల్లలు అంటారు. పిల్లలకు విషయం తెలియకముందే అంజి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటాడు కార్తీక్.

నా పెద్దకొడుకుతో మాట్లాడాలి..

అక్కడ ఆనందరావు..తాను కార్తీక్ ను దూషించిన సంగతి గుర్తుచేసుకుని బాధపడతాడు. దీప కార్తీక్ గురించి చెప్పిన మాటలు తలుచుకుంటాడు. ఈలోపు ఆదిత్య అక్కడకు వస్తాడు. నా ఫోన్ ఎక్కడ ఉంది ఆదిత్యా అని అడుగుతాడు ఆనందరావు. నువ్వు ఫోన్ లో ఎక్కువ మాట్లాడకూడదని డాక్టర్ చెప్పారు అని చెబుతాడు ఆదిత్య. ఎవరు మీ అన్నయ్యా.. అని అడుగుతాడు ఆనందరావు. అవును డాడీ.. నువ్వు అన్నయ్యను తిట్టడం మానేసి..మందులు వేసుకుని రెస్ట్ తీసుకోండి అని చెబుతాడు ఆదిత్య. నేను మీ అన్నయ్యతో మాట్లాడాలి. నా పెద్ద కొడుకును నువ్వు పిలుస్తావా? నేను ఫోన్ చేయనా అని అడుగుతాడు ఆనందరావు. దానికి సంతోషంతో ఆదిత్య నేను ఇప్పుడే పిలుస్తాను డాడీ అని ఫోన్ చేస్తాడు.

అంజి ఎవరో తెలుసా మోనితా?

ఇక్కడ దీప, మోనిత ఇద్దరూ కలిసి రోషిణి దగ్గరకు వెళతారు. ఇద్దరూ కలిసి రావడం చూసిన ఆమె ఆశ్చర్యపోతుంది. అయితే, మోనిత లోపలి వెళుతూనే చుట్టూ చూస్తూ ఉంటుంది. అంజి ఎక్కడా కనబడకపోయే సరికి ఊపిరి పీల్చుకుంటుంది. ఇదంతా రోషిణి గమనిస్తుంది. ఏమిటి..ఇద్దరూ ఒకేసారి ఇలా వచ్చారు అని అడుగుతుంది. ”మోనితను మీరు పిలిచారు. సారీ మేడం..నేను మీ అప్పాయింట్మెంట్ లేకుండా వచ్చాను.” అంటుంది దీప. ”ఫర్వాలేదు దీప నీకు ఇక్కడికి రావడానికి అప్పాయింట్మెంట్ అవసరం లేదు.” అని చెబుతుంది రోషిణి. దీంతో మోనిత అవాక్కవుతుంది. కానీ, బయటపడకుండా ఎందుకు రమ్మన్నారు మేడం అని అడుగుతుంది. ”నీకు అంజి తెలుసా?” అని డైరెక్ట్ గా అడుగుతుంది రోషిణి..మోనితను.

దీపకు అన్యాయం చేయవద్దు..

అక్కడ ఆనందరావు దగ్గరకు పిల్లల్ని తీసుకుని వెళతాడు కార్తీక్. ఆనందరావు కార్తీక్ తో ”నేను నిన్ను దూషించిన దానికి నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలీదు కానీ, నేను మాత్రం చాలా బాధపడుతున్నాను. చిన్నప్పటి నుంచీ ఎప్పుడూ నిన్ను అలా తిట్టలేదు.” అంటాడు. దానికి కార్తీక్..పిల్లలను తండ్రి తిట్టకపోతే ఎవరు మందలిస్తారు డాడీ..నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను.” అని చెబుతాడు. ఆనందరావు దీప తనకు కార్తీక్ గురించి చెప్పిన విషయాలను చెబుతాడు. దీప ఎంతోమంచిది. తనను అన్యాయం చేయకు. ఎట్టి పరిస్థితిలోనూ మోనితను పెళ్లి చేసుకునే ఆలోచన చేయకు అని ఆనందరావు కార్తీక్ తో అంటాడు. ”లేదు డాడీ.. ఇప్పటికే దీపకు చాలా అన్యాయం చేశాను. ఇక తనని జాగ్రత్తగా చూసుకుందామనే ప్రయత్నిస్తున్నాను. ఈ గొడవ త్వరలోనే క్లియర్ చేసుకుంటాను.” అని అంటాడు కార్తీక్.

అంజిని ప్రేమించావా మోనితా?

ఇక్కడ అంజి పేరు విన్నవెంటనే.. మోనిత గొంతు తడారిపోతోంది. మొహం పాలిపోతుంది. అయినా, సర్దుకుని కార్తీక్ డ్రైవర్ గా తెలుసు మేడం. అని చెబుతుంది. ”అవునా? అంతకు ముందు పరిచయం లేదా?” అని అడుగుతుంది రోషిణి. లేదు మేడం అని సమాధానం ఇస్తుంది మోనిత. అవునూ అంజి నువ్వు ప్రేమించుకున్నారా? అని అడుగుతుంది రోషిణి. ఛీ అదేంటి మేడం వాడితో నాకు ప్రేమ ఏమిటి? అని అంటుంది మోనిత. పోనీ నిన్ను అంజి పెళ్లిచేసుకుంటానని అన్నాడా? అని అడుగుతుంది రోషిణి. ఛీ ఆఫ్ట్రాల్ డ్రైవర్ ని నేను ఎందుకు పెళ్లిచేసుకుంటాను మేడం అని ప్రశ్నిస్తుంది మోనిత. మరి ఎందుకు దుర్గాప్రసాద్ తో అంజి మీ పెళ్ళిఆపమని చెప్పాడు? మరి ప్రేమ లేదు అంటే శత్రుత్వం ఉందా అని అడుగుతుంది రోషిణి. దాంతో మోనిత మొహం మాడిపోతుంది.. తాను అంజితో చేయించిన పాపం గుర్తొస్తుంది.

ఇదీ ఈ ఎపిసోడ్ కథ. మరి రోషిణి మోనిత నుంచి ఏ విషయాన్ని రాబట్టింది? అంజి సంగతి ఏమైంది? కార్తీక్ కూడా అంజిని వెతుకాలని అనుకుంటున్నాడు.. దొరుకుతాడా? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్ లలో తెలుసుకోవాల్సిందే.

Also Read: Karthika Deepam: మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం..కార్తీక్ లో మొదలైన ఆలోచన..అన్నీ సరిచేస్తున్న వంటలక్క!

Karthika Deepam: మిమ్మల్ని అద్నర్నీ నాశనం చేసేస్తాను..మోనిత శాపం.. ఏదైనా చేసుకో కార్తీక్ స్ట్రాంగ్ రిప్లై!

Karthika Deepam Serial: విషం తాగిన దీప.. పిచ్చెక్కిన మోనిత..నోరు విప్పిన కార్తీక్.. సూపర్ సీన్!