Udalu Benefits: ఈ సిరి ధాన్యం ధర తక్కువ ఆరోగ్యానికి మేలు ఎక్కువ.. ఊదలు ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే వదలరుగా

Udalu Benefits: చిరు ధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత్, పాకిస్థాన్ , నేపాల్ , జపాన్ , చైనా పర్వత ప్రాంతాలలో..

Udalu Benefits: ఈ సిరి ధాన్యం ధర తక్కువ ఆరోగ్యానికి మేలు ఎక్కువ.. ఊదలు ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే వదలరుగా
Udalu
Follow us

|

Updated on: Aug 02, 2021 | 2:51 PM

Udalu Benefits: చిరు ధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత్, పాకిస్థాన్ , నేపాల్ , జపాన్ , చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్ లో పండించగా.. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు.

రుచికి తియ్యగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహరం మంచి బలవర్ధకమైంది. ఈజీగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఊదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఊదలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు గురించి ఈరోజు తెలుసుకుందాం

*ఊదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. *ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. *సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికీ ఇవి మంచి ఆహారం *ఊదల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచిది *జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఊదలు చేస్తాయి. *ఉత్తరాఖండ్, నేపాల్ లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు , పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. *కాలేయం, పిత్తాశయం శుభ్రపర్చడానికి సహాయపడుతుంది.నియంత్రిస్తుంది * బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి , గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది * కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి *కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం పనికి వస్తాయి. *.కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి

*పెద్ద వారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి.

Also Read:

కోవిడ్‌కు చెక్ పెట్టేదిశగా ఆయుర్వేదం.. అశ్వగంధతో ఔషధం.. యూకేలో క్లినికల్ ట్రయల్స్‌

కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!