AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..

ఇప్పటి జనరేషన్ టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్తూ..లేనిపోని ఇరకాటంలో పడుతోంది. ఇప్పటికే సెల్‌ఫోన్ రూపంలో ఊహించని ప్రమాదం మనిషి పక్కనే తిష్ట వేసింది...

కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..
Electric Rice Cooker
Ram Naramaneni
|

Updated on: Aug 02, 2021 | 8:31 PM

Share

ఇప్పటి జనరేషన్ టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్తూ..లేనిపోని ఇరకాటంలో పడుతోంది. ఇప్పటికే సెల్‌ఫోన్ రూపంలో ఊహించని ప్రమాదం మనిషి పక్కనే తిష్ట వేసింది. ఇక పొద్దున లేచింది మొదలు, నైట్ పడుకునేవరకు మనిషి జీవితం మొత్తం ఎలక్ట్రిక్‌మయంగా మారిపోయింది. వేడినీళ్ల దగ్గర్నుంచి..తాగే వాటర్, తినే పుడ్ కూడా ఇప్పుడు కరెంట్ ద్వారానే.

కట్టెల పొయ్యి మీద చేసే వంట, రోట్లో నూరిన పచ్చడి, రోటిలో రుబ్బిన పిండితో వేసే గారెలు..అబ్బో ఆ రుచే వేరు. కానీ ఇప్పుడు అస్సలు ఎవ్వరికి అంత టైం ఉండటం లేదు..కుదిరితే ఎలక్ట్రిక్ స్టవ్..లేందంటే ఆన్‌లైన్ ఆర్డర్. బట్.. మనం వెనకటితరం ఫార్మాలిటీస్ మళ్లీ ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలామంది మిల్లిట్స్ తినడం, యోగా చెయ్యడం, ఆయుర్వేదిక వైద్యం ఫాలో అవ్వడం వంటివి చేస్తూ బ్యాక్ ‌టూ ఓల్డెన్ ( గోల్డెన్ ) డేస్ అంటున్నారు. మీరు అంతదూరం వెళ్లకపోయినా పర్వాలేదు..కానీ కొన్ని చిన్న చిన్నవైనా పాటిస్తే జీవన ప్రమాణాలను కాస్త పెంచుకోవచ్చు. వాటిలో మనుషులు ఆరోగ్యాలకి ఇబ్బందికరంగా మారిన  రైస్ కుక్కర్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

రైస్ కుక్కర్ లో అన్నం వండితే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఉంది. రైస్ కుక్కర్లు ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాదు. ఆహారం వండేటప్పుడు గాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. ఆలా లేకపోతే ఆహారం హానికరంగా మారుతుంది. అయితే ఇక్కడ హాని కలిగించే అంశాలు కూడా రెండు రకాలు ఉన్నాయి. మొదటిది తక్షణమే పనిచేస్తుంది దీనిని ఫుడ్ పాయిజిన్ అని అంటారు. మరొకటి శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయట పడుతుంది. దీంతో ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

ఇక అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

  • ఉదర సంబంద సమస్యలు
  • గుండె సంబందిత సమస్యలు
  • కీళ్ల వాతం
  • మధుమేహం
  • గ్యాస్ సమస్యలు
  • అధిక బరువు
  • నడుము నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రెషర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్ లో వండటం సాధ్యమైనంత వరకు మానేయటమే ఉత్తమం.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించండి…)