Rangam Bhavishyavani: ఎంతటి రోగాలనైనా పారద్రోలుతా.. లాల్ దర్వాజ ఆలయంలో అనురాధ భవిష్యవాణి

ఈ కార్యక్రమంలో పచ్చి కుండపై నిలుచున్న అనురాధ భవిష్యవాణి వినిపించారు. కరోనాను మించిన రోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఎంతటి రోగాలనైనా పారద్రోలుతా అంటూ రంగం వినించారు. 

Rangam Bhavishyavani: ఎంతటి రోగాలనైనా పారద్రోలుతా.. లాల్ దర్వాజ ఆలయంలో అనురాధ భవిష్యవాణి
Anuradha Bhavishyavani
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 02, 2021 | 7:25 PM

ఆషాఢ మాసం బోనాలు చివరికి చేరుకున్నాయి. ఇవాళ్టితో హైదరాబాద్‌లో బోనాల సందడి ముగిసింది. గోల్కోండ కోటలో తొలివారం ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగుస్తాయి. పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పచ్చి కుండపై నిలుచున్న అనురాధ భవిష్యవాణి వినిపించారు. కరోనాను మించిన రోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఎంతటి రోగాలనైనా పారద్రోలుతా అంటూ రంగం వినించారు.

నా గుడిని ఎంత వరకు చేసుకోవాలో అంతవరకు కట్టించుకున్నా.. ఇంత బాధలో ఉన్నప్పటికీ నాకు పూజలు చేసి నన్ను సంతోషపరిచారు. మిమ్మల్ని నేను చల్లంగా చూసుకునే దాన్నే కానీ చిన్న చిన్న తప్పులు.. ఆటంకాలు వల్ల పెద్ద పెద్ద ముప్పులు తెచ్చుకుంటున్నారు. కానీ దీని కన్నా పెద్ద రోగాలు వచ్చేది ఉంది. ఎలాంటి అంటు రోగాలు వచ్చినా నా గుడికి వచ్చి బండారుని తీసుకుని నుదిట పెట్టుకోండి. భోజనం సేవించండి.. ఎంతటి రోగాలనైనా పారద్రోలుతా.. నన్ను సాగనంపకకుండా మీ ఇళ్లలో పెట్టుకుని.. పసుపు ముద్దలు చేసి వాయినాలు ఇచ్చుకోండి. ఐదు వారాలు సాక పెట్టి, హారతి ఇచ్చి, మారుబోజనం మంచిగా చేసుకుంటే ఎవ్వరికి ఏమీ కాకుండా చూసుకుంటా.. అంటూ అనురాధ రంగం వినిపించారు.

ఇవి కూడా చదవండి: Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..

Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..