Telangana CET Exams: నేటి నుంచి తెలంగాణలో సెట్ ఎగ్జామ్స్.. ఇవాళ ఈసెట్ పరీక్ష..
Telangana CET Exams: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈసెట్ పరీక్ష ఇవాళ ఉదయం 9 గంటల నుంచి..
Telangana CET Exams: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈసెట్ పరీక్ష ఇవాళ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. ఎంసెట్ పరీక్షలు 4వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. వీటితో పాటు.. పీజీసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ ఇలా అన్ని పరీక్షలు ఆగస్టు నెలలో ఉన్నాయి. కాగా, తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఈసెట్)-2021 ఇవాళ జరుగనుండగా.. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఎగ్జామ్ ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. సీబీటీ(కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్) విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిటెక్‌పై ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. లేదంటే.. విద్యార్థులను పరీక్ష హాల్ లోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. కోవిడ్ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న సెట్ ఎగ్జామ్స్ వివరాలు.. ఆగస్టు 3వ తేదీన ఈసెట్ పరీక్ష జరుగనుంది. ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు.. 9,10 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షను జరుపుతారు. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ నిర్వహిస్తారు. ఆగస్ట్ 23వ తేదీన లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్ట్ 24, 25 తేదీల్లో ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
Also read:
Paralysis Symptoms: వయసుతో పనిలేకుండా వస్తున్న పక్షవాతం.. లక్షణాలు.. ఆయుర్వేదంలో నివారణ చికిత్స
Sasha Chettri: ఎయిర్టెల్ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా స్టార్ హీరో మూవీలో సాషా..
Vehicle Insurance Claim: మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా..? అయితే క్లెయిమ్ చేసుకోవడం ఎలా..?