AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sasha Chettri: ఎయిర్‏టెల్ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా స్టార్ హీరో మూవీలో సాషా..

ముందుగా యాడ్స్‏తో పాపులర్ అయ్యి ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేసిన తారలు ఎందరో ఉన్నారు. హీరోయిన్ యామిని గౌతమ్ నుంచి కృతి శెట్టి

Sasha Chettri: ఎయిర్‏టెల్ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా స్టార్ హీరో మూవీలో సాషా..
Prabahas
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2021 | 6:58 AM

Share

ముందుగా యాడ్స్‏తో పాపులర్ అయ్యి ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేసిన తారలు ఎందరో ఉన్నారు. హీరోయిన్ యామిని గౌతమ్ నుంచి కృతి శెట్టి వరకు ముందుగా యాడ్స్ చేసి.. ఆ తర్వాత వెండితెరపై కనిపించినవాళ్లే. తాజాగా మరో యాడ్ బ్యూటీ వెండితెరపై కనిపించబోతుంది. అదేనండీ.. ఆమద్య ఎయిర్‏టెల్ యాడ్‏తో పాపులర్ అయిన అమ్మాయి గుర్తుందా. ఎయిర్‏టెల్ బ్రాండ్ అంబాసిడర్ సాషా. ఆ ఆమ్మాయి పేరు కంటే ఎక్కువగా ఎయిర్ టెల్ పొట్టి జుట్టు అమ్మాయి అంటే ఠక్కున గుర్తొస్తుంది. సుదీర్ఘకాలం పాటు బ్రాండ్ అంబాసిడర్‏గా వ్యవహరించడంతో.. ఇండియాలోని అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఈ బ్యూటీ లక్కీ ఛాన్స్ అందుకుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న రాధే శ్యామ్ సినిమాలో సాషా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రోల్ మిస్టీరియస్ ఎలిమెంట్స్‌తో కథకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. అయితే సాషాకు ఇది మొదటి సినిమా మాత్రం కాదు.. గతంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలో హీరోయిన్ గా సాషా నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ప్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత సాషాకు అంతగా ఆఫర్లు రాలేదు. చాలా కాలం తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ సినిమాలో.. అది ప్రభాస్‏తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాతో అయినా సాషాకు మంచి గుర్తింపు వస్తుందో లేదో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read:

Raashi Khanna: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన బాబ్లీ బ్యూటీ రాశి..

Priyanka Chopra : బాయ్ ఫ్రెండ్‌‌‌‌ని రూమ్‌‌‌‌‌లో దాచిపెట్టి దొరికిపోయిన ప్రియాంక చోప్రా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

Rakshasudu 2: ఈసారి లండన్‌లో రాక్షసుడి ఆకృత్యాలు.. సీక్వెల్‌ సినిమాకు ఎంత ఖర్చు చేయనున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..