Ravi Kiran |
Updated on: Aug 04, 2021 | 7:31 AM
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్ఐసీ వివిధ రకాల పాలసీలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి ఎల్ఐసీ జీవన్ లక్ష్య. చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా అధిక రాబడిని సమకూర్చుకోవాలనుకున్న వారికి ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరం. అదేంటో తెలుసుకుందాం.
LIC
మీరు 30 సంవత్సరాల వయస్సులో.. ఈ పాలసీని 25 సంవత్సరాల పాటు 10 లక్షల బీమాకు తీసుకున్నట్లయితే.. 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి.
మీ పాలసీ మెచ్యూరిటీ అయిన సమయానికి బీమా డబ్బుతో పాటు వెస్టెడ్ రివర్షనరీ బోనస్, ఫైనల్ అదనపు బోనస్ కలిపి అధిక మొత్తంలో రాబడిని పొందోవచ్చు. బీమా డబ్బు 10 లక్షలు, రివర్షనరీ బోనస్ 12.50 లక్షలు, అదనపు బోనస్ రూ .4.50 లక్షలు వెరిసి రూ. 27 లక్షలు
పాలసీ సమయంలో పాలసీదారు మరణించినట్లయితే.. కుటుంబ సభ్యులు లేదా నామినీగా ఉన్నవారికి ప్రతి సంవత్సరం కంపెనీ నుండి రెగ్యులర్‌గా ఆదాయాన్ని పొందుతారు.