Priyanka Chopra : బాయ్ ఫ్రెండ్‌‌‌‌ని రూమ్‌‌‌‌‌లో దాచిపెట్టి దొరికిపోయిన ప్రియాంక చోప్రా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

ప్రియకచోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ...

Priyanka Chopra : బాయ్ ఫ్రెండ్‌‌‌‌ని రూమ్‌‌‌‌‌లో దాచిపెట్టి దొరికిపోయిన ప్రియాంక చోప్రా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
Pc
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 02, 2021 | 10:41 PM

Priyanka Chopra : ప్రియకచోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలతోపాటు.. తన పెళ్ళితోకూడా వార్తల్లో నిలిచింది. తనకన్నా వయసులో 10ఏళ్ళు చిన్న వాడైనా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌‌‌ను వివాహమాడిన ప్రియాంక పై అప్పట్లో విమర్శలు ఓక్ రేంజ్‌‌‌‌లో వెల్లువెత్తాయి. అయితే తన పై విమర్శలు చేసిన వారికి దీటుగా సమాదానాలు కూడా చెప్పింది ఈ చిన్నది. ప్రస్తుతం భర్తతో కలిసి హ్యాపీగా లైఫ్‌‌‌‌‌ను లీడ్ చేస్తోంది ప్రియాంక. బాలీవుడ్ సినిమాలే కాదు అడపాదడపా హాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది ప్రియాంక. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా ఆత్మకథ `అన్ ఫినిష్డ్` అనే పేరుతో ఓ బుక్‌‌‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బుక్‌‌‌లో సెన్సేషనల్ విషయాల్ని వెల్లడించింది పీసీ. తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్నీ ఈ బుక్‌‌‌‌లో రాసుకొచ్చింది. తనకు సంబంధించిన ఎవరికీ తెలియని రహస్యాలను కూడా ఈ బుక్‌‌‌లో ప్రియాంక ఓపెన్ చేయడంతో అభిమానులు రకకలుగా చర్చించుకుంటున్నారు.

ఇందులో భాగంగానే చిన్నతనంలో తాను చేసిన ఓ చిలిపి పనిని అన్ ఫినిష్డ్ బుక్‌‌‌‌లో రాసుకొచ్చింది ప్రియాంక. 10వ తరగతి చదువుతున్న సమయంలో తన బాయ్ ప్రెండ్‌‌‌‌తో రోమన్స్ చేస్తూ దొరికిపోయానని తెలిపింది ప్రియాంక. ఒకసారి తన బాయ్ ఫ్రెండ్‌‌‌‌ను తన గదిలో దాచిపెట్టిందట. అయితే ఆ విషయాన్ని తన ఆంటీ కనిపెట్టి.. తన తల్లికి ఫిర్యాదు చేసిందిట. ‘పదో తరగతిలో బాబ్ అనే అబ్బాయిని కలుసుకున్నా, అతను తన ఫన్నీ చేష్టలతో నవ్వించేవాడు అని, దాంతో అతడితో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది పీసీ. అంతే కాదు అతడిని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా అని చెప్పుకొచ్చింది. అయితే ఒక రోజు అతను ఎవరూలేని సమయంలో మా ఇంటికి వచ్చాడు. ఇద్దరం కలిసి టీవీ చూస్తున్న సమయంలో సడన్‌‌‌గా మా ఆంటీ వచ్చారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక తనను నా గదిలో దాచిపెట్టాను. కానీ మా అత్తా అతడిని  కనిపెట్టేసింది. ఆతర్వాత మా అమ్మకు ఫిర్యాదు చేసింది అని తన పుస్తకంలో రాసుకొచ్చింది పీసీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అసలు మీరు రైటరే కాదు.. కదా..?మరి 33 ఏళ్లుగా విజేంద్రప్రసాద్ స్టోరీస్ ఎలా ఇచ్చారు..?:Vijayendra Prasad Video.

Rakshasudu 2: ఈసారి లండన్‌లో రాక్షసుడి ఆకృత్యాలు.. సీక్వెల్‌ సినిమాకు ఎంత ఖర్చు చేయనున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.