Tokyo Olympics 2020 Highlights: భారత్‌కు నిరాశ.. డిస్కస్‌ త్రోలో చేజారిన పతకం.. ఆరో స్థానంతో సరిపెట్టుకున్న కమల్‌ ప్రీత్‌..

Narender Vaitla

|

Updated on: Aug 03, 2021 | 3:39 PM

Tokyo Olympics 2020 Live Updates: టోక్యో ఒలంపిక్స్ 11వ రోజు అథ్లెటిక్స్ లో పతకం భారత్ ఖాతాలో పడుతుందనే ఆశలను కమల్‌ప్రీత్‌ కౌర్‌ కలిగించింది. ఒలింపిక్స్‌ క్రీడల్లో ఇప్పటివరకు భారత్‌కు లోటుగా ఉన్న అథ్లెటిక్స్‌ పతకాన్ని ప్రీతి కౌర్ అందించాలని యావత్ భారతం..

Tokyo Olympics 2020  Highlights: భారత్‌కు నిరాశ.. డిస్కస్‌ త్రోలో చేజారిన పతకం.. ఆరో స్థానంతో సరిపెట్టుకున్న కమల్‌ ప్రీత్‌..
Kamal Preeth

Tokyo Olympics 2020: టోక్యో ఒలంపిక్స్ 11వ రోజు కమల్‌ ప్రీత్‌ కౌర్‌ రూపంలో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరనుందని అందరూ భావించిన వేళ. అనుకోకుండా వర్షం కారణంగా డిస్కస్‌ త్రో మ్యాచ్‌ ఆగిపోయింది. అయితే ఇప్పుడు మరో క్రీడలో భారత్‌ పతకాన్ని గెలుచుకునే అవకాశం లభించింది. ఇండియాకు చెందిన ఫౌద్‌ మీర్జా ఈక్వెస్ట్రియన్‌ క్రీడలో ఫైనల్స్‌కు అర్హత సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్‌కు చేరి క్రీడాభిమానులకు ఆశలు చిగురించేలా చేశాడు. ఈ ఫైనల్స్‌ మ్యాచ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. మరికాసేపట్లో ఫలితం రానుంది.

ఫౌద్‌ మీర్జా కెరీర్‌ విషయానికొస్తే.. బెంగళూరుకు చెందిన ఈ ప్లేయర్‌ 2018 ఆసియా గేమ్స్‌లో ఇండివిడ్యువల్, టీమ్ ఈవెంటింగ్‌లో రజత పతకాలను గెలుచుకున్నాడు. ఈక్వెస్ట్రియన్ జంపింగ్ ఇండివిడ్యువల్ కేటగిరీ క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో మొత్తంగా ఎనిమిది పెనాల్టీ పాయింట్లను సాధించాడు. 47.20 స్కోర్‌తో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈక్వెస్ట్రియన్ డ్రెస్సింగ్ కేటగిరీలో ఫవాద్ 28.00 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. స్వీడన్‌కు చెందిన లూయిస్ రొమెకెతో 28 పాయింట్లతో టై అయ్యాడు. ఈ కేటగిరీలో చివరిదైన మూడో రౌండ్‌లో అతి తక్కువ పెనాల్టీ పాయింట్లు.. డ్రెస్సింగ్‌లో అధిక పాయింట్లను సాధించాడు. దీనితో 47.20 పాయింట్లు అతని ఖాతాలో పడ్డాయి. దీంతో ఫౌద్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ కేటగిరీలో మొత్తం 62 మంది రైడర్లు పాల్గొనగా ఫైనల్‌కు అర్హత సాధించి 25 మందిలో ఒకరిగా ఫౌద్‌ నిలిచాడు.

టోక్యో ఒలింపిక్స్ లో భారతీయ మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టుపై గెలిచి సగర్వంగా సెమీస్ ఫైనల్ లో అడుగు పెట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత హాకీ జట్టు సెమీస్ చేరుకుంది. పతకం సాధించాలనే పట్టుదలతో మైదానమంతా పాదరసంగా కదులుతూ మన అమ్మాయిలు పైచేయి సాధించారు. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.

క్వార్టర్ ఫైనల్‌లో భారత మహిళా హాకీ జట్టు ఆస్ట్రేలియా మహిళా జట్టుతో తలపడుతుంది. ఫస్ట్ క్వార్టర్ లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే భారత్ క్రీడాకారిణి షర్మిల పిచ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రసుతం ఇరు జట్లు గోల్స్ ఏమీ చేయలేదు.

