Aadhaar Card Update: ఆధార్‌ కార్డు ఉన్న వారికి అలర్ట్‌.. ఈ సేవలు నిలిపివేత.. తప్పకుండా తెలుసుకోండి..!

Aadhaar Card Update:ఆధార్‌ కార్డు ఉన్నవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే. యూఐడీఏఐ ఇటీవల కొన్ని సర్వీసులు నిలిపివేసినట్లు ప్రకటించింది...

Aadhaar Card Update: ఆధార్‌ కార్డు ఉన్న వారికి అలర్ట్‌.. ఈ సేవలు నిలిపివేత.. తప్పకుండా తెలుసుకోండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 03, 2021 | 6:31 AM

Aadhaar Card Update:ఆధార్‌ కార్డు ఉన్నవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే. యూఐడీఏఐ ఇటీవల కొన్ని సర్వీసులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆధార్ కార్డు కలిగిన వారిపై ప్రభావం పడనుంది. ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇక సాధ్యం అయ్యే పని కాదు. అలాగే ఆధార్ కార్డు రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. పాత విధానంలో ఆధార్ కార్డును రీప్రింట్ చేసుకోవడం కుదరదు. ఈ రెండు సేవలు ఇక ఆధార్ కార్డు వాడే వారికి అందుబాటులో ఉండవు.

పీవీసీ కార్డు రూపంలో..

అయితే అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇకపోతే ఆధార్ కార్డు రీప్రింట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. ఆధార్ రీప్రింట్ పొందాలని భావించే వారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది. ఇది డెబిట్ కార్డు రూపంలో ఉంటుంది.

ఇటీవల ట్విట్టర్‌లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా యూఐడీఏఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే ఆధార్ కార్డులో తప్పులు ఉంటే.. వాటిని సులభంగానే మార్చుకోవచ్చు. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.ఆధార్ వెబ్‌సైట్ నుంచి అడ్రస్ వేలిడేషన్ లెటర్ జారీని నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు అడ్రస్ వేలిడేషన్ లెటర్ జారీని నిలిపివేసినట్టు యూఐడీఏఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Bank Customers: ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. అక్టోబర్‌ 1 నుంచి అవి చెల్లుబాటు కావు.. విత్‌డ్రా చేసుకోలేరు!

Flipkart Big Saving Days Sale: మరో బంపర్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు రానున్న ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటి నుంచి అంటే..!