పార్లమెంటులో ఉమ్మడి వ్యూహం.. రేపు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్. విపక్షాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆహ్వానం
పార్లమెంటులో విపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని పాటించేందుకు అనువుగా దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధే మంగళవారం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరు కావాలంటూ ప్రతిపక్ష ఎంపీలందరికీ ఆహ్వానాలు పంపారు.
పార్లమెంటులో విపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని పాటించేందుకు అనువుగా దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధే మంగళవారం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరు కావాలంటూ ప్రతిపక్ష ఎంపీలందరికీ ఆహ్వానాలు పంపారు.ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కి కూడా ఆయన ఇన్విటేషన్ పంపడం విశేషం. లోగడ కాంగ్రెస్ నిర్వహించిన ఈ విధమైన సమావేశాలకు తృణమూల్ హాజరు కాలేదు. కానీ ఈ సారి ఈ సమావేశానికి హాజరవుతామని ఈ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటులో ప్రధానంగా పెగాసస్ వివాదంపై చర్చించేందుకు విపక్షాలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని, అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహం అవసరమని కాంగ్రెస్ భావిస్తున్నట్టు ఈ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. మంగళవారం ఉదయం ఈ ఎంపీలంతా పార్లమెంట్ వరకు ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహిస్తారని ఆయన చెప్పారు. పార్లమెంట్ భవనానికి దగ్గరలో ఉన్న కాన్స్ టిట్యూషనల్ క్లబ్ లో ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరగనుంది.
విపక్షాలు పోటీ పార్లమెంటును నిర్వహించాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బ్రేక్ ఫాస్ట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. యేవో కొన్ని బిల్లులను ఆమోదించడం తప్ప ఇప్పటివరకు చట్ట సభల కార్యకలాపాలు సజావుగా జరగలేదు. పెగాసస్ పై చర్చించడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో విపక్షాల రభస, గందరగోళం కారణంగా ఉభయ సభలూ వాయిదా పడుతూ వచ్చాయి. ముఖ్యమైన అంశాలపై చర్చను చేపట్టలేకపోయాయి. పైగా ఈ నెల 13 తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ కారణంగా విపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహం అనుసరించి ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టాలని ఈ పార్టీలు నిర్ణయించాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్ పెట్టుకోలేదని..:Police attack Video.
పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.
పాతిపెట్టిన శవం.. ఎలా బయటకు వచ్చింది..?నడిరోడ్డుపై శవ పేటిక..:Buried corpse video.