AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

e-RUPI Digital Currency : ఈ-రూపీని లాంచ్‌ చేసిన ప్రధాని మోదీ.. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం

కొత్త డిజిటల్‌ చెల్లింపు విధానం ఈ-రూపీని లాంచ్‌ చేశారు ప్రధాని మోదీ. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది...

e-RUPI Digital Currency : ఈ-రూపీని లాంచ్‌ చేసిన ప్రధాని మోదీ.. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం
E Rupi Launched
Ram Naramaneni
|

Updated on: Aug 02, 2021 | 5:59 PM

Share

కొత్త డిజిటల్‌ చెల్లింపు విధానం ఈ-రూపీని లాంచ్‌ చేశారు ప్రధాని మోదీ. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల గవర్నర్లు కూడా హాజరయ్యారు. బ్యాంక్‌ ఖాతాలు , కార్డులు , యాప్‌లతో సంబంధం లేకుండా చెల్లింపులు చేసే విధంగా ఈరూపీని రూపొందించారు.

క్యూఆర్‌ కోడ్‌ , ఎస్‌ఎంఎస్‌లతో చెల్లింపులు చేసే విధంగా ఈ రూపీని రూపొందించారు. డిజిటల్‌ ఇండియాతో పాటు తాము చేపట్టిన పరిపాలన సంస్కరణలకు ఈ రూపీ నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. ఈరూపీతో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చన్నారు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చన్నారు . ఈ వ్యవస్థలో ఒక క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ వోచర్‌లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి పంపిస్తారు. వీటినే ఇ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌.. వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు.

ఈ వోచర్లను ఎలా జారీ చేస్తారు..

ఇ-రూపీ వ్యవస్థను అమలు చేసేందుకు కొన్ని కీలక బ్యాంకులు ముందుకు వచ్చాయి. మరికొన్ని బ్యాంకులు కూడా రానున్న రోజుల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వోచర్లు కావాల్సిన వారు సదరు బ్యాంకులను సంప్రదించాలి. ఫోన్‌ నంబరుతో సహా లబ్ధిదారుల వివరాలను వారికి అందజేయాలి. వోచర్‌ విలువ ఎంతో కూడా తెలియజేసి.. మొత్తం సొమ్మును చెల్లించాలి. అలాగే ఆ చెల్లింపులు ఎందుకోసం చేస్తున్నారో కూడా తెలియజేయాలి. అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి.

ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేనందున ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే ఆరోగ్యం, ఔషధాలకు సంబంధించిన సేవలను అందజేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి. మాతా-శిశు సంబంధిత, టీబీ నిర్మూలన, ఆయుష్మాన్ భారత్‌, పీఎం ఆరోగ్య యోజన, ఎరువుల రాయితీ.. వంటి పథకాల అమలు ఇ-రూపీ ద్వారా మరింత సమర్థంగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల సంక్షేమం సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు సైతం ఇ-రూపీని వినియోగించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Also Read:Woman Cop: దెబ్బ అదుర్స్.. రేపిస్ట్‌ను పట్టుకునేందుకు లేడీ ఎస్‌ఐ మాస్టర్ స్కెచ్..

AP Crime News: కడప ప్లేబాయ్ కేసులో కొత్త కోణం​.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు