Karthika Deepam: ధర్మం కోసం ఒకరు.. పంతంతో మరొకరు.. ఒకే కారులో ఉప్పూ..నిప్పూ.. కార్తీకదీపంలో యాక్షన్ సెగ!

సాధారణంగా టీవీల్లో సీరియల్ అంటే..మహిళలు మాత్రమే చూస్తారు అనే నమ్మకాన్ని పటాపంచలు చేసింది బుల్లితెర మెగా సీరియల్ కార్తీకదీపం. సీరియల్ ప్రారంభం అయింది మొదలు ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటూ సాగిపోతోంది.

Karthika Deepam: ధర్మం కోసం ఒకరు.. పంతంతో మరొకరు.. ఒకే కారులో ఉప్పూ..నిప్పూ.. కార్తీకదీపంలో యాక్షన్ సెగ!
Karthika Deepam Episode 1108
Follow us
KVD Varma

|

Updated on: Aug 03, 2021 | 8:06 AM

Karthika Deepam: సాధారణంగా టీవీల్లో సీరియల్ అంటే..మహిళలు మాత్రమే చూస్తారు అనే నమ్మకాన్ని పటాపంచలు చేసింది బుల్లితెర మెగా సీరియల్ కార్తీకదీపం. సీరియల్ ప్రారంభం అయింది మొదలు ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటూ సాగిపోతోంది. రోజులు గడుస్తున్నాయి. ఎపిసోడ్ లెక్కలు పెరుగుతున్నాయి. కానీ, కార్తీకదీపం అదే ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. డాక్టర్ బాబు కార్తీక్ దీపను ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. డాక్టర్ బాబును ప్రేమించిన మోనిత ఆ నిజాన్ని జీర్ణించుకోలేక కార్తీక్ మీద ప్రేమను చంపుకోలేక..ఎలాగైనా కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కార్తీక్..దీపల మధ్య పెద్ద అనుమాన భూతాన్ని ప్రవేశ పెట్టి ఇద్దరినీ పదేళ్ళ పాటు కలవకుండా చేసింది మోనిత. ఈ పదేళ్ళు కార్తీక్ కి దగ్గర అవ్వాలని విశ్వప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే, అది సాధ్యం కాలేదు. ఈలోపు దీప విషయంలో తాను తప్పు చేశానని కార్తీక్ గ్రహిస్తాడు. దీప, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండాలని భావిస్తాడు. మరి మోనిత ఊరుకుంటుందా? తాను గర్భవతి అని కొత్త విషయాన్ని చెప్పి.. దాని ఆధారంగా కార్తీక్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. కార్తీక్ ను పెళ్లి చేసుకుంటానని శపథం చేసి హంగామా చేస్తోంది.. మోనిత చెత్త ఆలోచనకు దీప చెక్ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎప్పుడో అంజి అనే డ్రైవర్ తో మోనిత చేయించిన ఓ హత్యను బయటపెట్టాలని దీప ప్రయత్నిస్తుంది. ఏసీపీ

రోషిణి సహాయంతో కనిపించకుండా పోయిన అంజిని వెదికే ప్రయత్నాల్లో ఉంటుంది. మోనితకు కూడా అంజి పేరు చెప్పి చెమటలు పట్టిస్తుంది. దీంతో మోనిత కూడా అంజిని వెతికి పట్టుకుని తన తప్పుకు సాక్ష్యం లేకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. మరి దీప ప్రయత్నాలు ఫలిస్తాయా? మోనిత ప్లాన్ విజయవంతం అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

నిన్నటి ఎపిసోడ్ (1107)లో ఏమి జరిగిందంటే..

కార్తీక్ ఏసీపీ రోషిణిని కలుస్తాడు. ఆమె కార్తీక్ ను మోనిత విషయంలో నిలదీస్తుంది. తప్పు నీదే అంటూ కచ్చితంగా చెబుతుంది. ఆడా, మగా స్నేహం మధ్యలో ఉండాల్సిన హద్దులు దాటారని అంటుంది. అయితే, తాను హద్దులు దాటలేదని చెప్తాడు కార్తీక్. అంజిని పట్టుకుంటే సమస్య ఒక కొలిక్కి వస్తుంది హెల్ప్ చేయమని అడుగుతాడు. దానికి రోషిణి అంజి విషయంలో కార్తీక్ ను కలుగ చేసుకోవద్దనీ.. అలాచేస్తే ఇబ్బందులు వస్తాయనీ..తాను ఆ విషయం చూసుకుంటాననీ చెబుతుంది. తరువాత దీపకు ఫోన్ వస్తుంది. అంజి సూర్యాపేటలో ఉన్నాడనీ..కార్తీక్ కు తెలియకుండా అక్కడకు వెళ్ళాలనీ ఫోన్ లో రోషిణి చెబుతుంది. దీప సూర్యాపేట వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. తాను భాగ్యం ఇంటికి వెళుతున్నానని కార్తీక్ కు అబద్ధం చెప్పి సూర్యాపేట బయలుదేరుతుంది. ఇక అటు మోనితకు కూడా ఎవరో అంజి సూర్యాపేటలో ఉన్నట్టు చెబుతారు. దీంతో ఆమె కూడా సూర్యాపేట వెళ్లేందుకు బయలుదేరుతుంది. మరి ఇప్పుడు అంజి ఎవరికీ దొరుకుతాడు? ఏమి జరుగుతుంది? ఈరోజు ఎపిసోడ్ (1108)లో ఏమి జరగబోతోందో తెలుసుకుందాం.

జాగ్రత్త దీపా..

దీప సూర్యాపేట వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. దీపకు జాగ్రత్తలు చెబుతాడు కార్తీక్. దీపను ”25 వ తేదీ దగ్గరకు వస్తుందన్న టెన్షన్ నీలో ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అని అడుగుతాడు. ”సూర్యుడిని ఉదయించవద్దంటే ఆగుతాడా? 25వ తేదీ రావద్దంటే ఆగుతుందా? కానీ, ఆరోజు జరగాల్సిన పనిని ఆపాలనే నా ప్రయత్నం అంటుంది.” నేను వెళ్లొస్తాను అంటూ బయటకు వెళుతుంది. కారులో సూర్యాపేట బయలుదేరుతుంది. ఇక మోనిత కూడా కారులో సూర్యాపేట వెళుతూ ఉంటుంది. ”ఒరే అంజిగా సరిగ్గా దొరికావు రా. ఇప్పుడు నిన్ను పట్టుకుని కార్తీక్ ను నేను పెళ్లి చేసుకుంటాను. నేను చెప్పినట్టు వింటావా? సరే, లేదంటే నిన్ను కాల్చేసి అయినా సరే విషయాన్ని తెల్చేస్తాను. ఈ దెబ్బతో రోషిణి..దీపల సంగతి తేలిపోతుంది. అనుకుంటూ కారులో వెళుతూ ఉంటుంది.

భాగ్యం కల

భాగ్యం నిద్రపోతూ ఉంటె..దీప ఇబ్బందిలో ఉన్నట్టు.. మోనిత కార్తీక్ ను తీసుకుని వెళ్లిపోయినట్టు కల వస్తుంది. దీంతో కంగారు పడిన భాగ్యం దీప ఫోన్ కి కాల్ చేస్తుంది. అయితే, దీప ఫోన్ ఇంటిదగ్గర మర్చిపోతుంది. దీంతో ఆమె కాల్ కార్తీక్ అటెండ్ అవుతాడు. భాగ్యం ఇంటికి వెళుతున్నానని చెప్పిన దీప ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడతాడు. మోనిత ఇంటికి కానీ వెళ్ళిందా? అనుకుంటూ అక్కడికి వెళతాడు. అక్కడ ప్రియమణి మోనిత ఇంట్లో లేదని చెబుతుంది. ఉదయం వస్తుంది అని చెబుతుంది. దీనితో కార్తీక్ కంగారు పడతాడు.

మోనిత పైశాచిక సంబరం

ఇటు మోనిత కారులో వెళుతూ అంజి కాసేపట్లో తనకి దొరుకుతాడనే సంబరంలో ఉంటుంది. ఈలోపు కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోతుంది. దీంతో ఆమె కారును పక్కకు పెట్టి లిఫ్ట్ అడిగి సూర్యాపేట వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. రోడ్డుపై నిలుచుని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. అదే దారిలో వెళుతున్న దీప కారు మోనిత ఉన్న ప్రాంతం దగ్గరకు వస్తుంది. మోనితను చూసిన డ్రైవర్ ఇదేమిటి ఈవిడ ఇక్కడుంది అనుకుని.. అక్కా మన ఇంటికి అప్పుడప్పుడు వస్తుంది కదా.. ఆ డాక్టరమ్మ ఇక్కడ ఉంది. అందర్నీ లిఫ్ట్ అడుగుతోంది. అంటాడు. దీంతో దీప.. ఇది కూడా సూర్యాపేట వస్తోందా? అంటే అంజి అక్కడ ఉన్న విషయం తెలిసిందా? అని అనుకుని కారు ఆపి ఆమెను ఎక్కించుకో. కానీ, కారులో ఉన్నది నేనని చెప్పకు. విజయవాడ వెళుతున్నానని చెప్పు అంటుంది. సరే అక్కా అని కారు ఆపుతాడు.

ఒకే కారులో ఉప్పూ..నిప్పూ..

