Crime News : ఆ నిండు ‘వెన్నెల’ అస్తమించింది.. కులం రక్కసికి బలైపోయింది.. కంటతడి పెట్టిస్తున్న మరణ లేఖ..

Crime News : ప్రేమించానని వెంటపడ్డాడు.. కలకాలం చూసుకుంటానని నమ్మించాడు.. జీవితాంతం తోడుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.

Crime News : ఆ నిండు 'వెన్నెల' అస్తమించింది.. కులం రక్కసికి బలైపోయింది.. కంటతడి పెట్టిస్తున్న మరణ లేఖ..
Crime
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Aug 02, 2021 | 5:22 PM

Crime News : ప్రేమించానని వెంటపడ్డాడు.. కలకాలం చూసుకుంటానని నమ్మించాడు.. జీవితాంతం తోడుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకే వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ప్రేమ కోసం నా అనుకునే వాళ్లను వదిలేసి వచ్చినందుకు ఏం చేయాలో ఆ యువతికి పాలుపోలేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది. రెండో రోజులు ఆస్పత్రిలో నరకయాతన అనుభవించి కన్ను మూసింది. చివరి క్షణాల్లో రాసిన వెన్నెల మరణలేఖ ఇప్పుడు జిల్లాలో అందరిని కంటతడిపెట్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అదే గ్రామానికి చెందిన వెన్నెలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు‌. ప్రేమ పెళ్లికి కిరణ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఉన్న ఊరు వదిలి చెన్నూర్ లో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే కొన్ని నెలలు గడిచాక అత్తమామలు కొడుకును ఇంటికి రావాలంటూ కోరారు. అత్తమామల పిలుపుతో సంబరపడిపోయిన వెన్నెల మెట్టినింటి గడప తొక్కింది‌. అప్పటి వరకు ఏ బాదర బంది లెకుండా సాగిన కాపురం.. ఒక్కసారి తారుమారైంది‌.

నా కొడుకును బుట్టలో వేసుకుని కట్నం రాకుండా చేశావంటూ అత్తమామ వేధింపులు షురూ అయ్యాయి. ఇద్దరికులాలు వేరు కావడంతో ఆ వేధింపులు మరింత పెరిగాయి‌. తన బాధను ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక వెన్నెల మూడు పేజీల లేఖ రాసి 30 తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా గుర్తించిన స్థానికులు వెన్నెలను మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందుతూ చివరికి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. అమ్మనాన్న క్షమించండి.. మళ్లీ జన్మంటూ ఉంటే మన కులంలోనే పుడుతానంటూ వెన్నెల రాసిన సూసైడ్ లేఖ అందరిని కన్నీరు పెట్టిస్తోంది‌.

భర్త కిరణ్ కుమార్ వేదింపులు ఎక్కువకావడం , కులంపేరుతో సూటిపోటి మాటలనడంతో ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కోంది. దీనిపై వెన్నెల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసునమోదు చేయడంతో పాటు ఐపీసీ 304 సెక్షన్ ల కింద కేసునమోదు చేసినట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. వెన్నెల మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

(నరేష్, TV9 తెలుగు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా)

Sonu Sood : సోనుసూద్‌‌పై ఇది వేరే లెవల్ అభిమానం..! 50 వేల చదరపు విస్తీర్ణంలో భారీ చిత్రం

Instagram: టీనేజర్ల భద్రతకు ఇన్‌స్టాగ్రామ్‌ భరోసా.. తెలుగు యూజర్ల కోసం ప్రత్యేకంగా పేరెంట్స్‌ గైడ్‌ విడుదల..

Tokyo Olympics 2020 Live: కాసేపట్లో మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్స్.. అథ్లెట్లో పతకం తెచ్చి.. భారతీయుల కల నెరవేర్చేనా