- Telugu News Photo Gallery Spiritual photos Significance of bilwa patra bel patra in hindu pujas and rituals
Bilwa Patra: బిల్వపత్రం ఎన్ని రకాలు.. ఏయే బిల్వపత్రాలతో పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయంటే
Bilwa Patra: హిందూ ధర్మంలో బిల్వ పత్రానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని మారేడు దళం అని కూడా అంటారు. వినాయక చవితి రోజు చేసే పూజలో ఈ బిల్వ పత్రం రెండవది. మహాదేవుడికి కూడ అత్యంత ప్రీతిపాత్రమైనది. అయితే ఈ బిల్వపత్రంలో అనేక రకాలు ఉన్నాయి. వీటితో పూజిస్తే.. ఏయే ఫలితాలు ఇస్తాయంటే..
Updated on: Aug 03, 2021 | 10:46 AM

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం౹ త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ మహాదేవుడిని పూజిస్తారు. ఈ త్రిదళ బిల్వ పత్రంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై వుంటారు.

ఈ బిల్వపత్రాలను సోమ,మంగళ,శుక్ర వారములలో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయాలలో కోయరాదు.

ఈ బిల్వపత్రాలు చాలా రకాలున్నాయి. ఏకబిల్వం, త్రి బిల్వం, సప్త బిల్వం, షణ్ముఖ బిల్వం, పంచముఖ బిల్వం, అఖండ బిల్వం

అఖండ బిల్వం. అంటే అనేక ఆకులుంటాయి. ఈ బిల్వ పత్రాన్ని గల్లాపెట్లో వుంచిన వ్యాపారాభివృద్ధి, ఈ ఆకుతో ఇంట్లో పూజిస్తే వాస్తుదోషాలు తొలగుతుంది.

ఆరు నుంచి 21 రేకులు కలిగిన బిల్వ పత్రం తో పూజిస్తే చేపట్టిన పనుల్లో అఖండ విజయం లభిస్తుంది.

త్రి దళం, ఉమ్మెత్త పువ్వుని కలిపి పూజిస్తే.. చతుర్విధ పురుషార్ధాలు లభిస్తాయి.

శ్వేతబిల్వంతో పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయి.




