AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కరోనా వ్యాప్తి విషయంలో మహా ముప్పు అదే.. ఆందోళన వ్యక్తం చేస్తోన్న నిపుణులు

మీరు బస్సు, షేర్ ఆటో, ట్రైన్ వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టులలో ప్రయాణిస్తున్నారా? అయితే మీరు కరోనాకు అత్యంత దగ్గర్లో సంచరిస్తున్నట్టే.. అవునా? అందుకు...

Coronavirus: కరోనా వ్యాప్తి విషయంలో మహా ముప్పు అదే.. ఆందోళన వ్యక్తం చేస్తోన్న నిపుణులు
Coronavirus.
Ram Naramaneni
|

Updated on: Aug 02, 2021 | 3:39 PM

Share

మీరు బస్సు, షేర్ ఆటో, ట్రైన్ వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టులలో ప్రయాణిస్తున్నారా? అయితే మీరు కరోనాకు అత్యంత దగ్గర్లో సంచరిస్తున్నట్టే.. అవునా? అందుకు మీ దగ్గరున్న ఆధారాలేంటి? అనడిగితే.. ఇక్కడ చాలానే సమాధానాలు కనిపిస్తున్నాయ్.. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కొందరు ఎడా పెడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణిస్తున్నారట. దీంతో అందరూ వాడే బస్సులు- క్యాబ్- షేర్ ఆటో తదితర వాహనాలు.. కరోనా హబ్బులుగా మారుతున్నాయట. తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ వస్తుందా? రాదా అటుంచితే.. అసలు సెకండ్ వేవ్ తీవ్రతే ఇంకా తగ్గలేదు. ఇక్కడ జనం చూస్తే అసలు కరోనా ఉందన్న మాటే మరిచిపోతున్నారు.. ఎవరిష్టానికి వాళ్లు తిరిగేస్తున్నారట. దీంతో కరోనా చాప కింద నీరులా అంతకంతకు విస్తరిస్తూనే ఉందట. ఈ కారణం వల్ల కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్టులు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారిపోతున్నాయట.

కరోనా కేసుల సంఖ్య తగ్గిందన్న ధీమాలో జనమంతా బయట ఇష్టారాజ్యంగా తిరగడం చేటు తెస్తున్నట్టు అంచనా వేస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో, పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో ఎక్కడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టే కనిపించడం లేదు. మాస్క్, శానిటైజేషన్ వంటి కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. ఇక సోషల్ డిస్టెన్స్ సంగతి సరే సరి. కొన్ని చోట్లయితే ఒకరినొకరు రాసుకుపూసుకు తిరిగేస్తున్నారు. దీంతో కరోనా లోలోపల విస్తరిస్తూనే వెళ్తోందని హెచ్చరిస్తున్నారు వైద్య రంగ నిపుణులు. మరీ ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టులైన ఆటోలు, బస్సుల్లో అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. బస్సు ఎక్కేటప్పుడు- దిగేటప్పుడు కనీస భౌతిక దూరం పాటించడం లేదు. కొందరైతే ఎలాంటి మాస్కు పెట్టుకోకుండా తిరిగేస్తున్నారు. దీంతో థర్డ్ వేవ్ కాదు కదా టెన్త్ వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు వైద్య రంగ నిపుణులు.

Also Read: PV Sindhu: విరబూసిన ‘సింధూ’రంపై భారత ఉభయ సభల ప్రశంసలు

Hyderabad: దడ పుట్టిస్తున్న దోమలు.. దండయాత్ర మొదలెట్టిన జీహెచ్‌ఎంసీ..

Follow Us
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?