సోమవారం ఒలింపిక్స్‌లో భారత్ తన మూడో పతకం సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం అందించగా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. సాయంత్రం బరిలోకి దిగనున్న కమల్‌ప్రీత్ కౌర్ నుంచి ఈరోజు డిస్కస్ త్రో నుంచి భారత్ పతకం ఆశిస్తోంది. మరోవైపు భారత హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో తలపడనుంది. పురుషుల జట్టు లాగే మహిళల జట్టు కూడా చారిత్రాత్మక సెమీ ఫైనల్‌కు చేరుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇవి కాకుండా, సంజీవ్ రాజ్‌పుత్-ఐశ్వర్య ప్రతాప్ సింగ్ కూడా ఈరోజు షూటింగ్ చివరి ఈవెంట్‌లో ఒక ఛాలెంజ్‌ను ప్రదర్శిస్తారు.

టోక్యో ఒలింపిక్స్ -2020 లో ఆదివారం భారతదేశానికి చారిత్రాత్మక రోజు. పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, భారత పురుషుల హాకీ జట్టు కూడా 49 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 1972 తర్వాత తొలిసారిగా భారత జట్టు ఒలింపిక్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.

సోమవారం కూడా ముఖ్యమైన రోజు కానుంది. డిస్కస్ త్రో ప్లేయర్ కమల్‌ప్రీత్, మహిళల హాకీ జట్టు నుంచి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. కమల్‌ప్రీత్ మహిళల విభాగంలో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అలాగే పతకం గెలుస్తుందని భావిస్తున్నారు. మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్ ఆడుతుంది. వారు గెలిస్తే మొదటిసారి ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంటారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Aug 2021 08:16 PM (IST)

    ఈక్వెస్ట్రియన్‌లోనూ భారత్‌కు నిరాశ..

    ఒలింపిక్స్‌ 11వ రోజున భారత్‌ పతకం సాధిస్తుందని అందరూ ఆశతో ఉన్నారు. కానీ ఒక్క పతకం కూడా దక్కలేదు. మహిళలో డిస్కస్‌ త్రోలో పతకం వస్తుందని ఊహించిన దక్కలేదు. ఇక మరో క్రీడ ఈక్వెస్ట్రియన్‌లో ఫౌద్‌ మీర్జా ఫైనల్స్‌కు చేరడంతో ఆశలు చిగురించాయి. కానీ అతను కూడా మెడల్ అందుకోలేకపోయాడు. అయితే తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఫౌద్‌ మీర్జా 23 వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో 25వ స్థానంలో నిలిచిన ఫౌద్‌ మీర్జా.. ఫైనల్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడం విశేషం.

  • 02 Aug 2021 06:54 PM (IST)

    పతకాన్ని చేజార్చుకున్న కమల్‌ ప్రీత్‌ కౌర్‌.. కానీ..

    ఎంతో ఆసక్తికరంగా సాగిన ఒలిపింక్స్‌ మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌లో భారత ప్లేయర్‌ కమల్‌ ప్రీత్‌ కౌర్‌ పతకాన్ని సాధించలేకపోయింది. ఒలింపిక్స్‌లో  మొదటి నుంచి మంచి ఆట తీరు కనబరించిన కమల్‌ ప్రీత్‌ ఫైనల్‌లో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఫైనల్స్‌లో కమల్‌ ఆరో స్థానంలో నిలిచారు. అయితే పతకాన్ని గెలుచుకోలేకపోయినా డిస్కస్‌ త్రోలో భారత్‌ నుంచి ఇది అద్భుత ప్రదర్శన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత ఒలింపిక్స్‌ క్రీడల్లో.. ఇండియా నుంచి ఇద్దరు డిస్కస్ త్రో క్రీడాకారులు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఆ సమయంలో పురుషుల ఈవెంట్‌లో భారత్‌కు చెందిన వికాస్ గౌడ ఫైనల్‌లో 8 వ స్థానంలో నిలవగా.. మహిళల ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన కృష్ణ పూనియా 7వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కమల్‌ 6వ స్థానంలో నిలవడం విశేషం.

  • 02 Aug 2021 05:58 PM (IST)

    తగ్గిన వర్షం.. మళ్లీ మొదలు కానున్న డిస్కస్‌ త్రో ఫైనల్‌ మ్యాచ్‌..

