యునెస్కో గుర్తించిన ఈ కోటలో ఆడదెయ్యెం ఉందట..! సందర్శకులు గొంతు కూడా విన్నారట..

Haunted Fort : దెయ్యం అనేది ఈ ప్రపంచంలో ఉందా లేదా అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ప్రజలు దీని గురించి

యునెస్కో గుర్తించిన ఈ కోటలో ఆడదెయ్యెం ఉందట..!  సందర్శకులు గొంతు కూడా విన్నారట..
Haunted Fort
Follow us
uppula Raju

|

Updated on: Aug 02, 2021 | 3:17 PM

Haunted Fort : దెయ్యం అనేది ఈ ప్రపంచంలో ఉందా లేదా అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ప్రజలు దీని గురించి రకరకాల కథలు విని ఉంటారు. దెయ్యాలు ఉన్నాయని నమ్మే కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలలో బ్రిటన్‌లోని వేల్స్‌లోని కన్వీ ఫోర్ట్ ఒకటి. ఇక్కడికి వచ్చిన కొంతమంది సందర్శకులు ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు. నార్త్ వేల్స్‌లో ఉన్న ఈ కోటను యునెస్కో వారసత్వంగా గుర్తించారు.

ఇక్కడకు వచ్చిన చాలా మంది ఒక సన్యాసి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని కొవ్వొత్తి వెలుగులో ఒక పెద్ద మనిషి నీడ కనిపిస్తుందని చెబుతారు. అయితే ఇప్పుడు ఇక్కడ మరో దెయ్యం ఉందని కనుగొన్నారు. 2016 లో ఇక్కడకు వచ్చిన ఒక పరిశోధకుడు తాను ఇక్కడ ఒక అమ్మాయి గొంతు విన్నానని చెప్పాడు ఈ వ్యక్తి ఆ దెయ్యం స్వరాన్ని కూడా రికార్డ్ చేశాడు. ఈ హాంటెడ్ ఫోర్ట్ మెట్ల నుంచి కోట పైభాగానికి వెళ్లి అక్కడ చాలా అందమైన దృశ్యాన్ని చూడటానికి ప్రజలు ఇష్టపడతారు. అందుకే చాలామంది సందర్శకులు ఇక్కడికి వస్తారు.

ఈ కోట 13 వ శతాబ్దంలో సిస్టేరియన్ ఆశ్రమంలో నిర్మించారని చెబుతారు. ఆ కాలంలో కొన్ని ఆత్మలు ఈ కోటలో ఖైదు చేశారని నమ్ముతారు. స్థానికులు ఈ ఆత్మలను చూసినట్లు వాటి గొంతు విన్నట్లు చెబుతారు. ఒక సమాచారం ప్రకారం ఈ కోటను రాజు హెన్రీ 8 16 వ శతాబ్దంలో జైలుగా ఉపయోగించారు. ఆ జైలులో మరణించిన వారి ఆత్మలు ఇదే కోటలో తిరుగుతున్నాయని అంటారు. 2020 సంవత్సరంలో ఈ కోట వెలుపల సైనికుల దెయ్యాల వరుసను కూడా చూశామని పేర్కొన్నారు. ఒక వ్యక్తి దాని ఫొటో కూడా తీశారనే వాదన కూడా ఉంది.

Digital Currency: డిజిటల్ కరెన్సీ వైపు రిజర్వ్ బ్యాంక్ చూపు..డిజిటల్ కరెన్సీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

Telegram: గ్రూప్‌ వీడియో కాల్‌లో మరో సంచలనం.. అద్భుత ఫీచర్‌ను పరిచయం చేసిన టెలిగ్రామ్‌. ఇదే కాదు ఇంతకు మించి కూడా..

Udalu Benefits: ఈ సిరి ధాన్యం ధర తక్కువ ఆరోగ్యానికి మేలు ఎక్కువ.. ఊదలు ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే వదలరుగా