Sugarcane Juice: చెరుకు రసం తాగితే బరువు తగ్గుతారట.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
జ్యూస్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయన్న సంగతి తెలిసిందే. పండ్లను నేరుగా తీసుకోవడం కంటే.. రసం రూపంలో
జ్యూస్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయన్న సంగతి తెలిసిందే. పండ్లను నేరుగా తీసుకోవడం కంటే.. రసం రూపంలో తిసుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతి సీజన్లోనూ ఎదో ఒక జ్యూస్ లభిస్తుంటుంది. అయితే ఎప్పుడూ పండ్ల రసాలు మాత్రమే కాకుండా.. చెరుకు రసం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు అనేకం ఉంటాయి. చెరుకు రసం తీసుకోవడం వలన శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అనేక వ్యాధులతోనూ పోరాడుతుంది. చెరుకు రసంలో నిమ్మకాయ, రాతి ఉప్పు కలిపి తీసుకోవడం మంచింది. ఇందులో పీచు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అలాగే చెరుకు రసం కామెర్లు, రక్తహీనత, అసిడిటీని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా చెరుకు రసంతో వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.
1. చెరకు మన శరీరంలో గ్లూకోజ్ మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. దీనిని డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కూడా తాగవచ్చు. సహజమైన స్వీటెనర్‌లతో నిండిన చెరకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2. కామెర్లు ఉన్నవారు చెరుకు రసం తాగవచ్చు. ఇది కాలేయానికి చాలా మంచిది. కాలేయానికి సంబంధించిన వ్యాధులను తొలగిస్తుంది. అలాగే కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. 3. చెరుకు రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చెరుకు రసం తాగడం వలన శరీరంలో బలమైన నిరోధక వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా.. వైరల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. 4. చెరుకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 5. వేసవిలో చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. సూర్యకాంతి, చెమట వలన చర్మం మెరుపును కోల్పోవడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో చెరకు రసం తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా ఉంటుంది. 6. చెరకు రసం తాగడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. చెరకులో సుక్రోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ముఖంలోని అన్ని మచ్చలను తొలగిస్తుంది. 7. చెరకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఐర, పొటాషియం ఉంటాయి. ఇది శరీర ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
Also Read: Sharwanand: శర్వానంద్ సింప్లిసిటీకి చిత్రయూనిట్ ఫిదా.. షూటింగ్ సెట్లో టాలెంటెడ్ హీరో…