UP Elections 2022: పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్న లాలూ… యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్

UP Assembly Elections 2022: ఓ వైపు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయలపై ప్రత్యేక దృష్టిసారించిన వేళ...తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు.

UP Elections 2022: పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్న లాలూ... యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్
Lalu-Mulayam-Akhilesh
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:24 PM

UP Elections 2022: ఇటు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయలపై ప్రత్యేక దృష్టిసారించిన వేళ…అటు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బతీసేందుకు ఇప్పటి నుంచే తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీతో వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ-ఆర్జేడీల మధ్య పొత్తు ఉండే అవకాశముందన్న ప్రచారం జోరందుకుంది. దీనిపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న ప్రధాన సమస్యలైన అసమానత, నిర్లక్షరాస్యత, రైతు సమస్యలు, పేదరికం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై ఈ సమావేశంలో ములాయం సింగ్ యాదవ్‌తో చర్చించినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది పాపులిజం, సోషలిజమే తప్ప..క్యాపిటలిజం, కమ్యునలజిం కాదని వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తులు ఉండబోవని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటికే ప్రకటించారు. చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. పొత్తుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో గత నెలలో అఖిలేష్ యాదవ్ చర్చలు జరిపారు.

Also Read..

PV Sindhu: విరబూసిన ‘సింధూ’రంపై భారత ఉభయ సభల ప్రశంసలు

 కరోనా వ్యాప్తి విషయంలో మహా ముప్పు అదే.. ఆందోళన వ్యక్తం చేస్తోన్న నిపుణులు