- Telugu News Photo Gallery Business photos Aeroplane spare parts manufacture and supply factory in hyderabad
Aeroplane spare parts: విమాన విడిభాగాల తయారీ సంస్థ రఘు వంశీ హైదరాబాద్‌లో కొత్త ప్లాంట్..!
Aeroplane spare parts: విమాన విడిభాగాల తయారీ సంస్థ రఘు వంశీ హైదరాబాద్‌లో ఓ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.113 కోట్ల పెట్టుబడితో ఈ ఉత్పదక హైదరాబాదీ కంపెనీ ..
Updated on: Aug 03, 2021 | 7:31 AM

Aeroplane spare parts: విమాన విడిభాగాల తయారీ సంస్థ రఘు వంశీ హైదరాబాద్‌లో ఓ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.113 కోట్ల పెట్టుబడితో ఈ ఉత్పదక హైదరాబాదీ కంపెనీ అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఆదిభట్లలో ఈ యూనిట్‌ను రఘు వంశీ నెలకొల్పుతుండగా, అంతర్జాతీయ విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌తో తాజాగా కుదుర్చుకున్న విడిభాగాల తయారీ, సరఫరా ఒప్పందం కోసమే ప్రత్యేకంగా నిర్మిస్తోంది.

దేశీయ ఏరోస్పేస్-డిఫెన్స్ రంగంలో ప్రధాన ఎగుమతిదారుల్లో ఒకటైన రఘు వంశీకి ఇప్పటికే హైదరాబాద్‌లో 4 తయారీ కేంద్రాలున్నాయి. మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులు, ఖచ్చితమైన డెలివరీలతో గడిచిన ఐదేళ్లుగా 25శాతానికిపైగా వృద్ధితో దూసుకుపోతున్న ఈ కంపెనీ అంతర్జాతీయ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు సైతం సొంతం అయ్యాయి.

అంతర్జాతీయ జాయింట్ వెంచర్లనూ నిర్వహిస్తున్న సంస్థ.. వాణిజ్య విమానాల్లో వినియోగించే అత్యంత కీలకమైన భాగాలను తయారు చేస్తోంది. దేశ విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్లకు రక్షణ, స్పేస్ సిస్టమ్స్ విడిభాగాలనూ అందిస్తుస్తుంది. సీఎన్‌సీ, షీట్ మెటల్ ఫ్యాబ్రికేషన్, కంపోజిట్స్, ఫాస్టెనర్స్, గేర్లు, ఇంజినీరింగ్ సర్వీసుల్లోనూ మరింతగా బలపడుతోంది.

అయితే రఘు వంశీ విడిభాగాలను సరఫరా చేస్తున్న సంస్థల్లో ప్రపంచ శ్రేణి కంపెనీలు కూడా ఉన్నాయి. రోల్స్ రాయిస్, జీఈ ఏవియేషన్, హనీవెల్, కొల్లిన్స్ ఏరోస్పేస్, ఈటన్, హల్లీబర్టన్, డీఆర్డీవో, బీడీఎల్, హెచ్‌ఏఎల్ తదితర సంస్థలతో కీలక ఒప్పందాలున్నాయి. ఇస్రోకు సైతం సరఫరా చేస్తుండగా, గత 15 ఏళ్లకుపైగా ఈ రంగంలో రఘు వంశీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.




