Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..

మనం తీసుకునే రుణాలు మనను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో మనం  అసలు కంటే వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము చెప్పే కొన్ని ప్రత్యేక చిట్కాలను గుర్తుంచుకోండి.

Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..
Personal Loan
Follow us

|

Updated on: Aug 02, 2021 | 3:51 PM

మనం తీసుకునే రుణాలు మనను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో మనం  అసలు కంటే వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మీరు వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటే.. మేము చెప్పే కొన్ని ప్రత్యేక చిట్కాలను గుర్తుంచుకోండి. ఇది రుణంపై వడ్డీ రేటును తగ్గించడంలో సహాయపడుతుంది.  ముందుగా.. క్రెడిట్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం.. క్రెడిట్ స్కోర్ అంటే మీరు చేసే క్రెడిట్ లేదా లోన్ చెల్లింపుల్లో జరిగే పరిణామాలకు అనుగుణంగా మీ క్రెడిట్ స్కోర్ ఉంటుంది. స్కోరు బాగుందా లేదా అనేది మీ చెల్లింపులపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఎంత వరకు రుణం తీసుకోగలరో ఈ క్రెడిట్ స్కోరు నిర్ణయిస్తుంది.

1-క్రెడిట్ స్కోరు

క్రెడిట్ స్కోరు అనేది మీ క్రెడిట్ విలువను సూచించే మూడు అంకెల సంఖ్య. మీ క్రెడిట్ చరిత్ర ఆధారంగా మీ క్రెడిట్ కార్డ్ బకాయిలు .. మీరు తీసుకున్న అప్పుల EMIలను మీరు తిరిగి చెల్లించగలిగే అవకాశం ఉంది. RBI-రిజిస్టర్డ్ నాలుగు ఉన్నాయి. క్రెడిట్ బ్యూరోలు భారతదేశంలో- సిబిల్, (CRIF )హై మార్క్, (Equifax )ఎక్స్పీరియన్ వాటిలో ప్రతి ఒక్కటి వారి స్వంత స్కోరింగ్ నమూనాను కలిగి ఉంటాయి. స్కోరు సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. అధిక స్కోరు మీరు బాధ్యతాయుతమైన రుణగ్రహీత అని సూచిస్తుంది.  అందువల్ల మీకు వెంటనే రుణం లభించే ఛాన్స్ ఉంటుంది.

మీరు రుణా తీసుకున్న తర్వాత తిరిగి చెల్లంచడం కూడా ఓ గొప్ప విషయంగా చెప్పకోవచ్చు. ప్రజలందరూ ఈ కళలో నిష్ణాతులు కాదు.. వారు సరిగ్గా నిర్వహించకపోతే వారు అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. మీ క్రెడిట్ స్కోర్ 800 అయితే  బ్యాంకులు మీకు సులభంగా రుణం ఇస్తాయి. మీరు ఎక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే అది మంచిది. ఎందుకంటే మీరు బ్యాంకులకు తక్కువ రిస్క్ ఉన్న రుణదాతగా మారుతారు. క్రెడిట్ స్కోరు మీరు రుణం లేదా క్రెడిట్ కార్డ్‌కు అర్హత కలిగి ఉన్నారో లేదో కూడా నిర్ణయిస్తుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే మీరు చాలా లోన్ ఆఫర్‌లను పొందలేరు. బ్యాంకులు మీకు రుణం ఇచ్చినప్పటికీ అవి భారీ ఎత్తున వడ్డీని వసూలు చేస్తాయి.

2-రుణం కోసం సరైన బ్యాంకును ఎంచుకోండి

మీకు క్రెడిట్ స్కోర్ బాగుంటే.. మంచి బ్యాంకును ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే మనం తీసుకునే రుణంకు అనుకూలంగా వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయిస్తాయి. అన్ని బ్యాంకు వడ్డీ రేట్లు ఒకేలా ఉండవు.. ఇలాంటి సమయంలో మనం ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నామో కూడా చూసుకోవాలి. అన్ని బ్యాంకుల రుణాలను చూడాలి.. వాటిని సరిపోల్చుకోవాలి.. షరతులను తనిఖీ చేయడం, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపెయిమెంట్ ఫీజు మొదలైనవాటిని చేసిన తర్వాత మాత్రమే రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంతే కాదు మనం ప్రతి నెల కట్టాల్సిన  EMIని కూడా చూసుకోవాలి. ఇది చూసేందుకు వ్యక్తిగత రుణ EMI కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు. వివిధ బ్యాంకుల EMI లను సరిపోల్చండి. మీ బడ్జెట్‌ను లెక్కించండి. మీరు సరైన EMI చూసిన చోట రుణం తీసుకోండి. ఇది మీకు వడ్డీని  ఆదా చేయడంలో సహాయపడుతుంది.

