Karthika Deepam: ట్విస్ట్ ఇద్దమనుకుంటే షాక్ ఇచ్చిన కార్తీక్..దీప..మోనిత నషాళానికి అంటిన అంజి ‘పాన్’ మసాలా!

కార్తీక్ తో పెళ్ళికోసం అన్నీ సిద్ధం చేసుకున్న మోనితకు అంజి పెళ్లి ఆపాడనే విషయం షాక్ ఇస్తుంది. ఈలోపు ఏసీపీ రోషిణి ఆమెను తనదగ్గరకు రమ్మని ఫోన్ చేస్తుంది. అక్కడకు వెళ్ళడానికి బయలుదేరిన మోనిత వద్దకు దీప వస్తుంది.

Karthika Deepam: ట్విస్ట్ ఇద్దమనుకుంటే షాక్ ఇచ్చిన కార్తీక్..దీప..మోనిత నషాళానికి అంటిన అంజి 'పాన్' మసాలా!
Karthika Deepam Episode 1106
KVD Varma

|

Jul 31, 2021 | 8:15 AM

Karthika Deepam: కార్తీక్ తో పెళ్ళికోసం అన్నీ సిద్ధం చేసుకున్న మోనితకు అంజి పెళ్లి ఆపాడనే విషయం షాక్ ఇస్తుంది. ఈలోపు ఏసీపీ రోషిణి ఆమెను తనదగ్గరకు రమ్మని ఫోన్ చేస్తుంది. అక్కడకు వెళ్ళడానికి బయలుదేరిన మోనిత వద్దకు దీప వస్తుంది. పద ఇద్దరం కలిసి వెళదాం అంటూ ఆమెను తీసుకుని రోషిణి వద్దకు వస్తుంది. రోషిణి మోనితను ప్రశించడం మొదలు పెడుతుంది. అంజి ఎవరో తెలుసా అని అడుగుతుంది. కార్తీక్ డ్రైవర్ గా పరిచయం అని చెబుతుంది మోనిత. ఏదీ నిన్నటి (ఎపిసోడ్ 1105) వరకూ జరిగిన కార్తీకదీపం కథ. మరి ఈరోజు (ఎపిసోడ్ 1106) ఏం జరగబోతోందో తెలుసుకుందాం. ప్రతిరోజూ ప్రేక్షకులను అలరిస్తూ బుల్లితెరపై దుమ్ములేపుతున్న కార్తీకదీపం సీరియల్ కు అక్షర రూపం ఇది.

హిమ ఎవరు?

”అంజి మీద ప్రేమ లేదు సరే..పగ ఉందా?” అని మోనితను అడుగుతుంది రోషిణి. వెంటనే తనను అంజి బెదిరించిన విషయం గుర్తువస్తుంది మోనితకు. అదికూడా లేదు మేడం అని సమాధానం చెబుతుంది. దీంతో దీప కలుగచేసుకుని మరి అంజి మీద పగలేకపోతే నా ఫోన్, అంజి ఫోన్ ఎందుకు పగులగోట్టావు? అని అడుగుతుంది. ”నువ్వు డాక్టర్ భార్యవి. వాడో డ్రైవర్.. అటువంటి స్థాయి తక్కువ వ్యక్తితో నువ్వు మాట్లాడుతూ ఉంటే..కార్తీక్ పరువు పోతుందని హెచ్చరించాను.” అని చెబుతుంది మోనిత. ”అదిసరే..హిమ ఎవరు?” అని అడుగుతుంది ఏసీపీ రోషిణి. ”కార్తీక్ ప్రేమించిన అమ్మాయి మేడం..ఆమె చనిపోయింది. అందుకే మా అమ్మాయికి హిమ పేరు నేనే పెట్టాను.” అని చెబుతుంది దీప. ”హిమ నీకు తెలుసా? మోనితా అని ఆడుతుంది రోషిణి. ”తెలుసు మేడం, నేను కార్తీక్, హిమ క్లాస్ మేట్స్. కలిసి చదువుకున్నాం.” అని చెబుతుంది మోనిత.

