Kondapur Accident: మద్యం మత్తులో యువకుడి ర్యాష్ డ్రైవింగ్… పల్టీలు కొట్టిన కారు, యువతి స్పాట్ డెడ్
వీకెండ్ వస్తే చాలూ.. హైదరాబాద్ రోడ్లు నెత్తురోడుతున్నాయి. పీకలదాకా మద్యం తాగుతున్న యువత.. ఆ మత్తులో వాహనాలపై...
వీకెండ్ వస్తే చాలూ.. హైదరాబాద్ రోడ్లు నెత్తురోడుతున్నాయి. పీకలదాకా మద్యం తాగుతున్న యువత.. ఆ మత్తులో వాహనాలపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆదివారం రాత్రి కొండాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతురాలు ఆశ్రిత కెనాడాలో ఎంటెక్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని అభిషేక్‌గా ఐడెంటిఫై చేశారు. అభిషేక్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్థారించారు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే వాహనం ఎంత వేగంగా ఉందో అర్థమవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆశ్రిత డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనతో ఆశ్రిత కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ప్రాణాలు పోతున్నా లెక్కచేయడం లేదు. మరి వీళ్లు మారేది ఎలా? తాగి డ్రైవింగ్ చేయవద్దంటూ, పోలీసులు ఎన్నోసార్లు హెచ్చరించారు.. ఐనా తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని పోలీసు అధికారులు బెబుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు.
Also Read: ఏపీలో కొత్తగా 1,546 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Woman Cop: దెబ్బ అదుర్స్.. రేపిస్ట్‌ను పట్టుకునేందుకు లేడీ ఎస్‌ఐ మాస్టర్ స్కెచ్..