AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Campaign: దోమలకి నివారణకు మస్కిటో హంటింగ్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు..

GHMC Campaign: వినడానికి వింతగా ఉన్న మీరు విన్నది నిజమే.. ఫీవర్ సర్వే , వైరస్ సర్వ్ ...ఇప్పుడు మస్కిటో సర్వే ట్రెండ్ కి తగ్గట్లే దోమలు కూడా దారి మార్చాయి.. నీటిలోనే కాదు తాళం ఉన్న...

GHMC Campaign: దోమలకి నివారణకు మస్కిటో హంటింగ్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు..
Ghmc Survey On Mosquitoes
Surya Kala
|

Updated on: Aug 03, 2021 | 6:43 AM

Share

GHMC Campaign: వినడానికి వింతగా ఉన్న మీరు విన్నది నిజమే.. ఫీవర్ సర్వే , వైరస్ సర్వ్ …ఇప్పుడు మస్కిటో సర్వే ట్రెండ్ కి తగ్గట్లే దోమలు కూడా దారి మార్చాయి.. నీటిలోనే కాదు తాళం ఉన్న ఇళ్లలో కూడా నివాసం ఉంటూన్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు. అందుకే వెర్ యూ గో వి ఫాలో యు అంటూ మస్కిటో హంటింగ్ చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ఈ సర్వే పై నెవెర్ బెఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూహెచ్‌ఎంసీ అధికారులని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు హైదరాబాద్ ప్రజలు

మొన్నటి వరకు హైదరాబాద్ కరోనా హాట్ స్పాట్స్… ఇప్పుడు దోమలకి కూడా హాట్ స్పాట్స్ , కల్స్టర్స్ తో భాగ్యనగర ప్రజలు వణికి పోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు 34వేల హాట్స్పాట్స్ తో జీహెచ్‌ఎంసీ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ కి సిద్ధం అయ్యింది. అధికారులు ఇచ్చిన సర్వే వివరాల ప్రకారం 360- అతి సమస్యాత్మక ప్రాంతాలు , 5325- కన్స్ట్రుక్షన్ స్లైట్లు , పాఠశాలలు-3272 , ఫంక్షన్ హాల్స్-764 , సెల్లర్లు-3348 , ఓపెన్ ఫ్లాట్స్- 5385 , తాళం వేసిన ఇల్లు-16192 ఇవే ఇప్పుడు దోమలకి అడ్డాలు. ఇక్కడే లార్వా పూర్తిస్థాయి దోమగా మారుతుందని అధికారులు గుర్తించారు

గత కొంతకాలంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు అయిన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. కేవలం దోమల వృద్దే ఈ వ్యాధులకు ప్రధాన కారణం అని నిర్ధారణ కి వచ్చి ..ఇవాళ్టి నుండి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణకు నడుం బిగించారు అధికారులు.360 అతి సమస్యాత్మక ప్రాంతలని గుర్తుంచు తగిన చర్యలు తీసుకుందేన్గాడుకు ప్రత్యేక బృందల్ని కూడా ఏర్పాటు చేశారు. 477 ప్రాంతాలు కాళిగా ఉండడంతో అక్కడే దోమల వృద్ధి జరుగుతున్నది అని అధికారులు గుర్తించరూ.అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారూ.నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలి అంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ లో దోమల వల్లే డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా వచ్చాయని ..అది అధిగమించదానికే ఈ 100రోజుల కార్యాచరణ అన్నతున్నారు.

ఒక వైపు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మరోవైపు అక్కడ స్థానికులు అధికారులపై మండిపడ్డారు. ఎప్పుడో ఒక్కసారి వచ్చి పై పై చేస్తూ వెళ్తున్నారని. దోమలకి ఆంటీ లార్వా ఆపరేషన్ సరిగా చేస్తే ఎన్ని లక్ష్యల సంఖ్యలో దోమలు ఎందుకు వృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. నిల్వ ఉన్న ఒక గరిటడు నీటిలో ఎన్ని లార్వా, దోమల గుడ్లు నిల్వ చేసాయో చూపిస్తు సిబ్బంది.. ప్రజలకి నిల్వ ఉంచుకుజేటే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

Sravani, TV9 Telugu, Hyderabad

Also Read:  పుదీనాకు సంబంధించి ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..