”మరి హిమ ఎలా చనిపోయింది?” అని అడుగుతుంది రోషిణి. ”ఆమెను నేనే చంపానని దీప అభియోగం మేడం. లారీతో ఏక్సిడెంట్ చేసి చంపించానని దీప అంటుంది. ఆరోజు కారులో హిమ, కార్తీక్ ఇద్దరూ ఉన్నారు. మరి నేను ఎందుకు ఏక్సిడెంట్ చేయిస్తాను మేడం.” అని మోనిత ప్రశ్నిస్తుంది. అవునా.. అన్నట్టు అంజి ఆ లారీ డ్రైవర్ అనుకుంటాను అని రోషిణి అంటుంది. దీంతో మోనితకు చెమటలు పడతాయి. సరే మోనితా ఇక నువ్వు వెళ్ళొచ్చు. అంటుంది రోషిణి. మరి మేడం నాకు న్యాయం చేయండి.. అని అడుగుతుంది మోనిత. ;”న్యాయం కోర్టు చేస్తుంది మోనితా.. నేను మాత్రం అంజి ఎవరు.. హిమ ఎలా చచ్చిపోయింది? అసలు ఈ కేసు గురించి పూర్తిగా విచారించిన తరువాతే ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఇందులో తప్పు ఎవరిదని తేలితే వారిని ఏ మాత్రం అనుమానం లేకుండా కటకటాల వెనక్కి తోసేస్తాను.. నువ్వు వెళ్ళు.. దీపతో నాకు పని ఉంది.” అంటుంది రోషిణి. దీంతో మోనిత అక్కడ నుంచి బయలుదేరుతుంది. అంజి దొరక్కుండానే ఎంత నాటకం ఆడావు వంటలక్కా.. అంటూ మోనిత కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతుంది.

మోనితను కిడ్నాప్ చేసేయాలి..

అక్కడ భాగ్యం చపాతీ పిండి కలుపుతూ దీప గురించి ఆలోచిస్తుంది. మోనిత గుర్తువచ్చి చపాతీ పిండిని మోనితలా ఊహించుకుని గట్టిగా కలుపుతుంది. ఇంతలో ఆమెకు ఓ ఆలోచన వస్తుంది.. అసలు మోనితను ఇక్కడకు తీసుకువచ్చి రెండు తగిలించి గదిలో పెట్టి తాళం వేసేస్తే గొడవ వదిలిపోతుందిగా అనుకుంటుంది. ఛ.. ఈ ఐడియా ముందు ఎందుకురాలేదు? అని అనుకుని రేపు ఎలాగైనా మోనితను మంచి మాటలతో ఇక్కడకు రప్పించి.. గదిలో పెట్టి తాళం వేసేస్తాను అని అనుకుంటుంది.

నీ సంగతి తేలుస్తా వంటలక్కా..

ఇక ఇంటికి వచ్చిన మోనిత డైనింగ్ టేబుల్ మీద కూచుని చికెన్ తింటూ ఉంటుంది. ప్రియామణి బిర్యానీ తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతుంది. ”ఏమిటో అమ్మగారూ మీరు టేబుల్ మీద కూచుని తినడం ఏమిటో నాకు ఏమీ అర్ధం కావడం లేదు” అంటుంది. ”నా మనసు ఎంతో తేలికగా ఉంది. బిర్యానీ వాసన అదిరిపోతోంది. నిమ్మకాయలు, ఆనియన్ పట్రా. ఆ ఫోన్ ఇలా ఇవ్వు.. నాకు దీంతో చాలా పని ఉంది” అని చెబుతుంది మోనిత. ఫోన్ తీసుకుని నన్ను అంజి పేరు చెప్పి భయపెదతావ..నీ సంగతి తేలుస్తాను ఉండు దీపా అని అనుకుంటూ ఫోన్ చేస్తుంది.

ట్విస్ట్ ఇద్దమనుకుంటే షాక్ ఇచ్చారు.. వాటే సీన్!

కార్తీక్, దీప పిల్లలను తీసుకుని ఇంటివద్దకు వస్తారు. పిల్లలు కారు దిగి ఇంటిలోకి వెళ్ళిపోతారు. ఇంతలో కార్తీక్ ఫోన్ కి మోనిత ఫోన్ చేస్తుంది. దీప ఫోన్ తీయండి డాక్టర్ బాబూ అంటుంది. కార్తీక్ కార్ స్పీకర్ ఆన్ చేస్తాడు. ”ఏంటి కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేశావు. చేయవని అనుకున్నాను. అవునూ దీప ఏమిటి మన పెళ్లి జరగదు అని ఫిక్స్ అయినట్టు ఉంది.. ఆగు కార్తీక్ కొద్దిగా లైన్ లో ఉండు అని.. ప్రియమణి ఫ్రిజ్ లో పాన్ లు ఉన్నాయి పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టు. గదిలో మందులు ఉన్నాయి. అవికూడా తీసుకురా.. అలాగే మంచినీళ్ళు కూడా అని చెప్పి మళ్ళి కార్తీక్ తో ఫోన్లో మాట్లాడుతుంది. వేచి ఉన్నందుకు ధన్యవాదాలు కార్తీక్. వంటలక్క ఎదో పెళ్లి ఆగిపోతుంది అనుకున్తున్నాట్టు ఉంది. ఆగే సమస్యే లేదు అని చెబుతుంది. నువ్వు మాత్రం తక్కువా.. నీకు దారితప్పిన దేవతా పాట ఒకటే తక్కువ అంటుంది. ఈలోపు కార్తీక్ కారును మోనిత ఇంటివైపు తిప్పుతాడు.

