AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Kissing Zone: ఇచట ముద్దు పెట్టుకో రాదు.. జంటల రొమాన్స్‌ చూడలేక కాలనీ వాసుల వింత నిర్ణయం. ఎక్కడో తెలుసా.?

No Kissing Zone Mumbai: కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడింది. ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూళి పోయాయి. అయితే ఇదే కరోనా ప్రేమికులకు కూడా శాపంగా మారిందంటే...

No Kissing Zone: ఇచట ముద్దు పెట్టుకో రాదు.. జంటల రొమాన్స్‌ చూడలేక కాలనీ వాసుల వింత నిర్ణయం. ఎక్కడో తెలుసా.?
No Kissing Zone Mumbai
Narender Vaitla
|

Updated on: Aug 02, 2021 | 3:50 PM

Share

No Kissing Zone Mumbai: కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడింది. ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూళి పోయాయి. అయితే ఇదే కరోనా ప్రేమికులకు కూడా శాపంగా మారిందంటే మీరు నమ్ముతారా? కరోనా నిబంధనల కారణంగా థియేటర్లు, పార్కులు మూతపడ్డాయి ఈ కారణంతో లవర్స్‌ ఏకాంతంగా గడపడానికి ప్రదేశాలు లేకుండా పోయాయి. దీంతో కొంత మంది ప్రేమికులు ఖాళీగా ఉన్న ప్రదేశాలను వారి మాటమంతికి అడ్డాలుగా మార్చేసుకుంటున్నారు. ఇలాగే ముంబయిలోని బోరివాలిలో కొంత మంది ప్రేమికులు.. సత్యమ్‌ శివమ్‌ సుందరమ్‌ సొసైటీకి ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నారు.

లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఈ ప్రదేశానికి పెద్ద ఎత్తున ప్రేమికులు రావడం మొదలైంది. అయితే అక్కడికి వచ్చిన లవర్స్‌ కేవలం మాటలకే పరిమితం కాకుండా ముద్దులలో మునిగితేలుతున్నారు. ఇది వారికి బాగానే ఉన్న అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా మారింది. సాయంత్రం కాగానే జంటలు చేసే రొమాన్స్‌ చూడలేక.. అక్కడ జరుగుతున్న తతంగాన్ని వీడియోగా తీసి స్థానిక కార్పొరేట్‌కు చూపించారు. అయితే వారి నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో. సొసైటీకి ఎదురుగా ఉన్న రోడ్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో ‘నో కిస్సింగ్ జోన్‌’ అని రాశారు. ఇలా రాసినప్పటి నుంచి అక్కడి వచ్చే జంటల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చినట్లు కాలనీ వాసులు చెప్పడం గమనార్హం. ఈ విషయమై మాట్లాడిన సొసైటీ వాసి ఒకరు.. ‘మేము జంటలకు కానీ, ముద్దులకు వ్యతిరేకం కాదు. కానీ కపుల్స్‌ మా ఇంటి ముందు ఇలా ముద్దులు పెట్టుకుంటూ, కిస్సింగ్‌ జోన్‌గా మార్చడాన్ని మేము ఒప్పుకోము. మొదట్లో కొందరికి చెప్పి చూశం కానీ రోజురోజుకూ జంటల సంఖ్య పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ‘నో కిస్సింగ్ జోన్‌’ అని రాసిన తర్వాత జంటల సంఖ్య తగ్గితే.. మరికొందరు మాత్రం అదే ప్రదేశానికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటుండడం విశేషం. ఇప్పటి వరకు నో పార్కింగ్, నో స్మోకింగ్‌లు చూసిన వారికి ఈ ‘నో కిస్సింగ్‌ జోన్‌’ కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Also Read: Soap Nuts Vs Shampoo: ప్రకృతి ప్రసాదం కుంకుడుకాయలు.. రసాయనాల సమ్మేళనం షాంపూ.. జుట్టుకి ఏది మంచిదో తెలుసా

యునెస్కో గుర్తించిన ఈ కోటలో ఆడదెయ్యెం ఉందట..! సందర్శకులు గొంతు కూడా విన్నారట..

Telegram: గ్రూప్‌ వీడియో కాల్‌లో మరో సంచలనం.. అద్భుత ఫీచర్‌ను పరిచయం చేసిన టెలిగ్రామ్‌. ఇదే కాదు ఇంతకు మించి కూడా..