Hanuman Pooja: మంగళవారం హనుమంతుడికి పూజ చేసే విధానం.. కలిగే ఫలితాలు ఏమిటంటే..

Tuesday Hanuman Pooja Tips: రామ భక్తుడు హనుమంతుడు రామాయణంలో ముఖ్యమైన పాత్ర. సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో..

Hanuman Pooja: మంగళవారం హనుమంతుడికి పూజ చేసే విధానం.. కలిగే ఫలితాలు ఏమిటంటే..
Hanuman
Follow us
Surya Kala

|

Updated on: Aug 03, 2021 | 6:26 AM

Tuesday Hanuman Pooja Tips: రామ భక్తుడు హనుమంతుడు రామాయణంలో ముఖ్యమైన పాత్ర. సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడుతున్న దేవుడు ఆంజనేయుడు. మంగళవారం వాయుపుత్రుడైన హనుమంతుడికి ఏ విధంగా పూజ చేస్తేశుభ ఫలితాలు కలుగుతాయంటే ..

*ఆంజనేయ స్వామికి పూజ ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది. *ఐదు సంఖ్య హనుమంతునికి చాల ప్రీతికరం. కనుక హనుమాన్ మందిరంలో 5 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. *ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించడం, ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. *హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పళ్ళు , మామిడి పళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును. *సంతానం లేనివారు మండలం రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ప్రతి నిత్యం అరటిపండు నివేదించి, ఆ పండును ప్రసాదంగా తీసుకుంటే సంతానం తప్పకుండ కలుగుతుందని భక్తుల నమ్మకం.

ఆంజనేయ స్వామిని పూజించడం వలన శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని విశ్వాసం. జాతకరీత్యా శని గ్రహ దోషంతో బాధపడుతున్న వారు హనుమంతుడిని పూజిస్తే గ్రహశాంతిని పొందుతారు. *ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. *నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు ఆంజనేయుడిని స్మరించినవారికి మృత్యుభయం తొలగుటతో పాటుగా సర్వత్ర విజయం లభిస్తుంది.

హనుమంతుడికి సింధూరము ఎందుకు పూస్తారు?

ఒకానొక సందర్భంలో సీతమ్మ నుదుటున సిందూరం పెట్టుకోవడ చూసిన హనుమంతుడు, సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా? అని ప్రశ్నించగా. అందుకు సీతమ్మ చిరుమందహాస ధారిణి ” శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా వుండాలని చెప్పగా. హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒళ్ళంతా సింధూరం పూసుకొన్నాడట. అందుకనే హనుమంతుడికి సింధూరం చాలా ఇష్టమట.. ప్రతి మంగళవారం సింధూరం.. నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే.. మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. హనుమంతుడికి పూజ చేయించిన తరువాత, తోటి భక్తులకు ప్రసాదంగా లడ్డూలను, సిందూరాన్ని పంచుతారు. కొందరు భక్తులు హనుమజ్జయంతి పూజను దీక్ష పూని 41రోజుల పాటు నిష్టతో మండల దీక్షను చేస్తారు.

Also Read: మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలతో నింపే కామాక్షిదీపం అంటే ఏమిటి.. ఎలా పెట్టాలంటే