AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..

సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది.  ప్రతీది సంచలనంగా మారుతోంది. ఈ మధ్యకాలంలో వివాహా వేడకలకు...

Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..
Bride Doing Pushups
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 02, 2021 | 4:39 PM

సోషల్ మీడియా ఓ గొప్ప వేదికగా మారుతోంది. ఈ వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా మారుతోంది. టెక్నాలజీ అభివృద్ది చెందడంతో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది.  ప్రతీది సంచలనంగా మారుతోంది. ఈ మధ్యకాలంలో వివాహా వేడకలకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇవి సోషల్ మీడియా యూజర్లు తెగ ఇష్టపడుతున్నారు. సామాజిక మద్యమాల్లో వచ్చే వధువు, వరుడి సరదా సరదా వీడియోలను చాలా చూసినప్పటికీ.. పెళ్లి రోజున వధువు లెహంగా ధరించి పుషప్స్ చేయడం ఎప్పుడైనా చూసారా? అవును.. వధువు అదే పని చేసింది.  కానీ ఈ సమయంలో ఆమె పుష్-అప్‌లు చేయడంపైనే జోకులు పేలుతున్నాయి.

కరోనా వ్యాప్తం సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము ఫిట్‌గా ఉంచుకోవాలని చూస్తున్నారు. అయితే వ్యాయామం గురించి ఇంత క్రేజ్ మీరు ఇంతకు ముందు చాలా అరుదుగా చూశారు. వధువు తన పెళ్లి రోజున కూడా తన ఫిట్‌నెస్ దినచర్యను మిస్ చేయలేదు. నిరంతరం ఒకదాని తర్వాత ఒకటిగా అనేక పుష్-అప్‌లు చేసింది.

ఈ వీడియోలో వధువు లెహంగాలో పుషప్స్ చేస్తున్నట్లు చూడవచ్చు. వధువు పుషప్స్ చేయడం చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే లెహంగా చాలా బరువుగా ఉంటుంది. అలాంటి వ్యాయామాలు చేయడం కూడా చాలా కష్టం.

View this post on Instagram

A post shared by aana arora (@aan4490)

అయితే ఇలాంటి సరదా వీడియోలను సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంది యూజర్లు ఈ వీడియోకు సరదా కామెంట్స్ జోడిస్తున్నారు. వధువు ఫిట్‌నెస్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు అనిపిస్తోందని ఒక యూజర్  వ్యాఖ్యానిస్తే.. మరొకరు మాత్రం మరింత క్యూట్‌గా స్పందించారు.  ఈ ఫన్నీ వీడియోని అనా అరోరా అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి: Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..

UP Elections 2022: పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్న లాలూ… యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్