మోనిత ఫోన్ మాట్లాడుతూ ఉండగానే దీప కార్తీక్ ఆమె ఎదురుగా వచ్చి నిలబడతారు. దీంతో డైనింగ్ టేబుల్ మీద చికెన్ తింటున్న మోనిత షాక్ అవుతుంది. కిందకి దిగుతూ నేను దీనికి ఎదో ట్విస్ట్ ఇద్దామనుకుంటే.. ఇద్దరూ ఇలా వచ్చి నాకు ట్విస్ట్ ఇచ్చరేమిటి అని అనుకుంటుంది. కార్తీక్ ‘ఆగిపోయావే.. మాట్లాడు. ఎదురుగానే ఉన్నాం కదా అంటాడు. ‘ఏం స్వరపేటిక అరిగిపోయిండా.. నాలుక అడ్డంగా చిరిగిపోయిందా..ఇప్పటివరకూ ఇష్టం వచ్చినట్టు అవాకులూ చెవాకులూ పేలావ్ కదా..” అంటుంది దీప. తేరుకున్న మోనిత..”రా అక్కా.. మన ఉమ్మడి మొగుడుని నాకు అప్పచెప్పి త్యాగమూర్తిగా మిగిలిపోతావు. ఈ పని ముందుగానే చేయాల్సింది. ఈ గొడవలు లేకుండా పోయేవి.” అంటుంది.

అవును.. అంజి నిజంగా రాలేదని తెలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఉంది. బిర్యానీ.. చికెన్ లెగ్ పీస్ లు.. కిళ్ళీ సూపర్ గా ఉంది. అంటుంది దీప. కార్తీక్ అవును లాస్ట్ లో తినడం కోసం అయివుంటుంది. అంటాడు. అంజి ప్రసక్తి రాగానే మోనిత ఫీజులు ఎగిరిపోతాయి. ప్రియమాణి మీరు ఎప్పుడు బిర్యానీ చేసుకున్నారు? అని అడుగుతుంది. వారం క్రితం అమ్మా అని చెబుతుంది. అంతకు ముందు అని అడుగుతుంది దీప దానికి వారం క్రితం అమ్మా అంటుంది. దీంతో దీప నీ లెవెల్ తెలుసుకుందామని అడిగాను అంటుంది. డాక్టర్ బాబూ అంజి రాలేదని రిలాక్స్ అయినట్టు ఉంది. మీరే అంజిని వెతికి తీసుకువచ్చి దీని ఎదురుగా నిలబెట్టండి అప్పుడు దీని టక్కులాడి విషయాలు తెలుస్తాయి అంటుంది దీప. అవును దీపా.. నువ్వూ అమ్మా మోనిత గురించి చెబితే వినేవాడిని కాదు. నాకు అంతా తెలుసు అనుకునే వాడిని. అప్పుడు కాదు.. ఇప్పుడు మోనిత గురించి మీకంటే ఎక్కువ నాకే తెలుసు అంటాడు కార్తీక్ దీంతో మోనిత ఫ్యూజులు ఎగిరిపోతాయి.

అక్కడ ఉన్న కిళ్ళీలు తీసుకుని ఒకటి తన చేత్తో కార్తీక్ కు తిపిస్తుంది.దీప. మరోదానిని దీపకు కార్తీక్ తినిపిస్తాడు. అయ్యో నీ పాన్ లు తినేశాం మళ్ళీ తెప్పించుకో అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతారు. మోనితకు షాక్ తో చెమటలు పడతాయి. ప్రియమణి ఆమెను చూసి ఎవరు ఈ అంజి.. అతని పేరు వింటే మా అమ్మగారు ఇలా అయిపోతున్నారేమిటి అనుకుంటుంది. మరి తరువాత ఏమైందో తెలియాలంటే సోమవారం వరకూ ఆగాల్సిందే!

Also Read:  సోమవారం నుంచి శుక్రవారం వరకూ (ఎపిసోడ్ 1101 నుంచి 1105) ఏం జరిగిందంటే..

Karthika Deepam: అంజిని ప్రేమించావా మోనితా.. వంటలక్క భలే ఇరికించింది.. రంగంలోకి దిగిన డాక్టర్ బాబు!

Karthika Deepam: మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం..కార్తీక్ లో మొదలైన ఆలోచన..అన్నీ సరిచేస్తున్న వంటలక్క!

Karthika Deepam: మిమ్మల్ని అద్నర్నీ నాశనం చేసేస్తాను..మోనిత శాపం.. ఏదైనా చేసుకో కార్తీక్ స్ట్రాంగ్ రిప్లై!

Karthika Deepam Serial: విషం తాగిన దీప.. పిచ్చెక్కిన మోనిత..నోరు విప్పిన కార్తీక్.. సూపర్ సీన్!

Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu