AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: యంగ్ టైగర్ ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు.. చెర్రీ గెలుచుకున్న అమౌంట్ ఎంతంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరోసారి బుల్లితెరపై సత్తా చాటేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గతంలో బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర

Ram Charan: యంగ్ టైగర్ ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు.. చెర్రీ గెలుచుకున్న అమౌంట్ ఎంతంటే..
Ntr Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2021 | 5:14 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరోసారి బుల్లితెరపై సత్తా చాటేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గతంలో బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన యంగ్ టైగర్.. మరోసారి ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షో ద్వారా మరోసారి అభిమానులకు అలరించనున్నాడు. బాలీవుడ్ బిగ్‏బీ.. అమితాబ్ బచ్చన్ హిందీలో హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ షో మాదిరిగానే తెలుగులోనూ ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఉండనుంది. అయితే గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ షోకు హోస్ట్‏గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ బుల్లితెరపై సందడి చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‏గా ఈ షోకు ఫస్ట్ ఎపిసోడ్‏కు రామ్ చరణ్ రాబోతున్నాడని.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ షో ప్రారంభం కానున్నట్లుగా గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ షోకు సంబంధించి ఆల్రెడీ 16 ఎపిసోడ్స్ పూర్తిచేసారట. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‏లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్‏తో కలిసి ఓ స్పెషల్ ఎపిసోడ్ కూడా షూట్ చేసారట. అందులో చరణ్. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పి.. రూ. 25 లక్షలను గెలుచుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరు మీలో కోటీశ్వరుడు క్విజ్ షో లో ప్రతీ సమాధానానికి ప్రైజ్ మనీ రెట్టింపు అవుతుందన్న సంగతి తెలిసిందే. చరణ్ తో షూట్ చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఆగస్టు 16న టెలికాస్ట్ చేయనున్నారట. ఆ తర్వాత సాధారణ కంటెస్టెంట్స్ పాల్గొన్న ఎపిసోడ్స్ ను ప్రసారం చేయనున్నారు. ఇక ఈ షో కోసం 60 ఎపిసోడ్స్ కు ఎన్టీఆర్ ఏకంగా రూ. 10 కోట్లు తీసుకుంటున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే 16 ఎపిసోడ్స్ పూర్తిగా.. మిగత ఎపిసోడ్స్.. ఆర్ఆర్ఆర్ సంబంధించి పెండింగ్‏లో ఉందట.

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజూ రోజూకీ అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్, హలీవుడ్ టాప్ స్టార్స్ కనిపించబోతున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో రామ్ చరణ్.. రామరాజు పాత్రలో నటిస్తుండగా.. కొమురం భీమ్ గా తారక్ నటిస్తున్నారు.

Also Read: Ayyappanum Koshiyum: ‘అయ్యప్పనుం కోషియుం’ షూటింగ్‏ స్పాట్‏లో పవన్-రానా.. ఇంట్రెస్టింగ్ సీన్ సోషల్ మీడియాలో లీక్..

Follow Us
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..