AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giridhar: టాలీవుడ్‏లో విషాదం.. అనారోగ్యంతో శుభముహూర్తం దర్శకుడు మృతి..

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు.. నటుడు ఇరుగు గిరిధర్ (64) కన్నుముశారు. ఆరెళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా

Giridhar: టాలీవుడ్‏లో విషాదం.. అనారోగ్యంతో శుభముహూర్తం దర్శకుడు మృతి..
Giridhar
Rajitha Chanti
|

Updated on: Aug 02, 2021 | 11:31 AM

Share

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు.. నటుడు ఇరుగు గిరిధర్ (64) కన్నుముశారు. ఆరెళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్.. అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యారు. నిన్న తిరుపతిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ సీనియర్ దర్శుకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటి వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా గిరిధర్ పనిచేశారు.

చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న గిరిధర్ జన్మించారు. 1982లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో పలువురు ప్రముఖ దర్శకుల వద్ధ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరిధర్.. ఆరెళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గుడుంబా శంకర్, అన్నవరం వన్, సుప్రీమ్, వరుడు, వంటి సినిమాలకు కో డైరెక్టర్ గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లోనూ నటించారు. అలాగే శుభముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు. గిరిధర్‌ మృతి పట్ల టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Also Read:

Tokyo Olympics 2020 Live: మూడుసార్లు ఒలింపిక్స్ విజేత ఆస్టేలియాను ఓడించి సెమిస్ లో అడుగు పెట్టిన భారత విమెన్ హాకీ టీమ్

Covid-19: కోవిడ్‌కు చెక్ పెట్టేదిశగా ఆయుర్వేదం.. అశ్వగంధతో ఔషధం.. యూకేలో క్లినికల్ ట్రయల్స్‌

Acidity Relief Tips: అసిడిటి సమస్య ఉన్నవారు మీ జీవనశైలిలో ఈ మార్పులు చేయండి.. జాగ్రత్తలు పాటిస్తే క్షణాల్లో రిలీఫ్..

Infinix Smart 5A: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో మొబైల్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో నేడు విడుదల.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!