3-ప్రత్యేక ఆఫర్‌లను చూడాలి.. 

అన్ని బ్యాంకులు తమ సొంత స్థాయిలో రుణదాతల కోసం ప్రత్యేక వడ్డీ ఆఫర్లను ప్రకటించాయి. వ్యక్తిగత రుణాలపై డిస్కౌంట్‌లతో పాటు కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించబడ్డాయి. ఈ ఆఫర్లు రుణాలు.. క్రెడిట్ కార్డులపై ఇవ్వబడ్డాయి. పండుగ సీజన్‌లో ఇటువంటి ప్రత్యేక ఆఫర్లు ఇవ్వబడతాయి. ఆగస్టు నెల నుంచి పండుగ సీజన్ ప్రారంభమైంది. ఓనం, రక్షా బంధన్, గణేష్ చతుర్థి వంటి పండుగలు ఈ నెలలోనే ఉంటాయి. దీని తరువాత పండుగల పరంపర నవంబర్ వరకు కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో బ్యాంకులు చాలా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.  ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు మనం ఫోకస్ పెట్టాలి. ఈ ఆఫర్లు ప్రకటించిన సమయంలో లోన్ తీసుకుంటే మనకు వడ్డీ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 

4-బ్యాంకుల ఆఫర్లు 

ఇక్కడ మనం కొన్ని బ్యాంక్ ఆఫర్లను పరిశీలిద్దాం…

టాటా క్యాపిటల్ పర్సనల్ లోన్… ఈ బ్యాంకు తన వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు 11.75 నుంచి 18.00 వరకు ఉంటుంది. 24 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఈ రుణానికి అర్హులు. మీరు జీతం తీసుకుంటే కనీస వయస్సు 24 సంవత్సరాలు.. గరిష్టంగా వయసు 55 సంవత్సరాలు. స్వయం ఉపాధి పొందిన వ్యక్తులకు గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. ఒకవేళ మీకు జీతం లభిస్తే.. మీరు ప్రస్తుత కంపెనీలో 1 సంవత్సరం పాటు పని చేయడం తప్పనిసరి.

టాటా క్యాపిటల్ పర్సనల్ లోన్ కింద రూ. 20 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణం 6 సంవత్సరాల పాటు ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ టాప్ అప్ లోన్, ఇ-అప్రూవల్ సౌకర్యం ఇందులో అందుబాటులో ఉంది.

సిటీ బ్యాంక్: ఈ బ్యాంకులో వ్యక్తిగత రుణాల వడ్డీ రేటు 10.99-17.99 శాతం. ఇందులో రూ .30 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇది మీ ఆదాయం అర్హత, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారు. తిరిగి చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడి రుణం, వడ్డీలో మార్పులు ఉంటుంది. ఈ వ్యక్తిగత రుణానికి ఎలాంటి హామీదారు అవసరం లేదు. సిటీ బ్యాంక్ ఇందులో ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయదు.

ఇండస్ఇండ్ బ్యాంక్ రుణం 11.00-16.75 శాతం. 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు ఈ రుణం తీసుకోవచ్చు.

స్వయం ఉపాధి పొందిన వ్యక్తులకు గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. మీరు జీతం తీసుకుంటే ప్రస్తుత ఏదైనా కంపెనీలో కనీసం 1 సంవత్సరం పని చేసి ఉండాలి. స్వయం ఉపాధి పొందుతు వ్యక్తికి  5 సంవత్సరాల అనుభవం అవసరం. దీని కోసం మీరు చెల్లుబాటు అయ్యే ఓటర్ ఐడి ప్రూఫ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా ఇవ్వాలి. ఈ పత్రాలలో ఏదో ఒకటి సమర్పించాలి.

ఇవి కూడా చదవండి: Wife Murdered: చట్నీ రుచికరంగా చేయలేదని భార్యను హత్య చేసిన భర్త.. నిందితుడి కోసం పోలీసుల వేట..

AP Govt: SSC పరీక్ష ఫలితాల వెల్లడికి ఫార్ములా.. హైపవర్ కమిటీ సిఫార్సులను ఓకే చేసిన రాష్ట్ర సర్కార్..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్