AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : పరగడుపున ఈ 3 ఆహారాలు తినండి..! డయాబెటీస్‌ని కంట్రోల్ చేయండి..

Health Tips : సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. అందులో ఒకటి మధుమేహం.

Health Tips : పరగడుపున ఈ 3 ఆహారాలు తినండి..! డయాబెటీస్‌ని కంట్రోల్ చేయండి..
Blood Sugar
uppula Raju
|

Updated on: Aug 02, 2021 | 8:24 PM

Share

Health Tips : సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. అందులో ఒకటి మధుమేహం. హార్మోన్ల అసమతుల్యత, ధూమపానం, శారీరక శ్రమ తగ్గడం, ఊబకాయం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణం క్లోమ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేయడం. ఇన్సులిన్ ఒక రకమైన హార్మోన్ ఇది రక్తంలో గ్లూకోజ్‌తో కలిసి శరీరానికి శక్తిని అందిస్తుంది. డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు అనియంత్రితంగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం రక్తంలో అధిక చక్కెర.. గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్, ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే రోజువారీ జీవనశైలి, ఆహారంలో మార్పు చేయడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించవచ్చు. రక్తంలో అధిక చక్కెర ఉన్న రోగులలో కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పచ్చి మిరపకాయలు : పచ్చి మిరపలో పెద్ద మొత్తంలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల రోజూ ఖాళీ కడుపుతో 30 గ్రాముల పచ్చిమిర్చి తినండి. ఇది పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది.

2. మెంతికూర : మెంతికూరలో విటమిన్ సి, ఎ, బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫాస్పోరిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఇది చేయుటకు రాత్రిపూట ఒక గ్లాసులో టీస్పూన్ మెంతి గింజలను నానబెట్టి ఉదయం ఈ నీరు తాగాలి.

3. అల్లం : రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అల్లం చాలా ముఖ్యం. అడ్రక్ లోని సూత్రాలు ఇన్సులిన్ పెంచడానికి సహాయపడతాయి. రోగులు ఖాళీ కడుపుతో అల్లం నీరు లేదా అల్లం టీ తీసుకోవాలి. అల్లం పొడి లేదా పచ్చి అల్లం తినడం కూడా మంచిది.

Pudina Benefits : పుదీనాకు సంబంధించి ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Lucky Draw Scam: ఆర్మూర్‌లో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ. ఆరు కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..

Rangam Bhavishyavani: ఎంతటి రోగాలనైనా పారద్రోలుతా.. లాల్ దర్వాజ ఆలయంలో అనురాధ భవిష్యవాణి