    ఆసక్తికరంగా సాగుతోన్న మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌ వర్షం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. భారత్‌కు చెందిన కమల్‌ ప్రీత్‌ కౌర్‌ ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నారు. మరి మూడో రౌండ్‌లో కమల్‌ ఎలాంటి మ్యాజిక్‌ను క్రియేట్‌ చేస్తారో చూడాలి.

  • 02 Aug 2021 05:44 PM (IST)

    భారత్‌ ఖాతాలో మరో పతకం చేరనుందా.?

    జపాన్‌ వేదికగా కొనసాగుతోన్న ఒలింపిక్స్‌లో భారత్‌ మరో పతకకాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశం లభించింది. వర్షం కారణంగా డిస్కస్‌ త్రో ఫలితం తేలలేదు. అయితే తాజాగా ఇండియాకు చెందిన ఫౌద్‌ మీర్జా ఈక్వెస్ట్రియన్‌ క్రీడలో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఊహకందని విధంగా ఫైనల్‌కు చేరి ఫౌద్‌ మీర్జా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. మరికాసేపట్లో ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. మరి ఈ క్రీడలో భారత్‌కు తొలిసారి పతకం వస్తుందో చూడాలి.

  • 02 Aug 2021 05:17 PM (IST)

    ఫలితాన్ని వాయిదా వేసిన వర్షం.. ఆగిపోయిన డిస్కస్‌ త్రో ఫైనల్‌..

    టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌ మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్‌ మొదలై రెండో రౌండ్‌ పూర్తయ్యేసరికి వర్షం మొదలైంది. దీంతో ప్లేయర్స్‌ డిస్క్‌ను విసరడం ఇబ్బందిగా మారింది. అథ్లెట్లు డిస్క్‌ను విసిరేసే సమయంలో వారి చేతిల్లో నుంచి డిస్క్‌ జారిపోయినట్లు కనిపించింది. దీంతో నిర్వహకులు మ్యాచ్‌ను ఆపేశారు. మ్యాచ్‌ ముగిసే సమయానికి భారత్‌కు చెందిన కమల్‌ ప్రీత్‌ కౌర్‌ 7వ స్థానంలో ఉంది. తిరిగి ప్రారంభమవుతుందో లేదో చూడాలి.

  • 02 Aug 2021 05:08 PM (IST)

    రెండో అవకాశం చేజార్చుకున్న కమల్‌ ప్రీత్‌ కౌర్‌..

    డిస్క్‌ను విసిరే క్రమంలో మొత్తం మూడు అవకాశాలకు గాను తొలి అవకాశంలో కమల్‌ ప్రీత్‌ కౌర్‌ ఆరో స్థానంలో నిలిచింది. అయితే రెండో అవకాశంలో మాత్రం కమల్ ప్రీత్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. రెండోసారి విసిరిన డిస్క్‌ ఫౌల్‌గా మారింది. కమల్‌ మూడో అవకాశంలో ఏమేర రాణిస్తుందో చూడాలి. ఇక కమల్‌ ప్రీత్‌ భుజానికి గాయమైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె భూజానికి బ్యాండేజ్‌ వేసుకొని ఆడుతోంది. మరి డిస్కస్‌ త్రోలో కమల్‌ ఏదో ఒక పతకాన్ని సాధిస్తుందో చూడాలి.

  • 02 Aug 2021 04:03 PM (IST)

    కాసేపట్లో డిస్కస్ త్రోలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ప్రీతి కౌర్..

    టోక్యో ఒలంపిక్స్ 11వ రోజు అథ్లెటిక్స్ లో పతకం భారత్ ఖాతాలో పడుతుందనే ఆశలను కమల్‌ప్రీత్‌ కౌర్‌ కలిగించింది. ఒలింపిక్స్‌ క్రీడల్లో ఇప్పటివరకు భారత్‌కు లోటుగా ఉన్న అథ్లెటిక్స్‌ పతకాన్ని ప్రీతి కౌర్ అందించాలని యావత్ భారతం కోరుకుంటుంది. మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్‌ కౌర్‌ నేడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల కమల్‌ప్రీత్‌ క్వాలిఫయింగ్‌లో 64 మీ విసిరి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. ఈ ప్రదర్శనతో భారతీయులందరిలోనూ పతకంపై ఆశలు చిగురించాయి. క్వాలిఫయింగ్‌లోని తన గ్రూప్‌ ‘బి’లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా కమల్‌ప్రీత్‌ రెండో స్థానంలో నిలువడంతో ఆమెపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం నేటి ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడుతున్నారు.

