Woman Cop: దెబ్బ అదుర్స్.. రేపిస్ట్‌ను పట్టుకునేందుకు లేడీ ఎస్‌ఐ మాస్టర్ స్కెచ్..

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Aug 02, 2021 | 4:36 PM

ముల్లును, ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. అలాగే మదమెక్కిక కంత్రిగాళ్లకు బుద్ది చెప్పాలంటే వాళ్ల రూట్‌లోనే వెళ్లాలి.

Woman Cop:  దెబ్బ అదుర్స్..  రేపిస్ట్‌ను పట్టుకునేందుకు లేడీ ఎస్‌ఐ మాస్టర్ స్కెచ్..
Female Cop

Follow us on

ముల్లును, ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. అలాగే మదమెక్కిక కంత్రిగాళ్లకు బుద్ది చెప్పాలంటే వాళ్ల రూట్‌లోనే వెళ్లాలి. తాజాగా అదే పని చేశారు ఢిల్లీ పోలీసులు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి.. అమ్మాయిలను ట్రాప్ చేస్తోన్న ప్రబుద్దుడి ఆట  కట్టించారు. వివారాల్లోకి వెళ్తే.. ఓ గాజుల దుకాణంలో పని చేసే నిందితుడు అమ్మాయిలను ముగ్గులోకి దింపి శారీరక వాంఛలు తీర్చుకున్న తర్వాత పత్తా లేకుండా పోయేవాడు. తాజాగా  ఢిల్లీకి చెందిన ఓ పదహారేళ్ల మైనర్ బాలికతోనూ పరిచయం పెంచుకుని.. ఆమెను నమ్మించి కామ వాంఛలు తీర్చుకున్నాడు. అతడి కారణంగా గర్భం దాల్చిన బాలిక చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తొలుత నిందితుడికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేసేందుకు బాలిక భయపడింది. పోలీసులు భరోసా ఇవ్వడంతో అంగీకరించింది.

దీంతో  స్థానిక సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రియాంక సైనీ కేసు నమోదు చేసి.. నిందితుడి వివరాలు సేకరించింది. తన ఇంటికి దగ్గర్లో ఉండే ఓ యువకుడు తనతో పరిచయం పెంచుకుని, లైంగిక దాడి చేసినట్టు బాలిక వెల్లడించింది. అయితే  గర్భం దాల్చినట్టు తెలియడంతో తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పింది. ఫోన్ నెంబరు కూడా ఇవ్వకుండా సోషల్ మీడియా ద్వారానే ఈ తతంగం అంతా నడిపాడని చెప్పుకొచ్చింది. బాధిత బాలిక సాయంతో ఎస్ఐ షైనీ ఫేస్‌బుక్‌లో నిందితుడి ప్రొఫైల్ గుర్తించింది. ఈ కేటుగాడు అంత ఈజీగా దొరకడని డిసైడయ్యి..  వాడి రూటులోనే బుద్ది చెప్పాలని ప్రణాళిక రూపొందించింది.

ఓ నకిలీ ప్రొఫైల్ క్రియోట్ చేసిన ఎస్ఐ ప్రియాంక.. నిందితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. సాధారణంగా అమ్మాయిలంటే వ్యామోహమున్న నిందుతుడు.. పిట్టే వచ్చి పంజరంలో పడిందనుకుని.. వెంటనే సైని పెట్టిన రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి కొద్ది రోజుల పాటు వాడితో చాటింగ్‌ చేసింది. తనపై నమ్మకం కుదిరిందని భావించిన తర్వాత ఫోన్ నంబర్, అడ్రస్ అడగ్గా.. నిందితుడు నిరాకరించాడు. స్వయంగా కలిస్తే అన్ని వివరాలు చెబుతానని అన్నాడు. మరికొన్నాళ్లు చాట్ చేసిన ఎస్‌ఐ ఎట్టకేలకు మొబైల్ నెంబర్‌ను సంపాదించారు.

జులై 31న దశరథపురి రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 7.30 కలుద్దామని.. అక్కడకు రావాలని చెప్పాడు. అందుకు సరేనన్న పోలీస్ అధికారిణి.. మఫ్టీలో తమ వాళ్లను రెడీగా ఉంచింది. అతడు చెప్పిన చోటుకు తన టీమ్‌తో వెళ్లిన సబ్‌-ఇన్‌స్పెక్టర్ సైనీ నిందితుడిని అరెస్ట్ చేసింది. పోలీసుల విచారణలో నిందితుడు షాకింగ్ విషయాలను వెల్లడించాడు. పదిహేను నెలల్లో ఆరుగురిపై లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పాడు. అందుకే తన గురించి ఎవరికీ తెలియకుండా  ఇళ్లు మారుతుంటానని పేర్కొన్నాడు. అమ్మాయిలకు నకిలీ పేర్లు చెప్పి పరిచయం పెంచుకుని శారీరక వాంచ తీరిన తర్వాత వదిలేస్తానని అంగీకరించాడు.

Also Read: కడప ప్లేబాయ్ కేసులో కొత్త కోణం​.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు

విరబూసిన ‘సింధూ’రంపై భారత ఉభయ సభల ప్రశంసలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu