Vehicle Insurance Claim: మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా..? అయితే క్లెయిమ్ చేసుకోవడం ఎలా..?
Vehicle Insurance Claim: వాహనం కొనుగోలు చేసిన వెంటనే ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఒక వేళ ఇన్సూరెన్స్ తీసుకున్నాక గడువు ముగిసినా వెంటనే తీసుకోవాల్సి..
Vehicle Insurance Claim: వాహనం కొనుగోలు చేసిన వెంటనే ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఒక వేళ ఇన్సూరెన్స్ తీసుకున్నాక గడువు ముగిసినా వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అప్రమత్తం కావడం బెటర్. సాధారణంగా కొన్నప్పుడే షోరూమ్‌లో బిల్లుతోపాటే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లిస్తుంటారు. అయితే ఇన్సూరెన్స్ తీసుకోవడంతోపాటే క్లెయిమ్ చేసే పద్ధతులనూ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. క్లెయిమ్ చేసుకోవడంలో విధానాలు తెలియక ఇబ్బందులకు గురవుతుంటారు.
క్లెయిమ్ చేసుకోవాలంటే..
క్లెయిమ్ చేయాలంటే ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీ పోర్టల్‌లో ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను నమోదు చేయాలి. పాలసీదారు, వాహనం, డ్రైవర్, జరిగిన ప్రమాదం, పోలీస్ స్టేషన్‌లో కేసు, ప్రమాద వివరాలను, పాలసీదారు బ్యాంకు వివరాలను పేర్కొనాలి. ఒకవేళ వాహన ఇంజిన్ లేదా ప్రధాన విడిభాగాల రిపేర్, రీప్లేస్‌మెంట్‌కు సంబంధించిన క్లెయిమైతే పోలీస్ స్టేషన్ వివరాలు అవసరం లేదు.
డాక్యుమెంట్లు:
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే పాలసీ డాక్యుమెంట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్, రిపేరింగ్ బిల్లులు, కేవైసీ వివరాలతో పాటు యాక్సిడెంట్ అయితే ఎఫ్‌ఐఆర్ కాపీని అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనం దొంగతనానికి గురైతే ఇన్వెస్టిగేషన్ నివేదిక, సర్వీస్ బుక్‌లెట్, వారంటీ కార్డులు సమర్పించాల్సి ఉంటుంది.
వాహనం మరమ్మతులు:
అయితే ప్రమాదం జరిగిన వెంటనే రిపేరింగ్ కోసం గ్యారేజీకి తీసుకెళ్లాలి. రిపేరింగ్ అయిన మొత్తానికి సంబంధించిన బిల్లులను జతచేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన సర్వేయర్ వాహనానికి జరిగిన నష్టాన్ని సర్వే చేసి అంచనా వేస్తారు. వాహనానికి అయ్యే మరమ్మతు ఖర్చులపై ఒక రోజులోగా ఆమోదం తెలుపుతారు. ఇంకా ఎక్కువ ఖర్చుంటే దాన్ని పాలసీదారే భరించాల్సి ఉంటుంది.
బీమాతోనే భద్రం
అయితే ప్రస్తుతం కాలంలో జీవిత బీమా, ఆరోగ్య బీమా అందరికీ అనివార్యమైపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అనారోగ్యం పాలైనా.. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయినా బాధితులకు ఆర్థిక భద్రతను కల్పించడంలో ఈ రెండింటిదే ప్రధాన పాత్ర. జీవిత బీమా డెత్ బెనిఫిట్‌పై ఆదాయం పన్ను ఉండదు. జీవిత బీమాలో హోల్ లైఫ్, యూనివర్సల్ లైఫ్ అని రెండు రకాలు ఉంటాయి. ఇక ఆరోగ్య బీమా పాలసీలు ప్రధానంగా మూడు రకాలు. వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్, సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా. అందుకే ప్రతి ఒక్కరు బీమాను తీసుకోవడం మంచిది.