  • 02 Aug 2021 01:17 PM (IST)

    భారత హాకీలో చరిత్ర సృష్టించిన ఏకైక గోల్ .. గుర్జిత్ కౌర్ చేసింది ఇలా…

    టోక్యో ఒలింపిక్స్ లో విమెన్ హాకీ క్వార్టర్ ఫైనల్ లో ఇరు జట్లు కలిసి నమోదు చేసింది ఏకైక గోల్ .. ఈ గోల్ భారత్ జట్టు చేసింది. ఈ గోల్ తోనే సగర్వంగా సెమీస్ లోకి అడుగు పెట్టింది. ఈ ఏకైక గోల్ ను గుర్జిత్ కౌర్ చేసింది. భారత హాకీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది.

  • 02 Aug 2021 12:03 PM (IST)

    పర్యావరణ రక్షణ కోసం మొక్కను పెంచమంటున్న మీరాబాయి చాను

    టోక్యో ఒలింపిక్స్ లో మొదటి పతకాన్ని తెచ్చిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వదేశానికి తిరిగి వచ్చింది. మహిళల 49 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోల బరువును ఎత్తగలిగిన చాను, కరణం మల్లేశ్వరి తరువాత ఒలింపిక్ పతకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా నిలిచిన మీరాబాయి చాను ప్రస్తుతం ప్రాక్టీస్ కు విరామం ఇచ్చి.. కుటుంబంతో , స్నేహితులతో సాదరంగా గడుపుతుంది,  మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లా నాంగ్పోక్ కాచింగ్ మీరాబాయి చాను స్వగ్రామం.. తాజాగా ఆమె పర్యావరణ రక్షణ కోసం చెట్లు నాటండి అంటూ తన సోషల్ మీడియా వేదికగా కోరుతుంది. అంతేకాదు.. తాను ఓ మొక్కని నాటి ఆ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • 02 Aug 2021 11:51 AM (IST)

    భారత్‌ను సెమీస్‌కు చేర్చడంలో అద్భుత పాత్ర పోషించిన గోల్‌కీపర్ సవిత

    భారత జట్టుని సెమీస్ కి తీసుకెళ్లడంలో భారత్ గోల్ కీపర్ సవిత పాత్ర కీలకం.. ఆమె ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. బలమైన ప్రత్యర్థి జట్టు.. ఆస్ట్రేలియాకు ఏకంగా ఎనిమిది ఫెనాల్టీ కార్నర్ లు వచ్చాయి. అయితే వాటిలో ఏ ఒక్కటి గోల్ కాకుండా అడ్డుకోవడంలో చైనా వాల్ ని నిలడ్డారు సవిత. వెంట వెంటనే వచ్చిన ఫెనాల్టీ కార్నర్లలో గోల్ కీపర్ సవిత ఏ మాత్రం తడబడినా ఈ అద్భుతం ఆవిష్కృతమయ్యేది కాదు.. కానీ వచ్చిన ప్రతి పెనాల్టీ కార్నర్ ను సక్సెస్ గా అడ్డుకున్నారు సవిత.. అంతేకాదు.. ఓపెన్ ప్లే లో ఆస్ట్రేలియా ప్లేయర్లు గోల్ పోస్ట్ పై చేసిన దానిని సమర్ధవంతంగా అడ్దకుని ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా చేయకుండా భారత్ ను విజయ తీరానికి చేర్చారు.,

  • 02 Aug 2021 11:42 AM (IST)

    టోక్యో ఒలింపిక్స్‌లో ముగిసిన భారత షూటర్ల ప్రస్థానం..

    టోక్యో ఒలింపిక్స్ లో ఒక్క పతకం సాదించకుండనే భారత షూటర్ల ప్రస్థానం ముగిసింది. సోమవారం జరిగిన పురుషుల 50 మీట‌ర్ల రైఫిల్ త్రీ పొజిష‌న్స్ ఈవెంట్‌లో షూట‌ర్లు నిరాశపరిచారు. ఈ వెంట్‌లో షూట‌ర్లు సంజీవ్ రాజ్‌పుత్‌, ఐశ్వ‌రీ ప్ర‌తాజ్ సింగ్ తోమ‌ర్‌ లు విఫ‌లం కావడంతో ఫైనల్ లోకి ప్రవేశించలేకపోయారు. 15 మంది భారత షూటర్లు ఒలింపిక్స్ కి వెళ్లగా కేవలం సౌరభ్ చౌదరీ మాత్రమే 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్‌లో ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. ఏ ఒక్కరూ పతకం సాధించలేదు.

