5

Covid Cases: ఆస్ట్రేలియాను వణికిస్తున్న కోవిడ్ కేసులు.. నగరాల్లో స్ట్రిక్ట్ లాక్ డౌన్.. సిడ్నీలో రంగంలోకి సైన్యం

ఆస్ట్రేలియాను కోవిడ్ (డెల్టా వేరియంట్) కేసులు వణికిస్తున్నాయి. సిడ్నీ, బ్రిస్బేన్, క్వీన్స్ ల్యాండ్, న్యూసౌత్ వేల్స్ తదితర నగరాల్లో స్ట్రిక్ట్ లాక్ డౌన్ విధించారు. అనేక సిటీల్లో ఎప్పటికప్పుడు ఈ ఆంక్షలను పొడిగిస్తున్నారు.

Covid Cases: ఆస్ట్రేలియాను వణికిస్తున్న కోవిడ్ కేసులు.. నగరాల్లో స్ట్రిక్ట్ లాక్ డౌన్.. సిడ్నీలో రంగంలోకి సైన్యం
Army Patrols Sydney Streets
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 02, 2021 | 1:49 PM

ఆస్ట్రేలియాను కోవిడ్ (డెల్టా వేరియంట్) కేసులు వణికిస్తున్నాయి. సిడ్నీ, బ్రిస్బేన్, క్వీన్స్ ల్యాండ్, న్యూసౌత్ వేల్స్ తదితర నగరాల్లో స్ట్రిక్ట్ లాక్ డౌన్ విధించారు. అనేక సిటీల్లో ఎప్పటికప్పుడు ఈ ఆంక్షలను పొడిగిస్తున్నారు. అతి పెద్ద నగరమైన సిడ్నీలో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రాకుండా చూసేందుకు పోలీసులకు సహకరించడానికి సైన్యం కూడా రంగంలోకి దిగింది.సుమారు 300 మంది సైనికులు చేతుల్లో గన్స్ గట్రా ఏవీ లేకుండానే వీధి వీధి గస్తీ తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఇళ్లలోనే ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఐసోలేషన్ లో ఉన్నవారి పట్ల అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి కాకుండా చూసేందుకు నేరుగా సైన్యాన్ని ఇలా రంగంలోకి దించడం బహుశా మరే దేశంలోనూ ఇప్పటివరకు కనిపించలేదు. అత్యధికంగా కేసులున్న ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. వీరి హడావుడితో పలు నగరాల్లో వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

క్వీన్స్ లాండ్ లో గత 24 గంటల్లో 19 కేసులు నమోదు కాగా-న్యూసౌత్ వేల్స్ లో 2017 కేసులు వెలుగు చూశాయి. జూన్ లో పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,500 కి పైగా ఇన్ఫెక్షన్స్ నమోదైనట్టు అంచనా..సిడ్నీలో 925 మంది కోవిడ్ రోగులు మరణించారు. ఇతర ధనిక దేశాల్లోకన్నా ఆస్ట్రేలియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దేశ జనాభాలో కనీసం 70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలో లాక్ డౌన్ ఆంక్షలు పరిమితంగా ఉంటాయని ప్రధాని స్కాట్ మారిసన్ అంటున్నారు. అయితే దీని జోరు పెరగడానికి ఇండియాలో మాదిరి అక్కడ ఆయనకు ఎవరూ సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు కనబడడం లేదు. ఇండియాలో మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపు వంటివి ఇంకా కొనసాగుతున్నాయి. కానీ ఆస్ట్రేలియాలో ఇలాంటి నిబంధనలేవీ పాటించని కారణంగా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. బ్రిస్బేన్ లో గత మంగళవారం లాక్ డౌన్ ముగియాల్సి ఉన్నప్పటికీ మరో వారం పొడిగించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Pushpa First Song: ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ కోసం భారీగానే ప్లాన్ చేసిన సుకుమార్.. రిలీజ్ అప్పుడే

CM KCR: తెలంగాణపై కేంద్ర పెత్తనం చేయాలని చూస్తోంది.. కృష్ణా జలాలపై ఏపీ సర్కార్ దాదాగిరి చెల్లదుః కేసీఆర్

సుపారీ ఇచ్చి మరీ కొడుకు లేపేసిన తల్లిదండ్రులు..
సుపారీ ఇచ్చి మరీ కొడుకు లేపేసిన తల్లిదండ్రులు..
వచ్చే నెల నుంచి ఈ ఫోన్స్‌లో వాట్సాప్‌ పనిచేయదు..
వచ్చే నెల నుంచి ఈ ఫోన్స్‌లో వాట్సాప్‌ పనిచేయదు..
కపిల్‌దేవ్‌ని కిడ్నాప్ చేసిన అగంతకులు! షాకింగ్ వీడియో..
కపిల్‌దేవ్‌ని కిడ్నాప్ చేసిన అగంతకులు! షాకింగ్ వీడియో..
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయేలో చేరుతారా? ఇదిగో ఫుల్ క్లారిటీ
నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయేలో చేరుతారా? ఇదిగో ఫుల్ క్లారిటీ
‘అమ్మో హైదరాబాద్..! వద్దే వద్దు’ అంటున్న నైజీరియన్లు..
‘అమ్మో హైదరాబాద్..! వద్దే వద్దు’ అంటున్న నైజీరియన్లు..
తెలంగాణలోని ఆ గ్రామాలకు ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు..
తెలంగాణలోని ఆ గ్రామాలకు ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు..
ఎన్నిక‌ల‌కు నేత‌ల‌ను సిద్ధం చేస్తున్న సీఎం జగన్, లీడర్లతో సమావేశం
ఎన్నిక‌ల‌కు నేత‌ల‌ను సిద్ధం చేస్తున్న సీఎం జగన్, లీడర్లతో సమావేశం
సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం.. దివ్యాంగురాలైన న్యాయవాది కోసం
సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం.. దివ్యాంగురాలైన న్యాయవాది కోసం
ఎన్డీయేకు బిగ్ షాక్ ఇచ్చిన అన్నాడీఎంకే.. సంచలన ప్రకటన..!
ఎన్డీయేకు బిగ్ షాక్ ఇచ్చిన అన్నాడీఎంకే.. సంచలన ప్రకటన..!