దీప వెనుక సీట్లో దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. దీంతో మోనిత కారులో ఉన్నది దీప అని తెలియక సూర్యాపేట వరకూ లిఫ్ట్ ఇమ్మని అడుగుతుంది. కారు ఎక్కిన మోనిత వెనక్కి తిరిగి చూసి కారులో పడుకుంది ఎవరు అని అడుగుతుంది. మా అక్క అని డ్రైవర్ చెబుతాడు. ఒంట్లో బాలేదా? అంటుంది లేదు..నిద్ర వస్తోందని పడుకుందని అతను సమాధానం చెబుతాడు. ఈలోపు మోనితకు ఫోన్ వస్తుంది. సూర్యాపేటకు ఇంకో 40 నిమిషాల్లో వచ్చేస్తాను అని అవతల వారితో చెబుతుంది. ఇది విన్న దీపకు మోనిత అంజి కోసమే వెళుతోంది అని నిర్ధారణ అయిపోతుంది. ఇంతకాలం అంజి నాకు తెలీదు అని బుకాయిస్తూ వచ్చిన మోనిత ఇప్పుడు అంజి కోసం వస్తున్న విషయం డాక్టర్ బాబుకి తెలిస్తే అప్పుడు మోనిత గురించి అన్నీ నమ్ముతారు అనుకుంటుంది. దీనికి ఇంత నెట్ వర్క్ ఉందా? ఇది ఎదో పాడుపని చేసేలా ఉంది. ఇక ఎదో ఒక నిర్ణయం వేగంగా తీసుకోవాలి అనుకుంటుంది.

కార్తీక్ కంగారు..

ఇక కార్తీక్ దీప కోసం కంగారుపడుతుంటాడు. మోనిత దీపను రమ్మంటే వెళ్ళిందా? అయినా దీప మొనితను నమ్మదు. నాకోసం దీప ఎందుకు ఇంత రిస్క్ చేస్తోంది అనుకుంటాడు. తమ్ముడు ఆదిత్య దగ్గరకు వెళ్లి దీప విషయం చెప్పి కంగారు పడతాడు. అన్నయ్యా..వదిన ఏమీ పిరికిది కాదు. అందులోనూ మోనిత విషయంలో అస్సలు ఊరుకోడు. నువ్వు కంగారు పడకు అని చెబుతాడు. అవును దీప పిరికిది కాదు కానీ.. ఆ మోనిత మాత్రం మంచిది కాదు. ఎలాగైనా నన్ను దక్కించుకోవాలని ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. దానికి సెంటిమెంట్స్ లేవు.. పరువు గురించి బెంగ లేదు. అందుకే కంగారు పడుతున్నా అంటాడు కార్తీక్. ”అన్నయ్యా వాడినాను అర్ధం చేసుకోవడానికి నీకు పదేళ్ళు పట్టింది. మోనితను అర్ధం చేసుకోవడానికి పదహారేళ్ళు పట్టింది. అమ్మ అక్కడికీ చెబుతూనే ఉంది.. నువ్వే వినలేదు.” అని ఆదిత్య చెబుతాడు. దీంతో ”ఏంట్రా..అవకాశం దొరికింది కదా అని దేప్పుతున్నావా?” అంటాడు కార్తీక్. అలాంటిది ఎమీ  లేదు అని చెబుతాడు ఆదిత్య.

ఇక ఒకే కారులో.. ఒకే వ్యక్తి కోసం ఇద్దరు.. మోనిత..దీప! ఒకరు తన జీవితాన్ని నిలబెట్టుకోవాలనే ధర్మం కోసం.. మరొకరు తన పంతం నెగ్గించుకోవడానికి అవతల వారిని ఏదైనా చేయాలన్న తెగింపుతో.. మరి ఇద్దరూ ఆ వ్యక్తి అంజి వద్దకు వెళ్ళారా? అంజి దొరికాడా? ఇప్పుడు కారులో ఉన్నది దీప అని తెలిస్తే మోనిత రియాక్షన్ ఏమిటి? ఇది తెలియాలంటే రేపటి (ఎపిసోడ్ 1109) వరకూ ఆగాల్సిందే!

Also Read: కార్తీక దీపం అక్షరరూపం ప్రతిరోజూ.. ఇంతకు ముందు ఎపిసోడ్ ల కోసం ఇక్కడ చూడండి..

Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!

Karthika Deepam: ట్విస్ట్ ఇద్దమనుకుంటే షాక్ ఇచ్చిన కార్తీక్..దీప..మోనిత నషాళానికి అంటిన అంజి ‘పాన్’ మసాలా!

Karthika Deepam: అంజిని ప్రేమించావా మోనితా.. వంటలక్క భలే ఇరికించింది.. రంగంలోకి దిగిన డాక్టర్ బాబు!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!