  • 02 Aug 2021 10:06 AM (IST)

    టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు. సెమీస్‌లో అడుగు

    టోక్యో ఒలింపిక్స్ లో భారతీయ మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టుపై గెలిచి సగర్వంగా ఫైనల్ లో అడుగు పెట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత హాకీ జట్టు సెమీస్ చేరుకుంది. పతకం సాధించాలనే పట్టుదలతో మైదానమంతా పాదరసంగా కదులుతూ మన అమ్మాయిలు పైచేయి సాధించారు. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. భారత్ నుంచి గుర్జీత్‌ కౌర్‌… గోల్‌ చేసి భారత్‌కు తొలి పాయింట్‌ అందించింది. ఆస్ట్రేలియా పై 1-0 గోల్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.సెమీ ఫైనల్ కు చేరుకుంది

  • 02 Aug 2021 09:48 AM (IST)

    ఆస్ట్రేలియాపై కొనసాగుతున్న భారత్ ఆధిక్యం

    సెమీస్ లో అడుగు పెట్టడానికి గెలుపే లక్ష్యంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు బరిలోకి దిగాయి. అయితే భారత్ ఫీల్డ్ లో దిగినప్పటి నుంచి అమ్మాయిలూ పాదరసంలా కదులుతూ ఆధిపత్యం సాగించారు. ఫోర్త్ క్వార్టర్ లో అడుగు పెట్టింది. అయితే మూడో క్వా‍ర్టర్‌లోనూ భారత మహిళ హాకీ జట్టు ఆధిపత్యం కొనసాగింది. ఇప్పటికే గోల్‌ చేసిన భారత్‌.. ఏ దశలోనూ పట్టు కోల్పోకుండా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. గోల్‌ కీపర్‌ సవిత ఆసీస్‌ను గోల్‌ కొట్టకుండా అడ్డుకుంది. సెమీస్ లో భారత్ అడుగు పెట్టడానికి అమ్మాయిలు సర్వవిధాలా పోరాడుతున్నారు.

  • 02 Aug 2021 08:53 AM (IST)

    ఆస్ట్రేలియాతో తలపడుతున్న భారత జట్టు .. వెన్నునొప్పితో బాధపడుతు షర్మిల

    క్వార్టర్ ఫైనల్‌లో భారత మహిళా హాకీ జట్టు ఆస్ట్రేలియా మహిళా జట్టుతో తలపడుతుంది. ఫస్ట్ క్వార్టర్ లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే భారత్ క్రీడాకారిణి షర్మిల పిచ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రసుతం ఇరు జట్లు గోల్స్ ఏమీ చేయలేదు.

  • 02 Aug 2021 08:15 AM (IST)

    హాకీ: నేడు మహిళల వంతు..

    ఈ రోజు ఉదయం మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్ ఆడుతుంది. ఈ మ్యాచులో వారు గెలిస్తే మొదటిసారి ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంటారు. మ్యాచ్ మరికొద్దిసేపట్లో మొదలు కానుంది.

  • 02 Aug 2021 08:13 AM (IST)

    షూటింగ్: క్వాలిఫికేషన్ రౌండ్

    షూటింగ్ చివరి ఈవెంట్‌లో ఈ రోజు భారత్ బరిలోకి దిగనుంది. పురుషుల 50 మీ. 3 పోజిషన్ అర్హతలో ఐశ్వర్య ప్రతాప్-సంజీవ్ సింగ్ రాజ్‌పుత్ పోటీ పడుతున్నారు.

  • 02 Aug 2021 08:05 AM (IST)

    అథ్లెటిక్స్ – చివరి స్థానంలో ద్యుతీ చంద్

    ద్యుతీ చంద్ నాలుగవ ప్రయత్నంలో చివరి స్థానంలో నిలిచింది. లక్ష్యం చేరుకునేందుకు 23.85 సెకండ్లు తీసుకుంది. నంబియాకు చెందిన ఎంబోమా క్రిస్టీన్ 22.11 జాతీయ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది.

Published On - Aug 02,2021 8:16 PM

Follow us
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు