AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pudina Benefits : పుదీనాకు సంబంధించి ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Pudina Benefits : పుదీనా ఆకులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఫేస్ వాష్‌లు, మాయిశ్చరైజర్లు వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులకు

Pudina Benefits : పుదీనాకు సంబంధించి ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Pudina
uppula Raju
|

Updated on: Aug 02, 2021 | 7:37 PM

Share

Pudina Benefits : పుదీనా ఆకులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఫేస్ వాష్‌లు, మాయిశ్చరైజర్లు వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దీనిని వాడుతారు. పుదీనా ఆకులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో చక్కగా పనిచేస్తాయి. పుదీనా ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి చర్మంలో క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.

1. మొటిమలు పుదీనా ఆకులలో సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ ఉంటాయి, ఇవి చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. జిడ్డు చర్మం ఉన్న వ్యక్తులు మొటిమల సమస్యకు ఎక్కువగా గురవుతారు. పుదీనాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మీరు పుదీనా ఆకుల పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత కడగాలి. ఈ పేస్ట్ మచ్చలను తగ్గిస్తుంది చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది.

2. గాయాలను నయం చేస్తుంది పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై కోతలు, దోమ కాటు, దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం మీరు పుదీనా ఆకుల రసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఈ విషయాలు మీ గాయాన్ని నయం చేస్తాయి. చికాకును తగ్గించడంలో సహాయపడతాయి.

3. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది పుదీనా ఆకులు తేలికపాటి ఆస్ట్రిజెంట్‌గా పనిచేస్తాయి. ఇవి చర్మ రంధ్రాల నుంచి మురికిని తొలగించి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతాయి. ఇది మీ చర్మంలో రక్త ప్రసరణను పెంచడంలో దోహదపడుతుంది. ఇది కాకుండా చర్మంపై ముడుతలను, గీతలను నివారిస్తుంది. మీరు పుదీనా ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది పుదీనా ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాపడుతాయి. దీని కోసం మీరు పుదీనా గుజ్జును కళ్ల కింద రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇది మీ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.

5. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది పుదీనా ఆకులలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి నల్ల మచ్చలు, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతాయి. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. పుదీనా ఆకులను చర్మం ప్రకాశవంతం కావడానికి ఉపయోగిస్తారు.

వివాహమైన 45 రోజులకే విడాకులు కోరిన భార్య..! భర్త గురించి ఆమె చెప్పిన కారణం తెలిస్తే అందరు షాక్..

Prakasam District: “విద్యుత్ శాఖకు వద్దు.. మాకు పర్సనల్‌గా ఇస్తే పని అయిపోతుంది”.. అవినీతి చేపలు అడ్డంగా బుక్కయ్యాయి

Tokyo Olympics 2020 Live: భారత్‌కు నిరాశ.. డిస్కస్‌ త్రోలో చేజారిన పతకం.. ఆరో స్థానంతో సరిపెట్టుకున్న కమల్‌ ప్రీత్‌..